'ఫేస్బుక్ బటన్లకు రియాక్ట్ అవ్వొద్దు'
బెల్జియం పోలీసులు ఫేస్బుక్ కొత్త రియాక్షన్ బటన్లను వాడొద్దంటూ తమ సిటిజన్లను హెచ్చరిస్తున్నారు. ఫేస్బుక్లో నచ్చిన వాటికి లైక్ కొట్టడమే కాకుండా విభిన్న అభిప్రాయాలను ఎక్స్ప్రెస్ చేయడానికి లైక్ బటన్తోపాటూ రియాక్షన్స్ ఐకాన్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే దీని వెనక మరో మతలబు ఉంది అని ఆరోపిస్తున్నారు బెల్జియం పోలీసులు. ఈ రియాక్షన్ బటన్ల ద్వారా యూజర్ల మూడ్ ను తెలుసుకొని వాటికి అనుగుణంగా ఫెస్బుక్ ప్రకటనలను జొప్పిస్తుందని బెల్జియన్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 'ఐకాన్లు అభిప్రాయాలను తెలపడం కోసమే కాదు. యాడ్లను యూజర్ల ప్రొఫైల్లో ప్రభావవంతంగా పంపడానికి ఎంతగానో తోడ్పడతాయి' అని బెల్జియన్ పోలీసుల అధికారిక వెబ్సైట్లో పేర్కొంది.
వీటితో ఫేస్ బుక్ యూజర్ల ప్రైవసీకి భంగం కలిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రియాక్షన్ బటన్ సేవలు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చింది.