Belgian police
-
'ఫేస్బుక్ బటన్లకు రియాక్ట్ అవ్వొద్దు'
బెల్జియం పోలీసులు ఫేస్బుక్ కొత్త రియాక్షన్ బటన్లను వాడొద్దంటూ తమ సిటిజన్లను హెచ్చరిస్తున్నారు. ఫేస్బుక్లో నచ్చిన వాటికి లైక్ కొట్టడమే కాకుండా విభిన్న అభిప్రాయాలను ఎక్స్‌ప్రెస్ చేయడానికి లైక్ బటన్తోపాటూ రియాక్షన్స్ ఐకాన్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే దీని వెనక మరో మతలబు ఉంది అని ఆరోపిస్తున్నారు బెల్జియం పోలీసులు. ఈ రియాక్షన్ బటన్ల ద్వారా యూజర్ల మూడ్ ను తెలుసుకొని వాటికి అనుగుణంగా ఫెస్బుక్ ప్రకటనలను జొప్పిస్తుందని బెల్జియన్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 'ఐకాన్లు అభిప్రాయాలను తెలపడం కోసమే కాదు. యాడ్లను యూజర్ల ప్రొఫైల్‌లో ప్రభావవంతంగా పంపడానికి ఎంతగానో తోడ్పడతాయి' అని బెల్జియన్ పోలీసుల అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. వీటితో ఫేస్ బుక్ యూజర్ల ప్రైవసీకి భంగం కలిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రియాక్షన్ బటన్ సేవలు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. -
పారిస్ దాడి: ముగ్గురు అనుమానితుల అరెస్ట్
బ్రసెల్స్: పారిస్ దాడితో సంబంధముందని అనుమానిస్తున్న ముగ్గురిని బెల్జియం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. బ్రసెల్స్ లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు సాయంత్రం వీరు పారిస్ లో గడిపారు. పారిస్ లో దాడులు జరిగిన ప్రాంతాల్లో బెల్జియం రిజిస్ట్రేషన్లతో ఉన్న రెండు కార్లను గుర్తించారు. ఈ వాహనాలకు, వీరికి ఏమైనా సంబంధం ఉన్న అనే కోణంలో బెల్జియం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు అనుమానితుల అరెస్ట్ ను బెల్జియం ప్రధాని చార్లెస్ మైఖేల్ ధ్రువీకరించారు. పారిస్ దాడితో వీరికి ఏమైనా సంబంధం ఉందా అనే దానిపై తమ పోలీసులు దర్యాప్తు చేపట్టారని తెలిపారు. కాగా పారిస్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో మృతి చెందిన వారి సంఖ్య 129కి పెరిగింది. 352 మంది గాయపడ్డారు. వీరిలో 99 మంది పరిస్థితి విషమంగా ఉంది. -
టెర్రరిస్టులను హతమార్చిన బెల్జియం పోలీసులు
బ్రస్సెల్స్: బెల్జియన్ పోలీసులు ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను కాల్చి చంపారు. మరొకరిని అరెస్టు చేశారు. ఈ సంఘటన గురువారం వర్వీయర్స్ నగరంలో జరిగింది. ఈ ఘటనపై నగర మెజిస్ట్రేట్ ఎరిక్ వాన్‌డర్ సిప్ట్ మాట్లాడుతూ.. 'సిటీలోని రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానితులు ఆకస్మికంగా భద్రతా సిబ్బందిపై దాడులు జరిపారు. అయితే ఈ దాడులకు పారిస్ దాడులతో ఎలాంటి సంబంధం లేదు. మరి కొద్దిరోజుల్లో దీనిపై దర్యాప్తు పూర్తి అవుతుంది. ఆ తరువాత మిగతా వివరాలు వెల్లడిస్తాం. బ్రస్సెల్స్, వర్వీయర్స్ ప్రాంతాల్లో ఉగ్రవాద వ్యతిరేక దాడులు జరుగుతూనే ఉంటాయి' అని చెప్పారు.