టెర్రరిస్టులను హతమార్చిన బెల్జియం పోలీసులు | Belgium police kill 2 in anti-terror raid during shootout | Sakshi
Sakshi News home page

టెర్రరిస్టులను హతమార్చిన బెల్జియం పోలీసులు

Published Fri, Jan 16 2015 9:21 AM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

Belgium police kill 2 in anti-terror raid during shootout

బ్రస్సెల్స్: బెల్జియన్ పోలీసులు ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను కాల్చి చంపారు. మరొకరిని అరెస్టు చేశారు. ఈ సంఘటన గురువారం వర్వీయర్స్ నగరంలో జరిగింది. ఈ ఘటనపై నగర మెజిస్ట్రేట్ ఎరిక్ వాన్డర్ సిప్ట్ మాట్లాడుతూ.. 'సిటీలోని రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానితులు ఆకస్మికంగా భద్రతా సిబ్బందిపై  దాడులు జరిపారు. అయితే ఈ దాడులకు పారిస్ దాడులతో ఎలాంటి సంబంధం లేదు. మరి కొద్దిరోజుల్లో దీనిపై దర్యాప్తు పూర్తి అవుతుంది. ఆ తరువాత మిగతా వివరాలు వెల్లడిస్తాం. బ్రస్సెల్స్, వర్వీయర్స్ ప్రాంతాల్లో ఉగ్రవాద వ్యతిరేక దాడులు జరుగుతూనే ఉంటాయి' అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement