పారిస్ దాడి: ముగ్గురు అనుమానితుల అరెస్ట్ | Belgian connection: three held in Brussels over Paris attacks | Sakshi

పారిస్ దాడి: ముగ్గురు అనుమానితుల అరెస్ట్

Nov 15 2015 8:35 AM | Updated on Sep 3 2017 12:32 PM

పారిస్ దాడి: ముగ్గురు అనుమానితుల అరెస్ట్

పారిస్ దాడి: ముగ్గురు అనుమానితుల అరెస్ట్

పారిస్ దాడితో సంబంధముందని అనుమానిస్తున్న ముగ్గురిని బెల్జియం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

బ్రసెల్స్: పారిస్ దాడితో సంబంధముందని అనుమానిస్తున్న ముగ్గురిని బెల్జియం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. బ్రసెల్స్ లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు సాయంత్రం వీరు పారిస్ లో గడిపారు. పారిస్ లో దాడులు జరిగిన ప్రాంతాల్లో బెల్జియం రిజిస్ట్రేషన్లతో ఉన్న రెండు కార్లను గుర్తించారు. ఈ వాహనాలకు, వీరికి ఏమైనా సంబంధం ఉన్న అనే కోణంలో బెల్జియం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ముగ్గురు అనుమానితుల అరెస్ట్ ను బెల్జియం ప్రధాని చార్లెస్ మైఖేల్ ధ్రువీకరించారు. పారిస్ దాడితో వీరికి ఏమైనా సంబంధం ఉందా అనే దానిపై తమ పోలీసులు దర్యాప్తు చేపట్టారని తెలిపారు.

కాగా పారిస్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో మృతి చెందిన వారి సంఖ్య 129కి పెరిగింది. 352 మంది గాయపడ్డారు. వీరిలో 99 మంది పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement