Election Observer
-
ఈవీఎంలోని బటన్లను రెండుసార్లు నొక్కితే ఏమవుతుంది?
మనదేశంలో ప్రతి సంవత్సరం ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. వచ్చే ఏడాది అంటే 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఓటింగ్ కోసం ఈవీఎంలను కూడా సిద్ధం చేస్తున్నారు. వీటిని ఎన్నికల సమయంలో అన్ని పోలింగ్ బూత్‌లకు పంపిణీ చేస్తారు. అయితే ఓటింగ్ సమయంలో ఎవరైనా ఈవీఎం బటన్‌ను రెండుసార్లు నొక్కితే ఏమవుతుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నవంబర్ నెలలో ఐదు రాష్ట్రాల్లో వేర్వేరు తేదీల్లో ఓటింగ్ నిర్వహించి, ఆ తర్వాత డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడించనున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఎన్నికల్లో వేలాది ఈవీఎంలను వినియోగించనున్నారు. ఇవి ముందుగానే సిద్ధం చేయనున్నారు. ఎన్నికల తేదీకి ముందు ఈ ఓటింగ్ యంత్రాలను పోలింగ్ బూత్‌కు తీసుకువచ్చే బాధ్యతను ప్రిసైడింగ్ అధికారి పర్యవేక్షిస్తారు. ఒకవేళ ఓటరు ఎవరైనా ఈవీఎంలో ఓటు వేయడానికి వెళ్లినప్పుడు ఒకేసారి అనేక బటన్లను నొక్కితే ఏమవుతుందనే ప్రశ్న మన మదిలో మెదులుతుంటుంది. రెండు వేర్వేరు గుర్తులు ఉన్న బటన్లను నొక్కి. ఆ రెండు పార్టీలకు ఓటు వేయవచ్చని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది సాధ్యం కాదు. ఒక ఓటు వేసిన తర్వాత ఏ బటన్ నొక్కినా ఆ యంత్రంలో ఎటువంటి స్పందన చోటుచేసుకోదు. ఎన్నికల సంఘం తెలిపిన సమాచారం ప్రకారం అభ్యర్థికి ఓటు వేయడానికి సంబంధిత బటన్‌ను నొక్కిన వెంటనే, ఆ ఓటు నమోదువుతుంది. దీని తర్వాత ఈవీఎం లాక్ అవుతుంది. ఎవరైనా మళ్లీ ఆ బటన్ నొక్కినా ఏమీ జరగదు. ఎవరైనా మరో బటన్ నొక్కినా ఓటు నమోదు కాదు. ఒకరికి ఒక ఓటు అనే ప్రాతిపదికన ఈవీఎంలను తయారు చేశారు. ప్రిసైడింగ్ అధికారి తిరిగి బటన్ ప్రెస్ చేసిన తరువాతనే రెండవ ఓటుకు మార్గం ఏర్పడుతుంది. అంటే ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేసేందుకు అవకాశం ఉండదు. ఇది కూడా చదవండి: బంకర్లు అంటే ఏమిటి? యుద్ధ ప్రాంతాల్లో ఎందుకు అవసరం? -
ఏం చేస్తే.. ఏం జరుగుతుందో! మునుగోడు ఎన్నికల అధికారుల్లో వణుకు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కురుక్షేత్ర యుద్ధాన్ని తలపిస్తోంది. గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతుండగా, మరోవైపు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఏ క్షణంలో ఏ పొరపాటు జరుగుతుందోనని వణుకుతున్నారు. విధి నిర్వహణలో ఏ చిన్న పొరపాటు చేసినా కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసే అవకాశం ఉండడంతో అధికారుల్లో భయం పెరిగిపోయింది. సరైన అవగాహన లేక ఇద్దరు అధికారులు చేసిన తప్పిదాలపై ఎన్నికల సంఘం తీవ్ర చర్యలు తీసుకోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. తనకు లేని అధికారాలను ఉపయోగించి ఓ అభ్యర్థికి కేటాయించిన రోడ్డు రోలర్ గుర్తును మార్చి కొత్త గుర్తును కేటాయించినందుకు గాను మునుగోడు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్వో) కేవీఎం జగన్నాథరావుపై ఎన్నికల సంఘం వేటు వేసి కొత్త ఆర్వోను నియమించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో జగన్నాథరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్ రాజ్ కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశారు. అలాగే ఓ అభ్యర్థికి సంబంధించిన ఓడ (షిప్) గుర్తుకి బదులు పడవ (బోటు) గుర్తును ముద్రించినందుకు గాను చౌటుప్పల్ తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు విధించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మునుగోడు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని సీఈఓ కార్యాలయ వర్గాలు తెలిపాయి. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులుగా బాధ్యతల స్వీకరణకు సైతం అధికారులు ఆసక్తి చూపడం లేదని పేర్కొంటున్నాయి. ఎన్నికల నిర్వహణ అంటేనే తీవ్రమైన ఒత్తిడితో కూడిన పని కాగా, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సాధారణ ఎన్నికలకి మించిన ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని అధికారులు పేర్కొంటున్నాయి. ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు సీఈఓ కార్యాలయం అధికారులకు ఫోన్ చేసి సలహాలను అడుగుతున్నారు. -
అసలీ పోలింగ్ కేంద్రమేంటి? ఎవరెవరి పాత్ర ఎంత? ఓటు వేయడమెలా?
సాక్షి, కరీంనగర్: హుజురాబాద్ పోలింగ్‌కు అస్త్రశస్త్రాలు సిద్ధమయ్యాయి. అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల క్రతువుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశమే ఎదురుచూస్తున్న యుద్ధానికి ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద సదుపాయాలు సమకూర్చిన అధికారులు ఈ నెల 30న పోలింగ్ నిర్వహణకు సమాయత్తమయ్యారు. శనివారం ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల కార్యనిర్వాహక దళం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో బాధ్యత గల పౌరులుగా మనం ఓటు హక్కును వినియోగించుకుంటేనే ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది. ఓటు వేసే సమయంలో పరిసరాలపై అవగాహన అవసరం. అసలు పోలింగ్ కేంద్రంలో ఎంత మంది ఉంటారు..? వారు ఏం చేస్తారు..? మనకు సందేహం వస్తే ఎవరిని అడగాలి..? ఓటింగ్ యంత్రాలు ఎక్కడ ఉంటాయి..? తదితర అంశాలను ప్రస్తావిస్తూ కథనం. సహాయ ప్రిసైడింగ్ అధికారి ఓటరు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లగానే మొదట సహాయ ప్రిసైడింగ్ అధికారి ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు), ఓటరు స్లిప్‌ను పరిశీలించి ఓటరు జాబితా (మార్కింగ్ కాపీ)లో నమోదు చేసుకుంటారు. అటుపై పోలింగ్ కేంద్రంలో ఉన్న ఆయా పార్టీల ఏజెంట్లకు వినిపించేలా ఓటరు పేరు వివరాలను చదువుతారు. వెల్లడించిన వివరాలను పోలింగ్ కేంద్రంలోని ఆయా పార్టీల ఏజెంట్లు నమోదు చేసుకుంటారు. మూడో అధికారి మరో రెండడుగులు వేశాకా అధికారి కనిపిస్తారు. ఇతడు ఓటరుకు చెరిగిపోని సిరా గుర్తును పెట్టి అనంతరం ఓటరు రిజిష్టర్‌గా వ్యవహరించే ఫాం 17ఏ లో వివరాలు నమోదు చేసుకుంటారు. ఓటరు సంతకాన్ని తీసుకుని ఓటరు స్లిప్‌ను అందిస్తారు. నాలుగో అధికారి సిరా మార్క్‌ను రూడీ చేసుకొని ఓటరు స్లిప్ తీసుకొని, కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్‌ను జారీ చేస్తారు. అప్పుడు బిజిలైట్ వెలగడంతో పాటు ఈవీఎంపై పచ్చ (గ్రీన్) లైట్ వెలుగుతుంది. అనంతరం ఓటరు కంపార్ట్మెంట్లోకి వెళ్లి తను ఎంచుకున్న అభ్యర్థి గుర్తుకు ఎదురుగా ఉన్న మీటాను నొక్కాలి. పక్కనే ఎడమ వైపుగా ఏర్పాటు చేసిన వీవీప్యాట్‌లో 7 సెకన్ల పాటు తాను వేసిన ఓటును నిర్ధారించుకునే అవకాశాన్ని వినియోగించుకొని పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లాలి. పోలింగ్ కేంద్రం పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారితో పాటు సహాయ ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు ఎన్నికల అధికారులు విధులు నిర్వహిస్తారు. ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ కేంద్రంలో అన్ని వ్యవహారాలకు పూర్తి బాధ్యత ప్రిసైడింగ్ అధికారిదే. ఈయన నియోజకవర్గ కేంద్రం నుంచి ఎన్నికల సామగ్రి తీసుకొని ప్రత్యేక వాహనాల్లో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి చేరవేస్తారు. ఓటింగ్ పూర్తయ్యాక అప్పగిస్తారు. పోలింగ్ కేంద్రంలో పర్యవేక్షణ చేస్తారు. ఈవీఎం పరికరాలు ఇలా.. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈవీఎంలో మూడు పరికరాలు ఉంటాయి. అవి కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్. కంట్రోల్ యూనిట్ పోలింగ్ అధికారి (మూడో అధికారి) వద్ద ఉంటుంది. దీన్ని ఈయనే నియంత్రిస్తుంటారు. బ్యాలెట్ యూనిట్ అంటే ఓటరు మీట నొక్కే విభాగం. దీంతోనే ఓటు హక్కు వినియోగించుకుంటారు. వీవీ ప్యాట్‌ను బ్యాలెట్ యూనిట్‌కు ఎడమ వైపుగా ఏర్పాటు చేస్తారు. మీట నొక్కిన తరువాత వీపీ ప్యాట్ సరిచూసుకోవడానికి వీలు కల్పిస్తూ ఏడు సెకన్ల పాటు నిలిచి ఉంటుంది. తర్వాత అది కట్ అయి ఎంపిక చేసిన బాక్స్‌లో పడుతుంది. ఏదైనా ఒకటి తప్పనిసరి ఓటు వేసేందుకు వెళ్లేటపుడు ఓటర్లు కింద పేర్కొన్న వాటిలో ఏదో ఒకటి తప్పక ఉంచుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ►ఓటరు చీటి ►ఆధార్ కార్డు ►పాస్‌పోర్టు ►డ్రైవింగ్ లైసెన్స్ ►పాన్‌కార్డు ►ఓటరు గుర్తింపు కార్డు ►ఉపాధి కూలీ కార్డు ►కార్మికుల ఆరోగ్య కార్డు ►పింఛను ధ్రువీకరణ ►ఉద్యోగి ఫొటో గుర్తింపు కార్డు(ప్రభుత్వ, ప్రైవేటు) ►బ్యాంకు పాసుపుస్తకం -
ఎన్నికల విధుల్లో పాల్గొన్న టీచర్లకు కరోనా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న టీచర్లలో 450 మంది వరకు టీచర్లకు కరోనా సోకినట్లు పాఠశాల విద్యాశాఖ అంచనాకు వచ్చింది. అందులో 20 మంది వరకు చనిపోయినట్లు విద్యాశాఖ లెక్కలు తేల్చింది. టీచర్లను కోవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించాలనే కేసులో హైకోర్టుకు వివరాలు అందజేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఈ లెక్కలు సేకరించింది. ఈమేరకు జిల్లా విద్యాశాఖాధికారులు పాఠశాల విద్యా డైరెక్టరేట్‌కు లెక్కలు అందజేశారు. కోవిడ్ సోకిన టీచర్లలో నల్లగొండలో 82 మంది, జనగామలో 45 మంది, ఖమ్మంలో 107 మంది, వరంగల్ రూరల్‌లో 141 మంది ఉన్నట్లు తెలిసింది. చదవండి: Performance Grading Index: గ్రేడ్–2లో తెలంగాణ -
ఎన్నికల పరిశీలకుల్ని మార్చేసిన ఎస్ఈసీ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకుల్లో ఐదుగురిని మార్చేసింది. 13 జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను ఎన్నికల పరిశీలకులుగా నియమించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. నలుగురు ఉన్నతాధికారులను రిజర్వ్‌లో ఉంచింది. శ్రీకాకుళం - బి.రామారావు, విజయనగరం - పీఏ శోభా, విశాఖ - ప్రవీణ్ కుమార్, తూర్పుగోదావరి - అరుణ్‌కుమార్, పశ్చిమగోదావరి - హిమాన్షు శుక్లా, కృష్ణా - శ్రీకేష్ బాలాజీరావు, గుంటూరు - కాంతిలాల్ దండే, ప్రకాశం - వివేక్ యాదవ్, నెల్లూరు - పి.బసంత్ కుమార్, చిత్తూరు - సిద్ధార్థజైన్, అనంతపురం - కె.హర్షవర్థన్, కర్నూలు - టి.బాబూరావునాయుడు, వైఎస్సార్ కడప పి.రంజిత్ బాషా నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. (చదవండి: ఏపీలో మోగిన పుర భేరీ) (‘ఆయనను ఎదుర్కునే దమ్ములేకే.. ఇవన్నీ’) (కాకినాడలో జనసేనకు ఝలక్) -
'ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే సహించం'
సాక్షి, విజయవాడ : విజయవాడలోని ఈసీ కార్యాలయంలో 13 జిల్లాల ఎన్నికల వ్యయ పరిశీలకులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజు క్షేత్రస్థాయిలో ఎన్ని కేసులు నమోదయ్యాయే వాటి వివరాలు తెలియజేయాలన్నారు. అనుమతి లేని ర్యాలీలు, బైక్ ర్యాలీలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.ఎన్నికల పరిశీలకులు తమ విధిని నిర్వర్తించడంలో నిష్పాక్షికంగా వ్యవహరించాలన్నారు.వెంటనే జిల్లాలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ఫిర్యాదులను పరిష్కరించడానికి పరిశీలకులు చురుకుగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేసేలా చూడాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చులతో పాటు, సున్నితమైన ప్రదేశాలను గుర్తించి వాటిపై నిశితంగా దృష్టి సారించాలని వెల్లడించారు. ఎన్నికల్లో డబ్బును అరికట్టడానికి ఎన్నికల వ్యయ ఖాతాలను తరచూగా తనిఖీ చేయడానికి జిల్లా కలెక్టర్లతో కలిసి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.వివాహం, కుటుంబ వేడుకలు, వైద్య చికిత్స, ఫీజు చెల్లింపు మొదలైన ఏవైనా వ్యక్తి గత కారణాల వల్ల నిర్దేశించిన పరిమితి రూ. 50వేల కంటే ఎక్కువ ఉండకూడదన్నారు.ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చులను గతంలో ఉన్న వ్యయ పరిధి కంటే రెండింతలు పెంచడం జరిగిందని అధికారులకు వెల్లడించారు. వ్యయ పరిశీలకులు వీలైనన్ని ఎక్కువ శిక్షణా కేంద్రాలకు హాజరు కావాలని, క్షేత్రస్థాయిలో విధుల్లో పాల్గొనే సిబ్బందికి, అధికారులకు తగిన సూచనలు చెయ్యాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల పరిశీలకులు సహించరనే నమ్మకం క్షేత్రస్థాయిలో తీసుకురావాలని రమేశ్ కుమార్ పేర్కొన్నారు. -
తక్షణమే విధుల్లోకి చేరాలి: రమేష్ కుమార్
సాక్షి, విజయవాడ: ఎన్నికల పరిశీలకులు వెంటనే విధుల్లోకి చేరాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరపున నిర్భయంగా బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల్లో వాలంటీర్ల సేవలు వినియోగించుకోవద్దని స్పష్టం చేశారు.(ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్‌ల నియామకం) ఎన్నికల కమిషన్ వాట్సాప్ గ్రూప్ ద్వారా సూచనలు, సలహాలు ఇవ్వవచ్చని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహిస్తున్నందున బ్యాలెట్ పేపర్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని రమేష్‌కుమార్ సూచించారు. -
ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్‌ల నియామకం
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థలకు ఎన్నికల పరిశీలకులుగా 13 జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించింది. వీరితో పాటు మరో నలుగురు ఉన్నతాధికారులను రిజర్వ్‌లో ఉంచారు. జిల్లాల వారీగా వారి వివరాలు.. (నేటి నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ) ► కె. ఆర్.బి. హెచ్. ఎన్. చక్రవర్తి - కర్నూలు జిల్లా ►ఎం. పద్మ - కృష్ణ జిల్లా ► పి.ఉషా కుమారి - తూర్పు గోదావరి జిల్లా ►పి.ఎ. శోభా - విజయనగరం జిల్లా ►కె. హర్షవర్ధన్ - అనంతపురం జిల్లా ►టి. బాబు రావు నాయుడు - చిత్తూరు జిల్లా ►ఎం. రామారావు - శ్రీకాకుళం జిల్లా ►కె. శారదా దేవి - ప్రకాశం జిల్లా ►ప్రవీణ్ కుమార్ - విశాఖపట్నం జిల్లా ►బి. రామారావు -ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ►పి. రంజిత్ బాషా - వైయస్ఆర్ కడప జిల్లా కాంతిలాల్ దండే - గుంటూరు జిల్లా ►హిమాన్షు శుక్లా - పశ్చిమ గోదావరి జిల్లా వీరికి అదనంగా నలుగురు సీనియర్ ఉన్నతాధికారులను సిహెచ్. శ్రీధర్, శ్రీమతి. జి. రేఖ రాణి, శ్రీమతి టి.కె.రామమణి, ఎన్.ప్రభాకర్రెడ్డిలను రిజర్వులో ఉంచారు. (ముగ్గురు పిల్లలున్నా పోటీకి అర్హులే!) -
పోలింగ్ ఏజెంటే ‘కీ’లకం
సాక్షి, సత్తెనపల్లి : ఎన్నికల ప్రచారం ముగిసింది. బలాబలాల బేరీజులో అభ్యర్థులు మునిగిపోయారు. ప్రస్తుతం పోలింగ్ ప్రారంభం అవుతుంది. ఎన్నికల యుద్ధానికి సర్వం సన్నద్ధమైంది. ఈ తరుణంలో పోలింగ్ కేంద్రంలో కీలకంగా వ్యవహరించాల్సిన ఏజెంటు పాత్ర ఎంతో ప్రధానమైనది. ఏ మాత్రం తేడా వచ్చినా అభ్యర్థుల భవితవ్యమే తారుమారవుతుంది. ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాలు అన్నింటినీ అభ్యర్థి ఒక్కరే పర్యవేక్షించడం సాధ్యం కాదు. కాబట్టి ప్రతి పోలింగ్ కేంద్రానికి ఆయన తరుఫున ఒక ఏజెంటును నియమించుకుంటారు. ఈ ఏజెంటు ప్రత్యర్థి పార్టీకి తలొగ్గి, లోపాయికారీ ఒప్పందం చేసుకున్నా.. అసమర్థుడైన వ్యక్తి అయితే ఇక అంతే సంగతులు.పోలింగ్ కేంద్రంలోని ఎన్నికల సిబ్బంది, ఏజెంట్లను తమ అదుపులో ఉంచుకోగలిగితే అభ్యర్థుల పంట పండినట్లే. కేంద్రంలోకి వచ్చే ఓటరు గురించి సిబ్బందికి తెలియకపోవడంతో నిర్ధారణకు పోలింగ్ ఏజెంటు కీలకంగా వ్యవహరిస్తాడు. ఏజెంట్ల నియామకం, బాధ్యతలు, నిబంధనలను ఒక సారి పరిశీలిస్తే... అదే పోలింగ్ బూత్‌లో ఏజెంటు ఓటరుగా ఉండాలి. లేదంటే అదే నియోజకవర్గంలో ఓటరుగా ఉన్నా అనుమతిస్తారు. పోలింగ్ ఏజెంటుగా ఉండాల్సిన వ్యక్తికి తప్పనిసరిగా ఓటరు, ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉండాలి. ప్రతి పోలింగ్ ఏజెంటు తాము ఏ పార్టీ అభ్యర్థి తరుఫున పోలింగ్ కేంద్రంలో ఉంటున్నాడో ఫారం–బి ని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారికి అందజేయాలి. ఏజెంటు తమ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్నారా, లేదో నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వారిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. ఓటింగ్ ప్రక్రియ ప్రారంభానికి గంట సమయం ముందుగానే ఏజెంటు పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలి. ఎన్నికల బరిలో ఉన్న ప్రతి అభ్యర్థి పోలింగ్ కేంద్రానికి ఒక ఏజెంటు, ఇద్దరు ప్రత్యామ్నాయ ఏజెంట్లను నియమించుకోవచ్చు. ఓటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఆయన పోలింగ్ కేంద్రంలోనే ఉండాలి. పోలింగ్ కేంద్రంలోనికి సెల్ఫోన్లు, కార్డ్‌లెస్ ఫోన్లు , వైర్లెస్ సెట్లు తీసుకోని రాకూడదు. ఓటు వేసిన, వేయని వారి క్రమ సంఖ్యలు, పేర్లను కాగితంపై రాసి బయటకు పంపకూడదు. ఓటరు జాబితాను పోలింగ్ స్టేషన్ బయటకు తీసుకొని వెళ్లకూడదు. అత్యవసర పరిస్థితుల్లో పోలింగ్ ఏజెంటు కేంద్రాన్ని విడిచి వెళ్లాల్సి వస్తే ఆ పార్టీకి చెందిన ప్రత్యామ్నాయ ఏజెంటు సిద్ధంగా ఉన్న తర్వాత మాత్రమే వెళ్లాలి. పోలింగ్ ఏజెంటు కేంద్రంలోకి వచ్చే సమయం, వేళ్లే సమయాన్ని ప్రత్యేక పుస్తకంలో నమోదు చేయాలి. ఏజెంటుకు ఫొటో గుర్తింపు కార్డు లేకపోతే పోటీ చేస్తున్న అభ్యర్థి లిఖిత పూర్వకంగా దరఖాస్తు అందించాల్సి ఉంటుంది. ఎన్నికల నిర్వహణలోని సిబ్బందికి ఏజెంట్లు సహకరించాలి. సిబ్బందిని ప్రలోభాలకు గురి చేయకూడదు. పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లు ముఖాలు కనిపించెలా కూర్చోవాలి. జాతీయ, ప్రాంతీయ, పార్టీల తర్వాత స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లు వరుస కమ్రమంలో కూర్చోవాలి. -
జేసీ దివాకర్‌రెడ్డి కళాశాలలో...
యాడికి: తెలుగుదేశం పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు సిద్ధం చేశారని సమాచారం అందడంతో తహసీల్దార్ అంజనాదేవి, రాష్ట్ర ఎన్నికల తనిఖీ అధికారి చంద్రశేఖరన్, రెవిన్యూ సిబ్బందితో శనివారం సాయంత్రం యాడికి మండల పరిధిలోని జేసీ దివాకర్‌రెడ్డి జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. అయిగే గదులు తాళాలు వేసి ఉండటంతో వీఆర్వో పవిత్ర ప్రిన్సిపల్‌ను ఫోన్లో సంప్రదించారు. తాను బెంగళూరులో ఉన్నానని, తాళంచెవులు తాడిపత్రిలోని తన ఇంటిలో ఉన్నాయని చెప్పాడు. ఈ మేరకు సిబ్బంది తాడిపత్రికి వెళ్లి తాళంచెవులు తీసుకొచ్చారు. ఇందులో ఒక గదిలో టీడీపీ కండువాలు, కరపత్రాలు లభించాయి. ప్రిన్సిపల్ రూము, మరో గదికి సంబంధించిన తాళంచెవులు లేకపోవడంతో వాటిని తెరవలేకపోయారు. ఈ గదుల తాళాలను తర్వాతైనా తెరిచి పరిశీలించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల తనిఖీ అధికారి చంద్రశేఖర్‌ను సిబ్బందికి సూచించారు. ఇదిలా ఉండగా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తనిఖీల సమయంలో తహసీల్దార్‌కు ఫోన్ చేసి.. తమ కళాశాల గదులను తెరవవద్దని, ఒక వేళ కాదు అని తెరిస్తే మీ మీద కోర్టులో కేసు వేస్తానని బెదిరించినట్లు తెలిసింది. మరి ప్రిన్సిపల్ గదిని తెరుస్తారో లేదో వేచి చూడాల్సిందే. -
ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్ అధికారులు
సాక్షి, విజయవాడ : ఎన్నికల సమయంలో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు ఐఏఎస్ అధికారులను ఎన్నికల పరిశీలకులుగా నియమించామని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.ఎండి.ఇంతియాజ్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను నేరుగా ఐఏఎస్ అధికారులకు తెలియజేయవచ్చని చెప్పారు. విజయవాడలోని ఏపీటీడీసీకి చెందిన హరిత హోటల్లో ఐఏఎస్ అధికారులకు బస ఏర్పాటు చేశామన్నారు. ఫిర్యాదులు ఉంటే ప్రతి రోజు ఉదయం 10గంటల నుంచి 11 గంటల వరకు అధికారులను నేరుగా కలవవచ్చన్నారు. లేని పక్షంలో వారి వారి సెల్ఫోన్లకు కాల్ చేసి ఫిర్యాదు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. వివిధ నియోజక వర్గాల ఎన్నికల పరిశీలకుల పేర్లు, వారి ఫోన్ నంబర్ల వివరాలు మచిలీపట్నం పార్లమెంట్- గణేష్ కుమార్- జె.సి.ఛాంబర్, బందరు- 6300606742. విజయవాడ- పార్లమెంట్-పి.జవహర్- హరితహోటల్-రూమ్ నంబర్ 202- 9847794220. మైలవరం, నందిగామ, జగయ్యపేట- భన్వర్ సింగ్ సంధూ- హరితహోటల్ రూమ్ నంబర్ 201- 9676969337. తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ మధ్య, విజయవాడ తూర్పు- పి. శ్రీవెంగడ ప్రియ- హరితహోటల్ రూమ్ నెంబర్ 204- 9347072208. .నూజివీడు, కైకలూరు- జయకృష్ణన్అభిర్-హరితహోటల్ రూమ్ నంబర్ 304- 7032167986 గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం- రాజేష్ కుమార్ పాండే- హరితహోటల్ నంబర్ 303-9491123246. .పెనమలూరు, పామర్రు, అవినిగడ్డ- హరితహోటల్ రూమ్ నంబర్ 101- 9347066714. -
ఆధారం లేకుంటే అంతే మరి!
సాక్షి, శ్రీకాకుళం : సార్వత్రిక ఎన్నికలకు నగరా మోగిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో డబ్బే కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులతోపాటు పోలీసులు గట్టి నిఘా పెట్టారు. భారీగా నగదు చేతులు మారే అవకాశం ఉన్నందున నగదు తరలింపును అడ్డుకోవడంపై అధికార యంత్రాంగం పూ ర్తిగా దృష్టి సారించింది. నియోజకవర్గాల వారీగా తనిఖీలు ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చే సింది. పోలీసులతోపాటు రెవెన్యూ అధికారులు విస్తృతంగా తనీఖీలు చేపడుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. జిల్లాల్లో ఇప్పటికే కొంత నగదుతోపాటు బంగారం, గంజాయి, మద్యం తరలింపులను పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు కూడా ఇబ్బందులు ఎదువరయ్యే అవకాశాలే లేకపోలేదు. ఆధారాలు తప్పనిసరి... ఎన్నికల సంఘం సామాన్యులకు కొంత వెసులుబాటు ఇచ్చింది. వివిధ అవసరాల కోసం ఒక వ్యక్తి రూ.50వేల వరకు తన వెంట తీసుకెళ్లవచ్చు. దీనికి ఎలాంటి ఆధారాలు అక్కర్లేదు. అయితే రూ.50వేల కంటే ఎక్కువ నగదు తరలించే సమయంలో మాత్రం కచ్చితంగా సంబంధిత ఆధారాలను తనిఖీలు జరిపే అధికారులకు చూపించాల్సి ఉంటుంది. లేకుంటే అవస్థలు తప్పవు. తనిఖీల సందర్భంలో సదరు వ్యక్తులు వాగ్వాదానికి దిగినా, అనుచితంగా ప్రవర్తించినా అవన్నీ సీసీ కెమెరాలు, అప్పటికీ పోలీసులు బాడీకి అమర్చకున్న బాడీ కెమెరాల్లో రికార్డు అవుతాయి. అయితే సరైన ఆధారాలు చూపిస్తే డబ్బుకు ఎలాంటి ఢోకా ఉండదు. ఆధారాలు లేకపోతేనే ఇబ్బంది. సీజ్ చేస్తే మాత్రం తిప్పలు తప్పవు.. నగదు పట్టుబడిన సమయంలో తగిన ఆధారాలు చూపకపోతే ఆ వ్యక్తులకు తిప్పలు తప్పవు. సదరు వ్యక్తులు ఏ అవసరం కోసం ఎక్కడి నుంచి ఎక్కడికి నగదు తరలిస్తున్నారో విషయాలు ఆధారాలతో సహా వివరించాలి. తగు ఆధారాలను చూపించాలి. ఆధారాలు సంతృప్తికరంగా ఉంటే చెక్‌పోస్టుల వద్దే వదిలేస్తారు. లేదంటే డబ్బుతోసహా సంబంధిత వ్యక్తిని తహసీల్దార్ వద్ద హాజరుపరుస్తారు. పోలీసులు సీజ్ చేసిన నగదును తొలుత ట్రెజ రీలో డిపాజిట్ చేసి, ఐటీ అధికారులకు సంబంధిత ఫైల్‌ను అప్పగిస్తారు. వారు మ రోసారి ఆధారాలు ఆడుగుతారు. వారికి గాని సక్రమమైన ఆధారాలు చూపకపోతే వారు తిరిగి ఆ ఫైల్‌ను పోలీసులకు పంపుతారు. ఐటీ అధికారుల క్లియరెన్స్ సరి. లేదంటే మాత్రం పోలీసులు కేసు ఫైల్ చేసి, చార్జిషీట్ నమోదుచేస్తారు. కాగా పన్ను కింద ముప్పై శాతం చెల్లించుకుని మిగిలిన మొత్తాన్ని కొన్ని కేసుల్లో తిరిగి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నేతల వాహనాల కదలికలపై నిఘా.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల, రాజకీయ పార్టీల నాయకుల కదలికలపై పోలీసు శాఖ డేగ కన్ను వేయనుంది. ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థుల తరఫున క్రియాశీలకంగా వ్యవహరించే నాయకులు, వారి వాహనాలపై గట్టి నిఘా వేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికలు ముగిసేవరకు పోలీసులకు సెలవులు ఇవ్వరాదని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, మఫ్టీ అవతారంలో జిల్లాలోని పలు చోట్ల గట్టి నిఘా పెట్టినట్లు భోగట్టా. -
ఏపీలో ఎన్నికల అధికారుల ప్రత్యేక డ్రైవ్
-
ఏపీలో ఓటర్ల అవగహన కార్యక్రమం
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లకు అవగహన కల్పించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. దీనిలో భాగంగా రేపు, ఎల్లుండి (శనివారం, ఆదివారం) ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల అవగహన కార్యక్రమంను చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించనున్నారు. ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం మీడియా సమావేశంలో ఈ మేరకు వివరాలను తెలియజేశారు. పోలింగ్ బూత్ వద్ద బూత్‌లెవల్ అధికారులతో కార్యక్రమం నిర్వహిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. కొత్తగా ఓటరు నమోదు, ఓటరులిస్ట్ పరిశీలనకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతిఒక్కరు తమ ఓటు ఉందా లేదా అని పరిశీలించుకోవాలని, ఓటు లేకపోతే ఫామ్-6తో నమోదు చేయించుకోవాలని అధికారులు సూచించారు. -
‘పంచాయతీ’కి రెడీ
ఆదిలాబాద్‌అర్బన్: గ్రామపంచాయతీ ఎన్నికల నగారా త్వరలో మోగనుందా..? హైకోర్టు ఆదేశాల ప్రకారం వచ్చే జనవరి 10లోగా ఎన్నికల నిర్వహణ పూర్తి కానుందా.? ప్రస్తుతం ఇటు రాష్ట్ర ప్రభుత్వం.. అటు ఎన్నికల సంఘం వేగంగా చేస్తున్న ఏర్పాట్లను బట్టి చూస్తుంటే అవుననే సమాధానమే వస్తోంది. నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైన ఎన్నికలకు సిద్ధమని పంచాయతీరాజ్ శాఖ ఇది వరకే ప్రకటించింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 8లోగా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. జనవరిలో నిర్వహించే పంచాయతీ ఎన్నికలకు అవసరమయ్యే బ్యాలెట్ బాక్సులను అధికారులు సిద్ధం చేశారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, బీసీ ఓటర్ల గణన, ఫొటో ఓటర్ల జాబితాను పూర్తి చేసి స్థానిక పోరుకు సిద్ధంగా ఉంచారు. రెండు రోజుల క్రితం రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చిన యంత్రాంగం తాజాగా స్టేజ్–2 అధికారుల శిక్షణ కూడా పూర్తి చేసి ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా రెడీ అయింది. కాగా, రిజర్వేషన్లలో బీసీలకు 23.81 శాతం, ఎస్సీలకు 20.46 శాతం, ఎస్టీలకు 5.73 శాతం ఖరారు చేయాలని కలెక్టర్లకు, డీపీవోలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని కేటగిరిల్లో మహిళలకు 50 శాతం స్థానాలను కేటాయించాలని ఆదేశాల్లో స్పష్టం చేయడంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. బ్యాలెట్ బాక్సులు సిద్ధం పంచాయతీ ఎన్నికలకు ఉపయోగించే బ్యాలెట్ బాక్సులు సిద్ధమయ్యాయి. గత జూన్‌లో ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామనడంతో కలెక్టరేట్లోని స్టోరేజ్ రూంలో ఉన్న బ్యాలెట్ బాక్సులను బయటకు తీసి దుమ్ముదులిపేశారు. మన జిల్లాలో సరిపడా బాక్సులు లేకపోవడంతో మహారాష్ట్ర నుంచి తెప్పించారు. వీటన్నింటీని ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో గల గోదాములో భద్రంగా దాచారు. అక్కడ బాక్సులకు రంగులు వేయడం, తుప్పు పట్టిన, రంధ్రాలు పడిన బాక్సులను రిపేరు చేసి సిద్ధం చేశారు. అయితే జిల్లాలో ప్రస్తుతం 6,636 బ్యాలెట్ బాక్సులు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి. ఆదిలాబాద్, బోథ్ రెండు నియోజకవర్గాల్లో కలిపి 467 గ్రామ పంచాయతీలు ఉండగా, 3,822 వార్డులు ఉన్నాయి. ఒక్కో వార్డుకు ఒక్కో బాక్సు చొప్పున 3,822 బాక్సులు అవసరం అవుతాయి. సర్పంచ్ స్థానానికి ఒకటి చొప్పున మరో 467 బాక్సులు అవసరమనుకున్న సరిపడేంత సిద్ధంగా ఉంచారు. కాగా, ఇది వరకే బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తి అయింది. రెండు కలర్లో ఉన్న బ్యాలెట్ పేపర్లను జిల్లా పరిషత్ కార్యాలయంలో గల స్ట్రాంగ్‌రూంలో భద్రపర్చారు. అధికారులకు శిక్షణ పూర్తి.. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు 500 మంది (స్టేజ్–2) రిటర్నింగ్ అధికారులు నియామకం అయినట్లు పంచాయతీ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో 467 గ్రామ పంచాయతీలు ఉండగా, 465 పంచాయతీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. స్టేజ్–2 అధికారులు ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించనున్నారు. ఒక్కో పంచాయతీకి ఒక్కరు లేదా ఇద్దరు చొప్పున ఎన్నికల విధులు నిర్వర్తిస్తారు. కాగా, స్టేజ్–1 రిటర్నింగ్ అధికారులు క్లస్టర్‌కు ఒకరు చొప్పున ఎన్నికల విధులు నిర్వర్తించగా, స్టేజ్–2 అధికారులు పంచాయతీకి ఒకరు లేదా ఇద్దరు చొప్పున బాధ్యతలు చేపట్టనున్నారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో నాలుగు నుంచి ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అంటే ఒక్కో క్లస్టర్‌కు తొమ్మిది లేదా 11 మంది రిటర్నింగ్ అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొనున్నారు. స్టేజ్–1 అధికారులకు ఇది వరకే శిక్షణ ఇవ్వగా, స్టేజ్–2 అధికారులకు శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణపై మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో)గా కొత్తగా నియామకమైన సాయిబాబా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణకు అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. శిక్షణలో ఎన్నికల విధులు, బాధ్యతలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. కాగా, నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఫలితాలు తేలే వరకు ఈ అధికారులు కీలకపాత్ర పోషించనున్నారు. -
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
నిర్మల్‌టౌన్: ఈ నెల 7న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో సెక్టోరల్ అధికారులు తమ విధులు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంతి అన్నారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో ఆదివారం రాత్రి ఎన్నికల ఏర్పాట్లపై సెక్టోరల్, పోలీసు అధికారులతో సమీక్షించారు. ఎన్నికల్లో సెక్టోరల్ అధికారులు కీలక భూమిక పోషించాలన్నారు. ఈవీఎం మిషన్లు పనిచేయకపోతే వెంటనే రిప్లేస్ చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులైన తాగునీరు, విద్యుత్, లైట్లు, ఫ్యాన్స్, టాయ్‌లెట్స్, కుర్చీలు, బెంచీలు తదితర వాటిని ముందుగానే పరిశీలించాలన్నారు. ఎన్నికల సందర్భంగా గంట గంటకు సమాచారం ఇవ్వాలన్నారు. గర్భిణులు క్యూలో నిలబడకుండా వారు నేరుగా ఓటింగ్‌కు వెళ్లేలా చూడాలన్నారు. ప్రతీ సెక్టోరల్ అధికారి వద్ద వీవీ ప్యాట్–2, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతీ పోలింగ్ స్టేషన్లో పోలింగ్ రోజు బూత్ లెవల్ అధికారి అందుబాటులో ఉండాలన్నారు. ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, ప్రథమ చికిత్స బాక్స్‌తో ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో టెంట్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఓటింగ్ అసిస్టెంట్ నియమించాలన్నారు. వీల్ చైర్స్ ఉండేలా చూడాలన్నారు. ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులు చేపట్టాల్సిన ఏర్పాట్లు, సెక్టార్ అధికారుల విధులు తదితర విషయాలను వివరించారు. మరిన్ని ఎన్నికల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి పోలింగ్ రోజు కేంద్రాల్లో సెల్‌ఫోన్ అనుమతి లేదన్నారు. పోలింగ్ రోజు ఓటింగ్ కోసం వెళ్లే ఓటర్లకు, అధికారులకు, సిబ్బందికి, ఏజెంట్లకు ఎవరికి కూడా సెల్‌ఫోన్ తీసుకెళ్లేందుకు అనుమతి లేదని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ శశిధర్‌రాజు, జేసీ భాస్కర్‌రావు, ఏఎస్పీ దక్షిణమూర్తి, ఆర్డీవో, ఆర్వోలు ప్రసూనాంబ, రాజు, వినోద్‌కుమార్, డీఎస్పీలు ఉపేందర్‌రెడ్డి, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల్లో ప్రజలే గెలవాలి
సాక్షి, మోర్తాడ్/బోధన్: ఎన్నికల్లో అభ్యర్థులు, పార్టీలు గెలవడం ముఖ్యం కాదని, ప్రజలు గెలవడమే ముఖ్యమని టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రజలు గెలిస్తేనే ప్రజాస్వామ్యం బలపడుతుందని ఉద్ఘాటించారు. ప్రజలు గెలవడం అంటే వారికి మంచి చేసే వారు గెలవడం అని తెలిపారు. వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ సోమవారం నిజామాబాద్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ రూరల్, బోధన్, మోర్తాడ్‌లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. పార్టీ అభ్యర్థులు బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్, ప్రశాంత్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఏ పార్టీ ప్రచారం చేసినా, ఎవరు మాట్లాడినా సావధానంగా వినాలని, ఇంటికి వెళ్లి తీరిగ్గా కూర్చుని ఆయా ఆంశాలపై చర్చ చేయాలని సూచించారు. తమ కోసం ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారో గ్రహించి వారికే ఓటు వేయా లని కోరారు. 2014 ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ను బలపరిచారని, ఈ ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరిన్ని విలువైన పనులు చేస్తామని హమీ ఇచ్చారు. కాంగ్రెస్ 40 ఏళ్ల పాలనలో, 17 ఏళ్ల టీడీపీ హయాంలో ఏమి ఉద్ధరించ లేదని విమర్శించారు. ఐదున్నర దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలను నాలుగేళ్లలో తమ ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. ఊహించని పథకాలను తెచ్చాం.. తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎవరూ ఊహించని సంక్షేమ పథకాలను అమలు చేశామని కేసీఆర్ తెలిపారు. కల్యాణలక్ష్మి, పింఛన్లు, 24 గంటల కరెంట్ సరఫరా తదితర అంశాల గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. 2014 ఎన్నికల సమయంలో బీడీ కార్మికులకు భృతి కింద రూ.వెయ్యి ఇస్తామని మోర్తాడ్ సభలోనే ప్రకటించానని, ఆ మాటను నిలబెట్టుకున్నానని తెలిపారు. మళ్లీ తాము అధికారంలోకి రాగానే ఈ మొత్తాన్ని రూ.2,016కు పెంచుతామన్నారు. బీడీ పరిశ్రమపై ఆధారపడిన కార్మికులందరికీ జీవన భృతిని అందించడానికి చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. చంద్రబాబు, కిరణ్‌లపై ధ్వజం కాంగ్రెస్, టీడీపీలు గతంలో మాయా మశ్చీంద్ర కథలు చెప్పి కాలం వెళ్లదీశాయని సీఎం విమర్శించారు. టీడీపీ హయాంలో కరెంటు అడిగిన కర్షకులపై లాఠీచార్జీ చేయించడం, కాల్పులు జరిపించారని గుర్తు చేశారు. అలాగే, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్ సమస్యను పరిష్కరించకుండా తెలంగాణ ప్రాంతాన్ని అవహేళన చేశారని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీలు దొందు దొందే అని విమర్శించారు. వారు చేయని పనిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తాము చేసి చూపించామని కేసీఆర్ స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద మాట లు చెబుతున్నాడు కాని తన రాష్ట్రంలో తెలంగాణ మాదిరి 24 గంటల నిరంతర విద్యుత్‌ను ఎందుకు అందించడం లేదని విమర్శించారు. జల సిరులు నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద 2 లక్షల ఎకరాల భూములు ఎండిపోయే దశలో ఉంటే సింగూర్ నుంచి నిజాంసాగర్‌కు నీటిని మళ్లించి రైతులకు అండగా నిలిచామని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ వాళ్లు మాత్రం జహీరాబాద్‌లో ధర్నా చేసి కుటిల రాజకీయం చేశారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్ చేసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 365 రోజుల పాటు నిండు కుండలా ఉండేలా చేస్తున్నామని సీఎం తెలిపారు. రోజుకో టీఎంసీ నీటిని తెచ్చి కాకతీయ కాలువ, వరద కాలువ, లక్ష్మి, ఇతర కాలువలను నీటితో నింపి మత్స్యకారులకు కూడా జీవనోపాధిని మెరుగుపరుస్తామని తెలిపారు. మళ్లీ మా ప్రభుత్వమే రాబోయేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు వ్యతిరేకించిన కాళేశ్వరం ప్రాజెక్టు జూన్ తర్వాత పూర్తి కాబోతుందని, ఆ ప్రాజెక్టు ప్రారంభమైతే నిజాంసాగర్ ప్రాజెక్టు ఎప్పుడూ ఎండిపోదని చెప్పారు. పుష్కలంగా సాగు నీరు వస్తుందని, బోధన్ ప్రాంతంలో రెండు పంటలు పండే అవకాశం కలుగుతుందన్నారు. ఎప్పుడో పాడుబడిన నిజాంసాగర్ కాలువను ఆధునికీకరించి చిట్టచివరి భూముల వరకు నీళ్లందించేందుకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కాలువల వెంబడి తిరిగి పంటలను కాపాడరన్నారు. ఎంపీ కవిత, సీఎం ప్రసంగం చిత్రీకరణ సాక్షి, కామారెడ్డి టౌన్: ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కామారెడ్డి జిల్లాకేంద్రంలోని సీఎస్ఐ మైదానంలో నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని జిల్లా ఎన్నికల పరిశీలకులు వీడియో చిత్రీకరించారు. సీఎం ప్రసంగాన్ని చిత్రీకరిస్తున్న ఎన్నికల పరిశీలకఎన్నికల్లో ప్రజలే గెలవాలి -
‘పోస్టల్’కు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, నల్లగొండ : అసెంబ్లీ సాధారణ ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఇతర ప్రైవేట్ వ్యక్తులకు, సర్వీస్ ఓటర్లకు, జైలులో ఉంటూ శిక్ష ఖరారుకాని, శిక్ష అనుభవిస్తున్న వారికి ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించింది. జిల్లా ఎన్నికల సంఘం కూడా ఈ మేరకు జిల్లాలోని ఆయా వర్గాలను గుర్తించింది. డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికకు సంబంధించి జిల్లాలో సుమారు 16వేల మంది ఎలక్షన్ విధులు నిర్వహించనున్నారు. ఇందులో జిల్లా అధికారులతోపాటు రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీఓలు, సెక్టోరల్ అధికారులు, పోలీస్, మైక్రో అబ్జర్వర్స్, డ్రైవర్లు, కండక్టర్లు, క్లీనర్లతోపాటు అద్దె వాహనాల డ్రైవర్లు, ప్రైవేట్ సిబ్బంది ఉన్నారు. వీరందరికీ పోస్టల్లో ఓటు వేసే అవకాశం కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 16వేల మందికి పోస్టల్‌బ్యాలెట్‌లో ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. 12వేల దరఖాస్తుల పంపిణీ.. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి ఫారం 12(పోస్టల్‌బ్యాలెట్ దరఖాస్తు)ను దాదాపు 12వేల మందికి ఇప్పటికే పంపిణీచేశారు. తిరిగి 6వేల దరఖాస్తులు అందాయి. అత్యధికంగా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన ఉద్యోగులంతా ఎల్బీనగర్లో ఉన్నారు. వారు అక్కడే పోస్టల్ బ్యాలెట్‌ను తీసుకున్నారు. వరంగల్ జైలులో ఉన్న ఆరుగురికి పోస్టల్ ఓటు అవకాశం.. జిల్లాకు చెందిన వారు వరంగల్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న, ఇంకా శిక్ష ఖరారు కాని ట్రయల్‌లో ఉన్న ఆరుగురికి జిల్లా ఎన్నికల అధికారులు ఓటు హక్కును కల్పించారు. ఇప్పటికే సంబంధిత పై అధికారుల నుంచి వారికి పోస్టల్‌బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించాలని ఆదేశాలు అం దాయి. వీరిలో ఇటీవల సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసు నిందితులు మాణ్, బారితోపాటు నల్లగొండ, నాగార్జునసాగర్, దేవరకొండ ప్రాంతాలకు ఒక్కొక్కరు ఉన్నారు. 360మంది సర్వీస్ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ పంపిణీ: జిల్లాకు చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో పనిచేస్తున్న వారికి ఈసారి ఎన్నికల సంఘం ట్రాన్స్మిషన్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఆన్లైన్లో పోస్టల్ బ్యాలెట్‌ను పంపించారు. వారు అక్కడ బ్యాలెట్‌ను డౌన్లోడ్ చేసుకొని ఓటు వేసి తిరిగి పోస్టల్లో సీల్డ్ కవర్లో ఓటును పంపించాల్సి ఉంది. రుతీరావు, శ్రవ పోలింగ్ అధికారులు, సిబ్బందికి సెకండ్ ట్రైనింగ్‌లోనే ఓటు వేసే అవకాశం: ఈనెల 28, 29 తేదీల్లో పోలింగ్‌లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి నియోజకవర్గాల్లో రెండో విడత ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఆ రోజు వారికి ఫారం 12 ఇవ్వడంతోపాటు పోస్టల్ బ్యాలెట్‌ను కూడా అందించనున్నారు. అక్కడ ట్రైనింగ్ సెంటర్లోనే ఒక బాక్స్ ఏర్పాటు చేసి అక్కడే ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. అదేరోజు ఓటువేసి బాక్స్‌లో వేసే అవకాశం ఉంది. అదే విధంగా ప్రతి నియోజకవర్గంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బాక్స్‌లు ఏర్పాటు చేయనున్నారు. అయితే ఎవరైనా ఉద్యోగులు నేరుగా కూడా వారు ఓటు వేసి ఆ బాక్స్‌లో వేసే అవకాశం ఉంది. కౌంటింగ్‌కు ముందు రోజు వరకు పోస్టల్ బ్యాలెట్‌ను తిరిగి పంపాలి ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్‌ను తీసుకొని కౌం టింగ్ నాటి వరకు అందించాల్సి ఉంది. పోస్ట్ ద్వారా కానీ, నేరుగా వచ్చి ఆయా నియోజకవర్గ కేంద్రాలలో ఏర్పాటు చేసిన బాక్స్‌లో కూడా వేయవచ్చు. ఇప్పటికే ఫారం 12పంపిణీ చేశాం.. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి సంబంధించి ఇప్పటికే 12వేల దరఖాస్తులను అందించాం. అందులో 6వేల వరకు తిరిగి అందించారు. ఈ సారి ఎన్నికల అధికారులు, సిబ్బందితో పాటు ఎన్నికల విధుల్లో పాల్గొనే ఇతర ప్రైవేట్ సిబ్బందికి కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాం. జిల్లాకు సంబంధించి వరంగల్ జైలులో ఉన్న ఆరుగురికి కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పిస్తున్నాం. అదే విధంగా జిల్లాకు చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్సుల్లో, ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నవారికి సర్వీస్ ఓటర్ల కింద ఇప్పటికే ఆన్లైన్ ద్వారా పంపించాం. తిరిగి వారు పోస్టుల్లో ఓటు వేసి పంపిస్తారు. – నోడల్ అధికారి సంగీత లక్ష్మి -
సమస్యాత్మకం 342
జిల్లా పోలీసు యంత్రాంగం శాసనసభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించే పనిలో నిమగ్నమైంది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన ఆ శాఖ.. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిపేందుకు.. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట ప్రణాళికలు రూపొందించి.. అమలు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఘర్షణలు జరిగే ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి.. భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. పోలింగ్ బూత్‌లవారీగా పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో మొత్తం 1,303 పోలింగ్ బూత్‌లు ఉండగా.. కొత్తగా మరో మూడు బూత్‌లను ఏర్పాటు చేశారు. ఇటీవల ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టగా.. పెరిగిన ఓటర్లను దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికారులు వాటిని ఏర్పాటు చేశారు. రెండు పోలింగ్ బూత్‌లను ఖమ్మం నియోజకవర్గంలో.. ఒకటి పాలేరు నియోజకవర్గం లోనూ ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలో 1,306 బూత్‌లున్నట్లు అయింది. ఈ లెక్క ప్రకారం ఖమ్మంలో 296 పోలింగ్ బూత్‌లు, పాలేరు 266, మధిర 251, వైరా 229, సత్తుపల్లిలో 264 పోలింగ్ బూత్‌లున్నాయి. మొత్తం పోలింగ్ బూత్‌లను పరిశీలించిన అనంతరం సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. 342 సమస్యాత్మక కేంద్రాలు జిల్లాలో మొత్తం 342 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో సమస్యాత్మకం, అత్యంత సమస్యాత్మక పోలింగ్ బూత్‌లను లెక్కించిన అధికార యంత్రాంగం ఈసారి సమస్యాత్మక బూత్‌లను మాత్రమే గుర్తించింది. గతంలో జరిగిన ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలు, ఘర్షణల ఆధారంగా సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. 342 సమస్మాత్మక కేంద్రాల్లో ఖమ్మం నియోజకవర్గంలో 65, పాలేరు 93, మధిర 69, వైరా 49, సత్తుపల్లి 66 ఉన్నాయి. వీటిలో...అత్యధికంగా పాలేరు నియోజకవర్గంలో 93 పోలింగ్ బూత్‌లున్నాయి. ఈ నియోజకవర్గంలో గతంలో పలు సంఘటనలు జరగడం వల్ల వీటిని సమస్యాత్మక పోలింగ్ బూత్‌ల జాబితాలో చేర్చారు. కూసుమంచి మండలం చేగొమ్మ, పోచారం, తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు, ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు, ముత్తగూడెం తదితర గ్రామాల్లో గతంలో ఎన్నికల సందర్భంగా ఘర్షణలు చోటుచేసుకోవడంతో ఈ పోలింగ్ బూత్‌లను సమస్యాత్మక కేంద్రాల పరిధిలోకి తెచ్చారు. పాలేరు తర్వాత మధిర, సత్తుపల్లి, ఖమ్మం కేంద్రాల్లో సమస్యాత్మక కేంద్రాలున్నట్లు గుర్తించారు. వైరా నియోజకవర్గంలో తక్కువగా 49 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలతోపాటు సాధారణ పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ యంత్రాంగంతోపాటు జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. గట్టి నిఘా ఏర్పాటు.. జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన 342 పోలింగ్ బూత్‌లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి నుంచే అక్కడ చేపట్టాల్సిన చర్యలపై పోలీస్ ఉన్నతాధికారులు సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఇప్పటికే బైండోవర్లను ముమ్మరం చేశారు. ఇక సమస్యాత్మక కేంద్రాలున్న ప్రాంతాల్లో బైండోవర్ల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఎన్నికలకంటే ముందు నుంచి పోలీస్ బందోబస్తును పటిష్టం చేశారు. ఎప్పటికప్పుడు పోలీసుల నిఘా.. పర్యవేక్షణ ఉండేలా చూస్తున్నారు. అలాగే ఘర్షణలు జరగకుండా అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. -
తెలంగాణ ఎన్నికల పరిశీలకుల నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది. ఇతర రాష్ట్రాల ఐపీఎస్ అధికారులను పరిశీలకులుగా ఖరారు చేసింది. ప్రతి జిల్లాకు ఒక్కరి చొప్పున ఎన్నికల పరిశీలకులను నియమించింది. హైదరాబాద్ ఎన్నికల పరిశీలకుడిగా డీఐజీ రేంజ్ అధికారి అజయ్‌దేవ్ కుమార్ నియమితులయ్యారు. ఎన్నికల్లో భద్రత అంశాలపై ఎప్పటికప్పుడు సీఈసీకి పరిశీలకులు సమాచారం ఇవ్వనున్నారు. ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన ప్రత్యేక అధికారులు తెలంగాణలో అన్ని జిల్లాలకు చేరుకున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే భద్రతా కట్టుదిట్టం చేశారు. రూ. 25కు మించి చెల్లించవద్దు..! ఓటరు కార్డుకు రూ. 25కు మించి చెల్లించనక్కర్లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. కొత్త ఓటరుగా నమోదయిన వారికి ఇంటిదగ్గర లేదా పోలింగ్ బూత్ వద్ద ఎన్నికల కమిషనే ఉచితంగా కార్డులు అందజేస్తుందని, పాత కార్డుల వారు మాత్రం రూ. 25 మాత్రమే చెల్లించి ‘మీసేవ’లో ఓటరు కార్డులు పొంద వచ్చని ఆయన వెల్లడించారు. ‘మీ సేవలో’ ఓటరు కార్డుకు రు.100 వసూలు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పలు ఫిర్యాదులు అందుతున్నాయనీ, ఇలా వసూలు చేయడం అక్రమమని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రూ. 25కు మించి అదనంగా ఎవరైనా వసూలు చేసినపక్షంలో పూర్తి వివరాలతో 1950కి ఫిర్యాదు చేస్తే.. తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త ఓటర్లుగా నమోదు అయిన వారికి ఇళ్ల వద్ద కానీ, పోలింగ్ జరిగే రోజున అయితే పోలింగ్ కేంద్రం వద్ద కానీ ఎపిక్ కార్డులను ఉచితంగా అంద చేస్తారని వివరించారు. -
గీత దాటితే వేటే..!
సాధారణ నియమాలు - అభ్యర్థి వ్యక్తిగతంగా కానీ పార్టీ తరఫున కానీ కుల, మత, భాషా విద్వేషాలను రెచ్చగొట్టొదు. - విధానాలు, కార్యక్రమాలపైనే విమర్శలు ఉండాలి. గతంలో చేసిన పని రికార్డుపైనే ఉండాలి. - కుల, మత ప్రాతిపదికన ఓట్లు అడగొద్దు. మందిరాలు, మసీదులు, చర్చిలతో పాటు ఇతర ప్రార్థనా ప్రాంతాలను ఎన్నికల ప్రచారం కోసం వాడొద్దు. - ఓటు కోసం డబ్బు ఇవ్వడం, బెదిరించడం నిషేధం. ఒక వ్యక్తి ఓటును మరో వ్యక్తి వేయడం నేరం. - వ్యక్తుల అనుమతి లేకుండా వాళ్ల భూమి, ఇంటిని ఎన్నికల ప్రచారానికి ఉపయోగించొద్దు. - ఇతర పార్టీల ఎన్నికల ప్రచారం, సమావేశాలకు ఆటంకం కలిగించొద్దు. ఎన్నికల నియమ నిబంధనలు - రాజకీయ పార్టీలు అంగీకరించిన మార్గదర్శక సూత్రాలను ఎన్నికల నిబంధనల్లో(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) చేర్చబడ్డాయి. - ప్రభుత్వ యంత్రాగాన్ని దుర్వినియోగం చేయొద్దు. ఎన్నికల నియమావళి యావత్ రాష్ట్రానికి వర్తిస్తుంది. - అధికారిక పర్యటనలను ఎన్నికల పనిలో కలపొద్దు. - ప్రభుత్వ వాహనాలు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల బదిలీలపై పూర్తి నిషేధం ఉంటుంది. - మంత్రులు ఎన్నికల అధికారులను పిలవడానికి వీలు లేదు. ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన మంత్రిని ఏ అధికారి కలవకూడదు. పైలట్ కార్లు, బుగ్గ కార్లు ఉపయోగించొద్దు. - అధికార పార్టీ చేసిన పనులను తెలిపే ప్రభుత్వ ప్రచార హోర్డింగ్‌లు, ప్లెక్సీలు ఉండొద్దు. - గతంలో మొదలపెట్టిన పనులను కొనసాగించొచ్చు. - ప్రకృతి వైఫరీత్యాలు వస్తే సహాయక కార్యక్రమాల్లో మంత్రులు పొల్గొనవచ్చు. కానీ రాజకీయ ప్రచారం చేయొద్దు. - శాంతియుతంగా ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల అధికారులకు సహకరించాలి. - ఎలక్షన్ స్లిప్పులు, ఓటరు చీటీలపై పార్టీ గుర్తు, అభ్యర్థి పేరు ఉండొద్దు. - ఎన్నికల అధికారులు ధృవీకరించిన పాసులు లేకుండా ఎవరు కూడా పోలింగ్ బూత్‌ల్లోకి వెళ్లొద్దు. ఊరేగింపులు -ఊరేగింపు మార్గం సమాచారం పోలీసులకు ముందుగానే అందించాలి. -ఊరేగింపు మార్గంలో ఏమైనా నిషేధాజ్ఞలు ఉన్నాయా అని చూసుకోవాలి. -ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకోవాలి. -ఎవరి దిష్టిబొమ్మలు, చిత్రపటాలను తగులపెట్టొద్దు. -నామినేషన్ దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం నుంచి వంద మీటర్ల పరిధిలోకి మూడు వాహనాలు మాత్రమే అనుమతి ఇస్తారు. ----అభ్యర్థితో సహా కేవలం ఐదుగురు మాత్రమే కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. -నామినేషన్లు పరిశీలన సమయంలో అభ్యర్థితో పాటు ఏజెంట్, మరో వ్యక్తి(లాయర్)ను తీసుకువెళ్లేందుకు అవకాశం ఇస్తారు. ప్రచారంలో ఇలా.. -ప్రచార వాహనానికి రిటర్నింగ్ అధికారి మందుస్తు అనుతమతి తీసుకోవాలి. స్పష్టంగా కన్పించేలా అనుమతి పత్రాన్ని వాహనానికి అతికించాలి. పర్మిట్ మీద వాహన నంబర్, అభ్యర్థి వివరాలు ఉండాలి. పర్మిట్ వాహనాన్ని అదే అభ్యర్థి కోసమే తప్ప మరో అభ్యర్థికి వాడకూడదు. -విద్యా సంస్థలు, వారి మైదానాలు ప్రచారానికి వాడకూడదు. -ప్రైవేట్ భూములు, భవనాల యజమానుల లిఖిత పూర్వక అనుమతి తీసుకొని రిటర్నింగ్ ఆఫీసర్‌కు అందించిన తర్వాతే గోడ పోస్టర్లు అతికించాలి. -కరపత్రాలు, పోస్టర్లపై ప్రింటింగ్ ప్రెస్ పేరు, చిరునామా విధిగా ఉండాలి. -ప్రజలను తమ పార్టీ వైపు ప్రచారంలో భాగంగా టోపీలు, కండువాలు ఇవ్వొచ్చు. వీటిని ఎన్నికల ఖర్చులో చూపించాల్సి ఉంటుంది. కానీ చొక్కాలు పంపిణీ చేయడానికి వీలు లేదు. -దేవుళ్లు ఫొటోలు, అభ్యర్థి ఫొటోలతో డైరీలు, క్యాలెండర్లు ముద్రించొద్దు. -ప్రార్థనా స్థలాలు, పాఠశాలలు, పోలింగ్ స్టేషన్లకు 200 మీటర్ల లోపు కార్యాలయాలను ఏర్పాటు చేయరాదు. కార్యాలయంపై పార్టీ జెండాలను కట్టుకోవచ్చు. -ఎన్నికల ప్రచార తేదీ ముగిసిన తర్వాత ఓటర్లు కాని వారు నియోజకవర్గంలో ఉండొద్దు. రాత్రి 10గంటల తర్వాత నుంచి ఉదయం 6గంటల వరకు మైకులు, లౌడ్ స్పీకర్లు ఉపయోగించరాదు. రాత్రి 10గంటల తర్వాత పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయరాదు. పోలింగ్ ఏజెంట్ అదే పోలింగ్ కేంద్రంలో ఓటరు అయి ఉండాలి. ఫొటోతో కూడిన ఓటరు గుర్తింపు కార్డు ఉండాలి. ఎస్ఎంఎస్ల ద్వారా అభ్యంతకర ప్రచారం చేయొద్దు. అభ్యంతర మెసేజ్‌లు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. పోలింగ్ స్టేషన్ నుంచి 200 మీటర్ల దూరంలో ఒక టేబుల్, రెండు కుర్చీలు, అభ్యర్థి పేరు, బ్యానర్‌తో ఎన్నికల బూత్ ఏర్పాటు చేసుకోవచ్చు. పోలింగ్ స్టేషన్ నుంచి 100 మీటర్ల లోపు ప్రచార నిషేధం. ఈ పరిధిలో మొబైల్ ఫోన్ వాడడం కానీ ఆయుధాలు కలిగి ఉండడం నిషేధం. ఎన్నికల రోజున అభ్యర్థి, ఏజెంట్, పార్టీ వర్కర్ల కోసం ఒక్కో వాహనం ఉపయోగించొచ్చు. ఈ వాహనంలో ఐదుగురికి మాత్రమే అనుమతి ఇస్తారు. పోలింగ్ రోజున ఓటర్లను తరలించడానికి అభ్యర్థులు ప్రైవేట్ వాహనాలు సమకూర్చడం నిషేధం. ఓటరు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు సహకరించాలి. అధికార పార్టీ వారైనా.. ఎన్నికల ప్రచారాన్ని అధికారిక పర్యటనలతో కలిపి చేయకూడదు. అధికార యంత్రాంగం, ప్రభుత్వ వాహనాలు, అతిథిగృహాలు ఉపయోగించొద్దు. ప్రభుత్వ ఖర్చులతో మీడియా ప్రకటనలు ఇవ్వొద్దు. ఎలాంటి గ్రాంట్లు, పేమెంట్లు, కొత్తగా మంజూరు ప్రకటనలు చేయెద్దు. నూతన భవనాలు, శంకుస్థాపన కార్యక్రమాలు చేయొద్దు. రోడ్డు నిర్మాణం, తాగునీటి సౌకర్యం కల్పిస్తామని వాగ్దానాలు చేయుద్దు. పోలింగ్ కేంద్రాల్లోకి మంత్రుల ప్రవేశించొద్దు. సమావేశాల కోసం.. పార్టీ సమావేశాలకు మందుగానే లిఖితపూర్వకంగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. నిషేధాజ్ఞలు, ఆంక్షలు ఉన్న ప్రదేశాల వివరాలు తెలుసుకుని అక్కడ సభలు, సమావేశాలు నిర్వహించొద్దు. సభలు, సమావేశాల సందర్భంగా మైకులు, లౌడ్ స్పీకర్ల వినియోగానికి ముందుగానే అనుమతి తీసుకోవాలి. సభలు, సమావేశాలకు ఎవరైనా అటంకం కలిగిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. పార్టీగా చర్య తీసుకోవడానికి వీలు లేదు. కార్యాలయాల ఏర్పాటుకు.. - ప్రార్థనా స్థలాలు, పాఠశాలలు, పోలింగ్ స్టేషన్లకు 200 మీటర్ల లోపు కార్యాలయాలను ఏర్పాటు చేయరాదు. కార్యాలయంపై పార్టీ జెండాలను కట్టుకోవచ్చు. - ఎన్నికల ప్రచార తేదీ ముగిసిన తర్వాత ఓటర్లు కాని వారు నియోజకవర్గంలో ఉండొద్దు. - రాత్రి 10గంటల తర్వాత నుంచి ఉదయం 6గంటల వరకు మైకులు, లౌడ్ స్పీకర్లు ఉపయోగించరాదు. రాత్రి 10గంటల తర్వాత పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయరాదు. - పోలింగ్ ఏజెంట్ అదే పోలింగ్ కేంద్రంలో ఓటరు అయి ఉండాలి. ఫొటోతో కూడిన ఓటరు గుర్తింపు కార్డు ఉండాలి. - ఎస్ఎంఎస్ల ద్వారా అభ్యంతకర ప్రచారం చేయొద్దు. అభ్యంతర మెసేజ్‌లు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. - పోలింగ్ స్టేషన్ నుంచి 200 మీటర్ల దూరంలో ఒక టేబుల్, రెండు కుర్చీలు, అభ్యర్థి పేరు, బ్యానర్‌తో ఎన్నికల బూత్ ఏర్పాటు చేసుకోవచ్చు. - పోలింగ్ స్టేషన్ నుంచి 100 మీటర్ల లోపు ప్రచార నిషేధం. ఈ పరిధిలో మొబైల్ ఫోన్ వాడడం కానీ ఆయుధాలు కలిగి ఉండడం నిషేధం. - ఎన్నికల రోజున అభ్యర్థి, ఏజెంట్, పార్టీ వర్కర్ల కోసం ఒక్కో వాహనం ఉపయోగించొచ్చు. ఈ వాహనంలో ఐదుగురికి మాత్రమే అనుమతి ఇస్తారు. - పోలింగ్ రోజున ఓటర్లను తరలించడానికి అభ్యర్థులు ప్రైవేట్ వాహనాలు సమకూర్చడం నిషేధం. ఓటరు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు సహకరించాలి. -
విధుల్లో అప్రమత్తంగా ఉండండి
నాగర్‌కర్నూల్ క్రైం: ఎన్నికల్లో ఏ చిన్న సంఘటన జరిగినా.. ఫిర్యాదులు వచ్చిన వాటికి సంబం ధిం చిన వీడియోలు, సీసీ కెమెరా పుటేజీలు తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతి అధికారి ఎన్నికల సంఘం ఆధీనంలో పని చేస్తున్నారని అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. గురువారం జిల్లాకేంద్రంలోని జిల్లా పోలీసు సమావేశ మందిరంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, వీవీ ప్యాట్లపై పోలీసు అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న ట్రబుల్ మంగర్స్(ఉద్దేశపూర్వకంగా నేరాలు చేసేవారు) ను బైండోవర్ చేయాలని, రిటర్నింగ్ అధికారుల తో కలిసి రూట్ మ్యాప్‌ను తయారు చేయాలని సూచించారు. ప్రచారంలో లౌడ్ స్పీకర్లను ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు వాడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సభలకు, సమావేశాలకు అనుమతులు మంజూరు చేసేటప్పుడు డీఎస్పీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని, వారి నిర్వర్తించే బాధ్యతలను వీడియోలలో చిత్రీకరించాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఉండేలా చూసుకోవాలన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఏవైనా ఫిర్యాదులు వస్తే అధికారులు వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికీ తమ ఇష్టం వచ్చిన వారికే ఓటు వేసుకునేలా ప్రశాంతమైన వాతావరణం కల్పించే బాధ్యత ప్రతి అధికారిపై ఉందన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వేసుకోవడానికి రెవెన్యూ అ«ధికారులతో కలిసి వర్ణలేబుల్టీ మ్యాపింగ్ తయారు చేయాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన శాంతిభద్రతల నివేదికను ప్రతిరోజూ ఎన్నికల అధికారికి , కలెక్టరేట్‌కు పంపాలని ఆదేశించారు. చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ప్రతి నియోజకవర్గంలోమూడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని, చెక్ పోస్టుల వద్ద వాహనాలు తనిఖీలు చేసేటప్పుడు వీడియోలు తీయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. హైపర్ క్రిటికల్, క్రిటికల్ , నార్మల్ పోలింగ్ బూత్‌లను వెంటనే గుర్తించాలన్నారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి ఓటర్లలో విశ్వాసాన్ని పెంచడానికి ఎన్నికల సంఘం వీవీ ప్యాట్లను ప్రవేశ పెట్టిందని ఆయన అన్నారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల పని తీరు గురించి గ్రామగ్రామాన అవగాహన సదస్సులు నిర్వహించాలని పోలీసు శాఖ అధికారులకు సూచించారు. ఓటింగ్ మిషన్ ,వీవీ ప్యాట్ల పనితీరు గురించి తెలియజేస్తూ సందేహ నివృత్తి చేయాలన్నారు. వాహనాల ద్వారా ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అనంతరం వీవీ ప్యాట్ల పనితీరు గురించి కలెక్టర్ శ్రీధర్ మాక్ పోలింగ్ ద్వారా పోలీసులకు అవగాహన కల్పించారు. ఈవీఎం, వీవీ ప్యాట్లపై అవగాహన ఉండాలి ఈవీఎం, వీవీ ప్యాట్ల గురించి ప్రతి పోలీసు అధికారి అవగాహన కలిగి ఉండి.. క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఎస్పీ సాయిశేఖర్ ఉంటుందన్నారు. తమ వద్దకు వచ్చి సమాచారం అడిగిన ఓటరుకు వివరాలు సవివరంగా తెలిపేలా పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల మ్యాన్యువల్ చదివి ఉండాలని సూచించారు. జిల్లాలోని 4 నియోజకవర్గాల నుంచి ఇప్పటికే పలువురు పోలీసులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. అవగాహన సదస్సులో ఏఎస్పీ జోగుల చెన్నయ్య, డీఎస్పీలు లక్ష్మీనారాయణ, నర్సింహులు, పుష్పారెడ్డి, సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
ఏం.. చేస్తున్నారు?
సాక్షిప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్కు తిరుగులేని విజయాలు అందించేందుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ పట్టుదలగా కనిపిస్తున్నారు. పన్నెండు నియోజకవర్గాల్లో పది చోట్ల అభ్యర్థులను ప్రకటించిన ఆయన వారిని నిద్రపోనీయడం లేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న ప్రచార సరళిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అభ్యర్థులను ఉత్సాహ పరుస్తున్నారని, ప్రతి రోజూ దాదాపు అందరితో మాట్లాడుతున్నారని సమాచారం. ఎవరేం చేస్తున్నారు..? ఏ నియోజకవర్గంలో ప్ర చారం జోరుగా సాగుతోంది..? అభ్యర్థులకు మద్దతుగా ఎవరెవరు ప్రచారంలో పాల్గొంటున్నారు..? పార్టీకి వస్తు న్న ఆదరణ ఎలా ఉంది..? అభ్యర్థులను ప్రజలు ఎలా స్వాగతిస్తున్నారు..? ఎక్కడెక్కడ అడ్డుకుంటున్నారు..? ఆ అసంతృప్తుల నుంచి, ప్రజల నిరసనలనుంచి అభ్యర్థులు ఎలా బయట పడుతున్నారు.. వంటి తదితర సమాచారాన్ని తెప్పించుకుంటున్న కేసీఆర్ వీరిని నిత్యం అప్రమత్తం చేస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘ప్రజల్లోనే ఉండండి.. ప్రచా రంలో ఎలాంటి గ్యాప్ ఇవ్వొద్దు. ఇంకా బాగా జనంలోకి వెళ్లి ప్రచారం చేయండి. గెలుపు మీదే..’ అని టీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఆ పార్టీ అభ్యర్థులను ఉత్సాహ పరుస్తున్నారని చెబుతున్నారు. జోరుగా ప్రచారం గత నెల 6వ తేదీన టీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించింది. జిల్లాలో ఇంకా హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో మాత్రమే ఖరారు చేయాల్సింది. ఈ రెండు స్థానాలను మినహాయిస్తే, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో ప్రచారం జోరందుకుంది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులకు ఇబ్బందిగా మారిని అసమ్మతి కుంపట్లపైనా అధినాయకత్వం నీళ్లు చల్లింది. కొన్నిచోట్ల అసమ్మతి నేతలకు, అభ్యర్థులకు చేతులు కలిపించింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అన్ని వర్గాలు కలిసి ప్రచారంలో పాల్గొంటున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకటీ రెండు నియోజకవర్గాల్లో ప్రచారంలో అభ్యర్థులకు కొంత వ్యతిరేకత వచ్చినా, ఆ నిరసనలు ప్రజల నుంచి కాకుండా ప్రతిపక్ష పార్టీలు తమకు పట్టున్న గ్రామాల్లో చేసిన కార్యక్రమాలని తేలడంతో వారు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం పది నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ శ్రేణులు జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పరిస్థితిని పార్టీకి అనుకూలంగా మార్చేందుకు జిల్లా నాయకత్వం చొరవ తీసుకుంది. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తాసుఖేందర్ రెడ్డి ఇతర నేతలంతా కలిసి ఆ నియోజకవర్గంలో అన్ని వర్గాల నాయకులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి హాలియాలో సమావేశం ఏర్పాటు చేశారు. నకిరేకల్, నల్లగొండ నియోజకవర్గాల్లో అభ్యర్థులు వేముల వీరేశం, కంచర్ల భూపాల్‌రెడ్డి ఇంటింటి ప్రచారం మొదలు పెట్టారు. గడిచిన వారం పది రోజులుగా నకిరేకల్‌లో ఈ తరహా ప్రచారం జరుగుతుండగా, నాలుగు రోజులుగా నల్లగొండలోనూ కంచర్ల ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. అధినేతతో ప్రత్యేక భేటీ టీఆర్ఎస్ అభ్యర్థులు అందరితో ముఖాముఖి సంభాషించేందుకు అధినేత కేసీఆర్ వీరందరితో ఆదివారం హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరు అభ్యర్థులకు ఉద్దేశించిన సమావేశం అయినా.. ఇందులో ప్రచార వ్యూహం గురించి చర్చిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో కేసీఆర్ భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా ప్రచారం తీరుతెన్నుల గురించి వాకబు చేస్తూనే.. నేరుగా అభ్యర్థులతో ముఖా ముఖి సమావేశం కావాలని నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎక్కడెక్కడ లోటు పాట్లు ఉన్నాయి..? ఎవరెవరు ఇంకా సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంది..? ప్రచారం వ్యూహం తదితర అంశాలపై ఆయన అభ్యర్థులకు ఈ భేటీలో మార్గనిర్దేశం చేస్తారని పేర్కొంటున్నారు. -
ఎన్నికల ప్రక్రియ స్పీడ్!
ముందస్తు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం తన పని తాను చేసుకుపోతోంది. ఇటీవలే షెడ్యూల్ ప్రకటించి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన ఎన్నికల సంఘం.. నవంబర్‌లో నోటిఫికేషన్ వెలువడినా ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధం కావాలని సూచించింది. దీంతో ఎన్నికల ప్రక్రియ స్పీడుగా జరుగుతోంది. 2018 నవంబర్ 30 నాటికి గడిచిన నాలుగేళ్లలో ఒకే జిల్లా పరిధిలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారులను బదిలీ చేయాలని ఆదేశించింది. ఎన్నికల విధులతో నేరుగా సంబంధమున్న అధికారుల బదిలీలకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఇప్పటికే పలువురు జాయింట్ కలెక్టర్లు, టీఆర్వోలు, ఆర్డీవోలు, ఏసీపీ/డీసీపీలను, సీఐలను బదిలీ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 35 ఎస్సైఐ, సీఐలతోపాటు పలువురిని బదిలీ చేశారు. మరో ఐదుగురు ఉన్నతాధికారులతోపాటు 32 మంది తహసీల్దార్లు, పలువురు సీఐ, ఎస్సైల బదిలీ జాబితా నేడో రేపో వెలువడనున్నట్లు అధికారవర్గాల సమాచారం. కాగా.. తాజాగా ఓటర్ల జాబితాను కూడా జిల్లాల వారీగా ప్రభుత్వం శుక్రవారం రాత్రి ప్రకటించింది. దీంతో ఓ వైపు బదిలీలు.. మరోవైపు ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాలపై అధికారులు ఆరా తీస్తుండగా, జిల్లాలో ఎన్నికల ప్రక్రియ జోరందుకుంది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఓ వైపు ఎన్నికల నిబంధనల ప్రకారం జిల్లాలో మూడేళ్లపాటు పనిచేసిన సీఐలు, ఎస్ఐలను బదిలీ చేయాలని మార్గదర్శకాలు జారీ చేసిన ఎన్నికల సంఘం.. మరోవైపు గ్రామాల్లో శాంతిభద్రతల వ్యవహారంపై దృష్టి సారించాలని ఆదేశించింది. ఈ మేరకు కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లా పోలీసు కమిషనర్లు, ఎస్పీలకు ఓ ప్రశ్నావళిని పంపిన ఎన్నికల సంఘం వీలైనంత తొందరలో నివేదిక పంపాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ విషయమై రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా రెండు రోజుల కింద జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికలు రెండు విడతల్లో జరుగగా.. ఆ ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎన్ని బైండోవర్లు చేశారు..? రౌడీషీటర్లు ఎంతమంది ఉన్నారు..? ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులు ఎన్ని..? వీటిలో ఎన్ని పరిష్కారమయ్యాయి..? తుపాకీ అనుమతులు ఎంతమందికి ఉన్నాయి..? తదితర వివరాలు పూర్తిస్థాయిలో సేకరించి ఆ అంశాలను నివేదికలో పేర్కొనాలని ఆ ఉత్తర్వులో ఎన్నికల సంఘం సూచించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల సీపీ/ఎస్పీలు ఈ సమాచార సేకరణ బాధ్యతలను ఆయా సబ్ డివిజన్ల పరిధిలోని డీఎస్పీలకు అప్పగించినట్లు తెలిసింది. గ్రామానికి ఇద్దరు కానిస్టేబుళ్ల చొప్పున పంపిన పోలీసు యంత్రాంగం ఆ సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమైంది. పోలీసుల వద్ద ఇదివరకే ఉన్న అంశాలను ఎన్నికల సంఘానికి పంపినా వచ్చే ఎన్నికల్లో శాంతిభద్రతల అంశమే కీలకం కావడంతో మరో తాజాగా నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రెవెన్యూ, పోలీసు, పంచాయతీ అధికార్ల జాబితా సిద్ధం.. నేడో రేపో ఎన్నికల బదిలీల ఉత్తర్వులు.. జిల్లాలో మళ్లీ అధికారుల స్థాయిలో బదిలీ సందడి మొదలు కానుంది. ఈ ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం జిల్లా స్థా యిలో అధికారుల బదిలీలు పచ్చజెండా ఊపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీవో నంబర్ 8తో కూడిన ఉత్తర్వులు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి పేరు మీద విడుదల కాగా ఇప్పటికే పలువురు ఎస్సైలతోపాటు పలువురు ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. జాయింట్ కలెక్టర్లు, డీఆర్వోలు, ఆర్డీవోలు, అసిస్టెంట్ పోలీసు కమిషనర్లు, డీఎస్పీలతోపాటు ఇతర శాఖల అధికారులు బదిలీ అయ్యారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురి బదిలీ లు జరిగే అవకాశం ఉండగా, పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులను క్యాడర్‌ను బట్టి పాత వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలకు, హైదరాబాద్‌కు బదిలీ చేసే అవకాశం ఉంది. అదే విధంగా మూడేళ్లు పూర్తయిన 32 మంది తహసీల్దార్లు, తొమ్మిది మంది పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్లతోపాటు పలువురికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు బదిలీల కసరత్తును పూర్తి చేసిన ఉన్నతాధికారులు నేడో రేపో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని కూడా తెలిసింది. బదిలీలకు నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలివి.. శాసనసభ ముందస్తు ఎన్నికల విధుల్లో పాల్గొంటు న్న అధికారులు సొంత జిల్లాల్లో కొనసాగరాదని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. 2018, నవంబర్ 30 నాటికి గడిచిన నాలుగేళ్ల కాలంలో ఒకే జిల్లా పరిధిలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారులను బదిలీ చేయాలి. ఎన్నికల విధులతో నేరుగా సంబంధమున్న అధికారుల బదిలీలకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. బదిలీల్లో భాగంగా సొంత జిల్లాలకు ఎవరినీ పంపించరాదు. అలాగే గత అసెంబ్లీ ఎన్నికలు/ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గం/జిల్లా పరిధిలో పని చేసిన జిల్లా ఎన్నికల అధికారులు (డీఈఓ), రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, పోలీసు ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఆపై హోదా కలిగిన అధికారులు మళ్లీ అదే నియోజకవర్గం/జిల్లా పరిధిలో కొనసాగరాదు. ఈ బదిలీల ప్రక్రియను ఈనెల 17లోగా పూర్తి చేసి, నివేదిక ఎన్నికల సంఘానికి సమర్పించాలి. జిల్లాస్థాయిలో ఎన్నికలతో నేరుగా సంబంధం ఉన్న జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, ఎన్నికల నోడల్ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్లకు ఈ బదిలీ మార్గదర్శకాలు వర్తిస్తాయి. ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లతో సంబంధమున్న సీపీ/ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లకు సైతం ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.