సాక్షి, నల్లగొండ : అసెంబ్లీ సాధారణ ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఇతర ప్రైవేట్ వ్యక్తులకు, సర్వీస్ ఓటర్లకు, జైలులో ఉంటూ శిక్ష ఖరారుకాని, శిక్ష అనుభవిస్తున్న వారికి ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించింది. జిల్లా ఎన్నికల సంఘం కూడా ఈ మేరకు జిల్లాలోని ఆయా వర్గాలను గుర్తించింది. డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికకు సంబంధించి జిల్లాలో సుమారు 16వేల మంది ఎలక్షన్ విధులు నిర్వహించనున్నారు. ఇందులో జిల్లా అధికారులతోపాటు రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీఓలు, సెక్టోరల్ అధికారులు, పోలీస్, మైక్రో అబ్జర్వర్స్, డ్రైవర్లు, కండక్టర్లు, క్లీనర్లతోపాటు అద్దె వాహనాల డ్రైవర్లు, ప్రైవేట్ సిబ్బంది ఉన్నారు. వీరందరికీ పోస్టల్‌లో ఓటు వేసే అవకాశం కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 16వేల మందికి పోస్టల్‌బ్యాలెట్‌లో ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు.
12వేల దరఖాస్తుల పంపిణీ..
ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి ఫారం 12(పోస్టల్‌బ్యాలెట్ దరఖాస్తు)ను దాదాపు 12వేల మందికి ఇప్పటికే పంపిణీచేశారు. తిరిగి 6వేల దరఖాస్తులు అందాయి. అత్యధికంగా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన ఉద్యోగులంతా ఎల్‌బీనగర్‌లో ఉన్నారు. వారు అక్కడే పోస్టల్ బ్యాలెట్‌ను తీసుకున్నారు.
వరంగల్ జైలులో ఉన్న ఆరుగురికి పోస్టల్ ఓటు అవకాశం..
జిల్లాకు చెందిన వారు వరంగల్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న, ఇంకా శిక్ష ఖరారు కాని ట్రయల్‌లో ఉన్న ఆరుగురికి జిల్లా ఎన్నికల అధికారులు ఓటు హక్కును కల్పించారు. ఇప్పటికే సంబంధిత పై అధికారుల నుంచి వారికి పోస్టల్‌బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించాలని ఆదేశాలు అం దాయి. వీరిలో ఇటీవల సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసు నిందితులు మాణ్, బారితోపాటు నల్లగొండ, నాగార్జునసాగర్, దేవరకొండ ప్రాంతాలకు ఒక్కొక్కరు ఉన్నారు.
360మంది సర్వీస్ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ పంపిణీ:
జిల్లాకు చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో పనిచేస్తున్న వారికి ఈసారి ఎన్నికల సంఘం ట్రాన్స్‌మిషన్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఆన్‌లైన్‌లో పోస్టల్ బ్యాలెట్‌ను పంపించారు. వారు అక్కడ బ్యాలెట్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఓటు వేసి తిరిగి పోస్టల్‌లో సీల్డ్ కవర్‌లో ఓటును పంపించాల్సి ఉంది. రుతీరావు, శ్రవ
పోలింగ్ అధికారులు, సిబ్బందికి సెకండ్ ట్రైనింగ్‌లోనే ఓటు వేసే అవకాశం:
ఈనెల 28, 29 తేదీల్లో పోలింగ్‌లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి నియోజకవర్గాల్లో రెండో విడత ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఆ రోజు వారికి ఫారం 12 ఇవ్వడంతోపాటు పోస్టల్ బ్యాలెట్‌ను కూడా అందించనున్నారు. అక్కడ ట్రైనింగ్ సెంటర్‌లోనే ఒక బాక్స్ ఏర్పాటు చేసి అక్కడే ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. అదేరోజు ఓటువేసి బాక్స్‌లో వేసే అవకాశం ఉంది. అదే విధంగా ప్రతి నియోజకవర్గంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బాక్స్‌లు ఏర్పాటు చేయనున్నారు. అయితే ఎవరైనా ఉద్యోగులు నేరుగా కూడా వారు ఓటు వేసి ఆ బాక్స్‌లో వేసే అవకాశం ఉంది.
కౌంటింగ్‌కు ముందు రోజు వరకు పోస్టల్ బ్యాలెట్‌ను తిరిగి పంపాలి ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్‌ను తీసుకొని కౌం టింగ్ నాటి వరకు అందించాల్సి ఉంది. పోస్ట్ ద్వారా కానీ, నేరుగా వచ్చి ఆయా నియోజకవర్గ కేంద్రాలలో ఏర్పాటు చేసిన బాక్స్‌లో కూడా వేయవచ్చు.
ఇప్పటికే ఫారం 12పంపిణీ చేశాం..
ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి సంబంధించి ఇప్పటికే 12వేల దరఖాస్తులను అందించాం. అందులో 6వేల వరకు తిరిగి అందించారు. ఈ సారి ఎన్నికల అధికారులు, సిబ్బందితో పాటు ఎన్నికల విధుల్లో పాల్గొనే ఇతర ప్రైవేట్ సిబ్బందికి కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాం. జిల్లాకు సంబంధించి వరంగల్ జైలులో ఉన్న ఆరుగురికి కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పిస్తున్నాం. అదే విధంగా జిల్లాకు చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్సుల్లో, ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నవారికి సర్వీస్ ఓటర్ల కింద ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా పంపించాం. తిరిగి వారు పోస్టుల్లో ఓటు వేసి పంపిస్తారు.
– నోడల్ అధికారి సంగీత లక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment