గీత దాటితే వేటే..! | EC's Dos And Don'ts For Poll Campaign | Sakshi
Sakshi News home page

గీత దాటితే వేటే..!

Published Mon, Nov 12 2018 10:11 AM | Last Updated on Wed, Mar 6 2019 6:22 PM

EC's Dos And Don'ts For Poll Campaign - Sakshi

సాధారణ నియమాలు 
- అభ్యర్థి వ్యక్తిగతంగా కానీ పార్టీ తరఫున కానీ కుల, మత, భాషా విద్వేషాలను రెచ్చగొట్టొదు.   

- విధానాలు, కార్యక్రమాలపైనే విమర్శలు ఉండాలి. గతంలో చేసిన పని రికార్డుపైనే ఉండాలి. 
- కుల, మత ప్రాతిపదికన ఓట్లు అడగొద్దు. మందిరాలు, మసీదులు, చర్చిలతో పాటు ఇతర ప్రార్థనా ప్రాంతాలను ఎన్నికల ప్రచారం కోసం వాడొద్దు. 
- ఓటు కోసం డబ్బు ఇవ్వడం, బెదిరించడం నిషేధం. ఒక వ్యక్తి ఓటును మరో వ్యక్తి వేయడం నేరం. 
- వ్యక్తుల అనుమతి లేకుండా వాళ్ల భూమి, ఇంటిని ఎన్నికల ప్రచారానికి ఉపయోగించొద్దు. 
- ఇతర పార్టీల ఎన్నికల ప్రచారం, సమావేశాలకు ఆటంకం కలిగించొద్దు.

ఎన్నికల నియమ నిబంధనలు
- రాజకీయ పార్టీలు అంగీకరించిన మార్గదర్శక సూత్రాలను ఎన్నికల నిబంధనల్లో(మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌) చేర్చబడ్డాయి. 
- ప్రభుత్వ యంత్రాగాన్ని దుర్వినియోగం చేయొద్దు. ఎన్నికల నియమావళి యావత్‌ రాష్ట్రానికి వర్తిస్తుంది. 
- అధికారిక పర్యటనలను ఎన్నికల పనిలో కలపొద్దు. 
- ప్రభుత్వ వాహనాలు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల బదిలీలపై పూర్తి నిషేధం ఉంటుంది. 
- మంత్రులు ఎన్నికల అధికారులను పిలవడానికి వీలు లేదు. ప్రైవేట్‌ కార్యక్రమానికి వచ్చిన మంత్రిని ఏ అధికారి కలవకూడదు. 
   పైలట్‌ కార్లు, బుగ్గ కార్లు ఉపయోగించొద్దు. 
- అధికార పార్టీ చేసిన పనులను తెలిపే ప్రభుత్వ ప్రచార హోర్డింగ్‌లు, ప్లెక్సీలు ఉండొద్దు. 
- గతంలో మొదలపెట్టిన పనులను కొనసాగించొచ్చు. 
- ప్రకృతి వైఫరీత్యాలు వస్తే సహాయక కార్యక్రమాల్లో  మంత్రులు పొల్గొనవచ్చు. కానీ రాజకీయ ప్రచారం చేయొద్దు.
- శాంతియుతంగా ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల అధికారులకు సహకరించాలి. 
- ఎలక్షన్‌ స్లిప్పులు, ఓటరు చీటీలపై పార్టీ గుర్తు, అభ్యర్థి పేరు ఉండొద్దు. 
- ఎన్నికల అధికారులు ధృవీకరించిన పాసులు లేకుండా ఎవరు కూడా పోలింగ్‌ బూత్‌ల్లోకి వెళ్లొద్దు. 


ఊరేగింపులు 
-ఊరేగింపు మార్గం సమాచారం పోలీసులకు ముందుగానే అందించాలి. 
-ఊరేగింపు మార్గంలో ఏమైనా నిషేధాజ్ఞలు ఉన్నాయా అని చూసుకోవాలి. 
-ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా చూసుకోవాలి. 
-ఎవరి దిష్టిబొమ్మలు, చిత్రపటాలను తగులపెట్టొద్దు. 
-నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయం నుంచి వంద మీటర్ల పరిధిలోకి మూడు వాహనాలు మాత్రమే అనుమతి ఇస్తారు. ----అభ్యర్థితో సహా కేవలం ఐదుగురు మాత్రమే కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. 
-నామినేషన్లు పరిశీలన సమయంలో అభ్యర్థితో పాటు ఏజెంట్, మరో వ్యక్తి(లాయర్‌)ను తీసుకువెళ్లేందుకు అవకాశం ఇస్తారు. 

ప్రచారంలో ఇలా..
-ప్రచార వాహనానికి రిటర్నింగ్‌ అధికారి మందుస్తు అనుతమతి తీసుకోవాలి. స్పష్టంగా కన్పించేలా అనుమతి పత్రాన్ని వాహనానికి అతికించాలి. పర్మిట్‌ మీద వాహన నంబర్, అభ్యర్థి వివరాలు ఉండాలి. పర్మిట్‌ వాహనాన్ని అదే అభ్యర్థి కోసమే తప్ప మరో అభ్యర్థికి వాడకూడదు. 
-విద్యా సంస్థలు, వారి మైదానాలు ప్రచారానికి వాడకూడదు. 
-ప్రైవేట్‌ భూములు, భవనాల యజమానుల లిఖిత పూర్వక అనుమతి తీసుకొని రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు అందించిన తర్వాతే గోడ పోస్టర్లు అతికించాలి. 
-కరపత్రాలు, పోస్టర్లపై ప్రింటింగ్‌ ప్రెస్‌ పేరు, చిరునామా విధిగా ఉండాలి. 
-ప్రజలను తమ పార్టీ వైపు ప్రచారంలో భాగంగా టోపీలు, కండువాలు ఇవ్వొచ్చు. వీటిని ఎన్నికల ఖర్చులో చూపించాల్సి ఉంటుంది. కానీ చొక్కాలు పంపిణీ చేయడానికి వీలు లేదు. 
-దేవుళ్లు ఫొటోలు, అభ్యర్థి ఫొటోలతో డైరీలు, క్యాలెండర్లు ముద్రించొద్దు.
-ప్రార్థనా స్థలాలు, పాఠశాలలు, పోలింగ్‌ స్టేషన్లకు 200 మీటర్ల లోపు కార్యాలయాలను ఏర్పాటు చేయరాదు. కార్యాలయంపై పార్టీ జెండాలను కట్టుకోవచ్చు. 
-ఎన్నికల ప్రచార తేదీ ముగిసిన తర్వాత ఓటర్లు కాని వారు నియోజకవర్గంలో ఉండొద్దు. 
రాత్రి 10గంటల తర్వాత నుంచి ఉదయం 6గంటల వరకు మైకులు, లౌడ్‌ స్పీకర్లు ఉపయోగించరాదు. రాత్రి 10గంటల తర్వాత పబ్లిక్‌ మీటింగ్‌ ఏర్పాటు చేయరాదు. 


పోలింగ్‌

ఏజెంట్‌ అదే పోలింగ్‌ కేంద్రంలో ఓటరు అయి ఉండాలి. ఫొటోతో కూడిన ఓటరు గుర్తింపు కార్డు ఉండాలి. 
ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అభ్యంతకర ప్రచారం చేయొద్దు. అభ్యంతర మెసేజ్‌లు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. 
పోలింగ్‌ స్టేషన్‌ నుంచి 200 మీటర్ల దూరంలో ఒక టేబుల్, రెండు కుర్చీలు, అభ్యర్థి పేరు, బ్యానర్‌తో ఎన్నికల బూత్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. 
పోలింగ్‌ స్టేషన్‌ నుంచి 100 మీటర్ల లోపు ప్రచార నిషేధం. ఈ పరిధిలో మొబైల్‌ ఫోన్‌ వాడడం కానీ ఆయుధాలు కలిగి ఉండడం నిషేధం. 
ఎన్నికల రోజున అభ్యర్థి, ఏజెంట్, పార్టీ వర్కర్ల కోసం ఒక్కో వాహనం ఉపయోగించొచ్చు. ఈ వాహనంలో ఐదుగురికి మాత్రమే అనుమతి ఇస్తారు. 
పోలింగ్‌ రోజున ఓటర్లను తరలించడానికి అభ్యర్థులు ప్రైవేట్‌ వాహనాలు సమకూర్చడం నిషేధం. ఓటరు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు సహకరించాలి. 
అధికార పార్టీ వారైనా.. 
ఎన్నికల ప్రచారాన్ని అధికారిక పర్యటనలతో కలిపి చేయకూడదు. 
అధికార యంత్రాంగం, ప్రభుత్వ వాహనాలు, అతిథిగృహాలు ఉపయోగించొద్దు. 
ప్రభుత్వ ఖర్చులతో మీడియా ప్రకటనలు ఇవ్వొద్దు. 
ఎలాంటి గ్రాంట్లు, పేమెంట్లు, కొత్తగా మంజూరు ప్రకటనలు చేయెద్దు. 
నూతన భవనాలు, శంకుస్థాపన కార్యక్రమాలు చేయొద్దు. 
రోడ్డు నిర్మాణం, తాగునీటి సౌకర్యం కల్పిస్తామని వాగ్దానాలు చేయుద్దు. 
పోలింగ్‌ కేంద్రాల్లోకి మంత్రుల ప్రవేశించొద్దు.

సమావేశాల కోసం.
పార్టీ సమావేశాలకు మందుగానే లిఖితపూర్వకంగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. 
నిషేధాజ్ఞలు, ఆంక్షలు ఉన్న ప్రదేశాల వివరాలు తెలుసుకుని అక్కడ సభలు, సమావేశాలు నిర్వహించొద్దు. 
సభలు, సమావేశాల సందర్భంగా మైకులు, లౌడ్‌ స్పీకర్ల వినియోగానికి ముందుగానే అనుమతి తీసుకోవాలి. 
సభలు, సమావేశాలకు ఎవరైనా అటంకం కలిగిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. పార్టీగా చర్య తీసుకోవడానికి వీలు లేదు. 

కార్యాలయాల ఏర్పాటుకు..

- ప్రార్థనా స్థలాలు, పాఠశాలలు, పోలింగ్‌ స్టేషన్లకు 200 మీటర్ల లోపు కార్యాలయాలను ఏర్పాటు చేయరాదు. కార్యాలయంపై పార్టీ జెండాలను కట్టుకోవచ్చు. 
- ఎన్నికల ప్రచార తేదీ ముగిసిన తర్వాత ఓటర్లు కాని వారు నియోజకవర్గంలో ఉండొద్దు. 
- రాత్రి 10గంటల తర్వాత నుంచి ఉదయం 6గంటల వరకు మైకులు, లౌడ్‌ స్పీకర్లు ఉపయోగించరాదు. రాత్రి 10గంటల తర్వాత పబ్లిక్‌ మీటింగ్‌ ఏర్పాటు చేయరాదు. 
- పోలింగ్‌ ఏజెంట్‌ అదే పోలింగ్‌ కేంద్రంలో ఓటరు అయి ఉండాలి. ఫొటోతో కూడిన ఓటరు గుర్తింపు కార్డు ఉండాలి. 
- ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అభ్యంతకర ప్రచారం చేయొద్దు. అభ్యంతర మెసేజ్‌లు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. 
- పోలింగ్‌ స్టేషన్‌ నుంచి 200 మీటర్ల దూరంలో ఒక టేబుల్, రెండు కుర్చీలు, అభ్యర్థి పేరు, బ్యానర్‌తో ఎన్నికల బూత్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. 
- పోలింగ్‌ స్టేషన్‌ నుంచి 100 మీటర్ల లోపు ప్రచార నిషేధం. ఈ పరిధిలో మొబైల్‌ ఫోన్‌ వాడడం కానీ ఆయుధాలు కలిగి ఉండడం నిషేధం. 
- ఎన్నికల రోజున అభ్యర్థి, ఏజెంట్, పార్టీ వర్కర్ల కోసం ఒక్కో వాహనం ఉపయోగించొచ్చు. ఈ వాహనంలో ఐదుగురికి మాత్రమే అనుమతి ఇస్తారు. 
- పోలింగ్‌ రోజున ఓటర్లను తరలించడానికి అభ్యర్థులు ప్రైవేట్‌ వాహనాలు సమకూర్చడం నిషేధం. ఓటరు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు సహకరించాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement