
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లకు అవగహన కల్పించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. దీనిలో భాగంగా రేపు, ఎల్లుండి (శనివారం, ఆదివారం) ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల అవగహన కార్యక్రమంను చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించనున్నారు. ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం మీడియా సమావేశంలో ఈ మేరకు వివరాలను తెలియజేశారు.
పోలింగ్ బూత్ వద్ద బూత్‌లెవల్ అధికారులతో కార్యక్రమం నిర్వహిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. కొత్తగా ఓటరు నమోదు, ఓటరులిస్ట్ పరిశీలనకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతిఒక్కరు తమ ఓటు ఉందా లేదా అని పరిశీలించుకోవాలని, ఓటు లేకపోతే ఫామ్-6తో నమోదు చేయించుకోవాలని అధికారులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment