
సాక్షి, విజయవాడ: ఎన్నికల పరిశీలకులు వెంటనే విధుల్లోకి చేరాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరపున నిర్భయంగా బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల్లో వాలంటీర్ల సేవలు వినియోగించుకోవద్దని స్పష్టం చేశారు.(ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్‌ల నియామకం)
ఎన్నికల కమిషన్ వాట్సాప్ గ్రూప్ ద్వారా సూచనలు, సలహాలు ఇవ్వవచ్చని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహిస్తున్నందున బ్యాలెట్ పేపర్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని రమేష్‌కుమార్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment