సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సెక్రటరీగా వ్యవహరిస్తున్న వాణీమోహన్‌ను విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాణీమోహన్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు సింగిల్ బెంచ్ పంచాయతీ ఎన్నికల ఉత్తర్వులను కొట్టేసినా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ తన వైఖరి మార్చుకోకపోవడం గమనార్హం.
కాగా, పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేలా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం తప్పుపట్టింది. ఎన్నికల కమిషన్ ఈ నెల 8న జారీ చేసిన షెడ్యూల్ అమలును నిలిపేసింది. ఎన్నికల కమిషన్ ఆచరణ సాధ్యం కాని నిర్ణయం తీసుకుందని ఆక్షేపించింది. ఈ ఎన్నికల షెడ్యూల్ రాజ్యాంగంలోని అధికరణలు 14, 21లకు విరుద్ధమని తేల్చి చెప్పింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్ బృహత్కార్యానికి విఘాతం కలిగిస్తుందని స్పష్టం చేసింది.
(చదవండి: నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం)
సంప్రదింపుల సందర్భంగా క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన స్వీయ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని ఎన్నికల షెడ్యూల్‌ను జారీ చేసిందని ఆక్షేపించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్ జారీ చేసిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అమలును నిలిపేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సాయిప్రసాద్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ నిమ్మగడ్డ సోమవారం వివాదాస్పద నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
(చదవండి: పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్)
Comments
Please login to add a commentAdd a comment