
ఐర్లాండ్ టు ఇండియా
మంచు విష్ణు, సురభి జంటగా జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓటర్’. సుధీర్ కుమార్ పూదోట (జాన్) నిర్మాత. ఇటీవలే ఐర్లాండ్‌లో రెండు పాటల చిత్రీకరణ పూర్తి చేసుకొన్న యూనిట్ ఇండియా వచ్చింది. సుధీర్‌కుమార్ పూదోట మాట్లాడుతూ– ‘‘ఒక పాట మినహా సినిమా పూర్తయింది.
ప్రత్యేకమైన సెట్‌లో ఈ పాట చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. విష్ణు కెరీర్‌లో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలవడంతో పాటు మా చిత్ర బృందానికి మంచి పేరు తీసుకొస్తుంది. త్వరలోనే టైటిల్ లోగో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, లైన్ ప్రొడ్యూసర్: ఎస్.కె.నయూమ్, సహ నిర్మాత: కిరణ్ తనమాల.