
కొప్పర్రులో ఓ ఇంటి గోడపై ఓటరును చైతన్య పరుస్తున్న రాతలు
పశ్చిమగోదావరి , నరసాపురం రూరల్: ఓటును నోటుకు అమ్మితే ఐదేళ్లు మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ ప్రచారం చేస్తున్నాడో అభ్యదయ ఓటరు. నరసాపురం మండలం కొప్పర్రుకు చెందిన కుంకటి కాంతారావు అనే రాజకీయ ఓనమాలు తెలిసిన ఓటరు తన ఇంటి గోడపై ‘ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు’ అంటూ రాసిన రాతలు రాజకీయ నాయకులకు చెంపపెట్టులా ఉన్నాయి. ప్రజాసామ్య వ్యవస్థలో ఓటరు తన ఓటు పదును చూపిస్తున్నట్టుగా ఉన్న రాతలు రాజకీయ చైతన్యం తీసుకువస్తాయని పలువురు అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం అని చాటేలా ఉన్న ఈ మాటలు ఆలోచింపజేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment