ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం వాయిదా
Published Tue, Nov 1 2016 12:00 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
కర్నూలు(అగ్రికల్చర్): ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎన్నికల కమిషన్ ముందుగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం సోమవారం ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించాల్సి ఉంది. ఆదే రోజు నుంచి 18 ఏళ్లు నిండిన వారందరి నుంచి ఓటర్లుగా నమోదు అయ్యేందుకు ఫారం–6లు స్వీకరించాల్సి ఉంది. కాని ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించేందుకు ఇంతవరకు ఎన్నికల కమిషన్ నుంచి సాఫ్ట్‌కాపీ రాలేదు. ఇది వస్తేనే పోలింగ్ కేంద్రం వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. దీనిపై ఎలాంటి సమాచారం లేనందున ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడినట్టేనని అధికారులు తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాను ఎప్పుడు ప్రకటించేది ఒకటి రెండు రోజుల్లో ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement