కొత్త మార్పు... నేటి ఓటరు తీర్పు | new tend in elections | Sakshi
Sakshi News home page

కొత్త మార్పు... నేటి ఓటరు తీర్పు

Published Sat, Nov 12 2016 12:57 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

కొత్త మార్పు... నేటి ఓటరు తీర్పు - Sakshi

కొత్త మార్పు... నేటి ఓటరు తీర్పు

జాతిహితం
మతంలాగే జాతీయవాదం కూడా మానవుల అత్యంత పాత భావోద్వేగాలకు సంబంధించినది. దాన్ని గమనించిన నేతలకు తాజా ఉదాహరణ ట్రంప్‌. గొప్ప జనాకర్షణశక్తి ఉండి, సొంత పార్టీకి చెందిన నియమాలను సైతం కాదని, తన సొంత నియమాలతో ఆధిపత్య తత్వం గల వ్యక్తి అత్యున్నత స్థానంలో ఉంటే ఎదురే లేని శక్తి అవుతారు. పాత రాజకీయాలతో, నేతలతో విసుగెత్తి, తిరుగుబాటు చేస్తున్న ఓటరుకు కావాల్సిన మార్పు సరిగ్గా అలా తిరుగుబాటు చేసే, అధికార వ్యవస్థకు బయటి నేతమాత్రమే.

డొనాల్డ్‌ ట్రంప్‌ విజయానికి సంబంధించి వ్యాఖ్యాతలంతా  ఒక్క అంశంపై ఏకీభవిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వామపక్షాలనూ, వాటితోపాటే అందరికీ ఆమోదనీయమైనవిగా విశ్వసించిన ఎన్నో ఉదారవాద భావాలనూ తుడి చిపెట్టేసి రాజకీయ మితవాదం తిరిగి అధికారంలోకి వస్తున్న ధోరణి కనిపిస్తోంది. దానికి అనుగుణమైన పరిణామమే ఇది కూడా అని అంతా అంగీకరిస్తున్నారు. అమెరికాలో అయితే స్వేచ్ఛాయుత మార్కెట్లు, వాణిజ్యం, విదేశీయుల వలసలను అనుమతించడమూ, యూరప్‌లోనైతే జాతీయవాద క్షీణత వంటివి అలాంటి ఉదారవాద భావాలుగా ఉండేవి. ఇక మన భారతదేశంలో నైతే మతం పూర్తిగా వ్యక్తిగత విషయమనీ, ఒకసారి అధికారంలోకి వచ్చాక ప్రతి నేతా ప్రతి మతాన్ని తనదిగా చేసుకునే మాట్లాడేవారు, బహిరంగ చర్చలో అదే రాజకీయంగా సరైనదిగా నిర్వచించేవారు. ప్రపంచవ్యాప్తంగా ఓటర్లంతా ఇప్పుడు కోరుకుంటున్నది సరిగ్గా వీటిలో మార్పునే.

ఉదారవాదానికి ఎదురు గాలేనా?
అయితే ఈ మార్పు సరళరేఖ మాదిరిగా సంభవిస్తున్నదేమీ కాదు. భారత్, బ్రిటన్, అమెరికా, అర్జెంటినా, బ్రెజిల్‌లలో వచ్చిన మార్పు ఈ మితవాద వెల్లువకు అనుగుణమైనదే. ఈ ధోరణి త్వరలోనే ఇటలీ, ఫ్రాన్స్‌లనూ మింగే యవచ్చు. చావెజ్‌ వారసుని పాలనలోని వెనిజులాలో ద్రవ్యోల్బణం త్వర లోనే నాలుగంకెల స్థాయికి చేరవచ్చు. దీనికి వ్యతిరేకంగా సాగుతున్న తిరుగు బాటుతో అక్కడా బహుశా ఇదే మార్పు జరగవచ్చు. దక్షిణ, లాటిన్‌ అమెరికా దేశాల్లో చాలా వరకు ఇప్పటికే వామపక్షం నుంచి మితవాదానికి మరలాయి. కొలంబియాలోని మితవాద ప్రభుత్వం తగినంత మితవాద వైఖరిని ప్రదర్శించడం లేదని భావించిన ఓటర్లు... అది ఎఫ్‌ఏఆర్‌సీ (వామ పక్ష) గెరిల్లాలతో కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని ప్రజాభిప్రాయ సేకరణలో తిరస్కరిం చారు. ఇక జపాన్‌లో ప్రధాని షింజో అబే, ఆసియా పశ్చిమ అంచునున్న టర్కీలో అధ్యక్షుడు ఎర్డోగాన్‌ల జనాదరణ పెరుగుతూనే ఉంది.

మితవాద వెల్లువ పాత వామపక్షాలనే కాదు, నిజానికి మధ్యేవాద మితవాదులను సైతం తుడిచిపెట్టేస్తోంది. అయితే, అత్యంత వామపక్ష ఉదారవాద ప్రధాని జస్టిన్‌ ట్రూడో  కెనడాలో, వామపక్షవాదిగా భావించే అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె ఫిలిప్పీన్స్‌లో బలపడుతుండటాన్ని ఎలా వివరించగలం? అలాగే దక్షిణ  కొరియాలోని మితవాద పాలనకు వ్యతిరేకంగా అసంతృప్తి, ధిక్కా రమూ పెరుగుతుండటాన్నీ, ప్రశ్నింపరానిదిగా భావించే యూరప్‌ వ్యాప్తమైన ఈయూ ధోరణిని ధిక్కరిస్తున్న సోషలిస్టు ప్రధాని అలెక్సి సిప్రా స్‌కు గ్రీస్‌లో జనాదరణ పెరుగుతుండటాన్నీ ఎలా అర్థం చేసుకోగలం?

ప్రపంచం తీరును పరిశీలించాక, ఇక ఇప్పుడు 2014 తర్వాత ఈ ధోరణి భారత్‌లో ఎలా పనిచేసిందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. 2014 సార్వ త్రిక ఎన్నికల తదుపరి వెంటనే జరిగిన ఎన్నికల్లో బీజేపీ మహారాష్ట్ర, హరి యాణ, జార్ఖండ్‌లలో గెలుపొందడం ఆ ధోరణిని రూఢి చేసింది. కానీ ఢిల్లీ, బిహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలలో ఏం జరిగింది? బీజేపీ (లేదా భారత మితవాదం) ఢిల్లీ, బిహార్‌లలో గెలవగలమని అనుకుంది కానీ తుడిచిపెట్టుకుపోయింది. ఇక మిగతా రెండు రాష్ట్రాల్లో అది ఎలాంటి ప్రభా వాన్ని చూపలేకపోయింది, కనీసం పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన ఓట్లను సైతం తిరిగి తెచ్చుకోలేకపోయింది. బెంగాల్‌లో చాలా సందర్భాల్లో సీపీఎం కంటే వామçపక్ష వైఖరిని తీసుకునే మమత నేతృత్వం లోని టీఎమ్‌సీ విజయం సాధించింది. ఇక కేరళలో బీజేపీ అసలు లెక్కలోకే రాలేదు. మధ్యేవాద వామ పక్షంగా భావించే కాంగ్రెస్‌ (యూడీఎఫ్‌) కూడా గెలవలేదు, నిజమైన కమ్యూ నిస్టులు గెలిచారు. ఇవన్నీ చూశాక మనం ఎక్కడ తేలుతాం?

నిజం చెప్పాలంటే ఇవన్నీ చూడటం మనల్ని కలగా పులగం అయ్యేలా చేసేస్తుంది, గందరగోళపరుస్తుంది. ఇంతకూ ఓటరు తనకు ఏమి కావాలని చెబుతున్నట్టు? మార్పు. అయితే అది పాత కాలపు, పాత అర్థంలో అధి కారంలో ఉన్న వారిని గద్దె దించడమా? లేదా? అనే క్లిష్టమైన గుంజాటనగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం కాదు. అదే అయితే, ప్రత్యామ్నాయంగా వామపక్షం బలపడటం కనబడని బ్రిటన్, కొలంబియాలలో మితవాద ప్రభుత్వాలు ప్రజాభిప్రాయ సేకరణలలో ఎందుకు ఓడిపోయినట్టు? ఇది ఎదురేలేని మితవాద పురోగతే అయితే దీని ఒరవడిని అరవింద్‌ కేజ్రీవాల్‌ పార్టీ ఎలా అడ్డుకోగలుగుతుంది? పంజాబ్‌లో కూడా అదే పని చేస్తానని ఆ పార్టీ ఎలా భయపెట్టగలుగుతుంది? గోవా, గుజరాత్‌లకు సైతం ఆ భయం ఎందుకు వ్యాపిస్తుంది? ఇవన్నీ ఓటర్లు చీలిపోయి,విధేయమైన ఓటు బ్యాంకు లుగా గట్టిపడ్డ సువ్యవస్థాపితమైన పాత పార్టీల చరిత్ర ఉన్న రాష్ట్రాలే. అదే విధంగా ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీని హైజాక్‌ చేయడంలో సఫలమై... తన పార్టీ యంత్రాంగమే గెలిచే ఆశేలేదనీ,  డెమోక్రాట్లు అధికారంలోకి రావడం ఖాయ మనీ భావిస్తుండగా ఎలా గెలుపొందగలిగారు?

ప్రభుత్వం మారితే చాలదు
అందువలన సుపరిచితమైన భావజాల వ్యవస్థలను దాటి సమాధానాలను వెదకాలని మనం ఉబలాటపడవచ్చు. అన్నిట్లోకీ మొదటగా ఓటర్లు మార్పును కోరుకునేది కేవలం ప్రభుత్వం మారడం కోసం కాదు, సువ్యవ స్థాపితమైన భావాలలో, ఆదర్శాలలో, ఆలోచనా ప్రక్రియలలో మార్పును. అది మితవాదం వైపునకా, వామపక్షం వైపునకా? లేదా అది దిశగా మరిం తగా మొగ్గడమా? అనే దానితో వారికి నిమిత్తం లేదు. బహుశా మూడు కారణాల వల్ల ఓటర్లు మొత్తంగా ప్రణాళికలోనే మార్పును కోరుకుంటు న్నారు. ఒకటి, ఓటరు కొన్ని అపాయాలను ఎదుర్కునేటంత, ఏదైనా సాహ సోపేతమైనదాన్ని చేసేటంత ఆత్మవిశ్వాసం తనకు ఉన్నట్టు భావించడం. రెండు, పావు శతాబ్ద కాలపు వృద్ధి, గ్లోబలైజేషన్, హైపర్‌ కనెక్టివిటీ (అత్యు న్నత స్థాయి సమాచార సంబంధాలు) సర్వత్రా ఓటరు ఆకాంక్షల స్థాయిలను పెంచాయి. చిన్న పట్టణాలు లేదా గ్రామాల వారు తాము అసూయతో చూసే వేగంగా వృద్ధి చెందుతున్న నగరాలకు వలస పోవాలని మాత్రమే ఆకాంక్షిం చడం లేదు. తామున్న చోటికే ఆ వేగవంతమైన వృద్ధి రావాలని కోరుకుంటు న్నారు. చివరిగా, నా దృష్టిలో అత్యంత ముఖ్యమైనది...వారు పాత రాజకీ యాలతో విసుగెత్తి పోయారు.  కొత్త దానికి, కొత్త భావాలకు, కొత్త నేతలకు అవకాశం ఇచ్చి చూద్దామని అనుకుంటున్నారు. అయినాగానీ కొన్ని పాత, సమసిపోతున్న భావోద్వేగాలను పునరుద్ధరించాలని కూడా భావిస్తున్నారు.
వీటన్నిటిలోకీ అత్యంత ప్రబలమైనది జాతీయవాదం. పావు శతాబ్ద కాలపు గ్లోబలైజేషన్‌ ప్రభావానికి అత్యంత సుస్పష్టమైన ఉదాహరణను చూద్దాం. భావజాల విభజన రేఖకు రెండువైపులా ఉన్న ఉదార విభాగాలూ కీర్తించిన గ్లోబలైజేషన్‌ వల్ల జాతీయవాదం వెలవెల పోతుండటంతో యూరో పియన్‌ ఫుట్‌బాల్‌ క్రీడలో క్లబ్‌ జట్ల పట్ల విధేయత జాతీయ జట్ల పట్ల విధేయ తను అధిగమించిపోయింది.

అయితే మతంలాగే జాతీయవాదం కూడా మాననజాతికి చెందిన అత్యంత పాత భావోద్వేగాలకు చెందినది. పాత జ్ఞాపకాల పట్ల మక్కువ దానికి తిరిగి సత్తువను సమకూరుస్తుంది. స్మార్ట్‌ (తెలివైన)lనేతలు దాన్ని గమనించారు. అలాంటి వారికి తాజా ఉదాహరణ ట్రంప్‌. అత్యంత జనాకర్షణ శక్తి గలిగి, సువ్యవస్థాపితమైన నియమాలను, అవి తన సొంత పార్టీకి చెందినవే అయినాగానీ వాటిని ధిక్కరించి, తన సొంత నియమాలను అనుసరించే, ఆధిపత్యతత్వాన్ని Sప్రదర్శించే తత్వంగల వ్యక్తి అత్యున్నత స్థానంలో ఉంటే ఎదురే లేని శక్తి అవుతారు. పాత రాజకీ యాలతో, నేతలతో విసుగెత్తిపోయి, తిరుగుబాటు చేస్తున్న ఓటరుకు కావా ల్సిన మార్పు సరిగ్గా అలా తిరుగుబాటు చేసే నేత, అధికార వ్యవస్థకు బయటి వ్యక్తిమాత్రమే.

భారత్‌లోనూ ఇదే గాలి
2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా నేను ఇది, సరికొత్త, యవ్వనోత్సాహం నిండిన, మీకు నేను రుణపడి ఉన్నదేమీ లేదని భావించే భావజాలానంతర కాలపు ఓటరు తీర్పు అని రాశాను. దీనికి ప్రతి వాదనా ఉంది. మన ఓటర్లు మొట్టమొదటిసారిగా మితవాదపక్షం తనంతట తానుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా తీర్పునిచ్చాక కూడా ఇంకా మీరిలా ఎలా అనగలరు? అంటే దానికి చెప్పగల సమాధానం... బహుశా భారత్‌ ఓటు వేసినది భావజాలపరమైన మార్పునకు కాదు. కాంగ్రెస్‌ పార్టీ నిరాశా పూరి తంగా పెంచిపోషిస్తున్న పేదరికవాదానికి, పాలక కుటుంబం తాము ప్రత్య క్షంగా పాలన సాగించకుండా, తాము నియమించిన వ్యక్తిని పనిచేయ నీయ కుండా అధికారాన్ని నెరపుతూ ప్రదర్శిస్తున్న కపటత్వానికి వ్యతిరేకంగా ఓటరు చేసిన తిరుగుబాటు ఇది. గోసంరక్షకులకు, పాకిస్తాన్‌తో వ్యూహాత్మక సంయమనానికి స్వస్తి పలకడానికి లేదా మూడు తలాక్‌లకు వ్యతిరేకంగా ఆ సమయంలో ఎవరూ ఓటు చేయలేదు. ఇవేవీ ఆనాటి బీజేపీ అజెండాలో లేవు. నాటి తీర్పు ఓటరు తిరుగుబాటనే నా వాదనకు నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆధారాలు కనబడుతున్నాయి.

భారత్‌ వంటి దేశాలలోని యువత గతం గురించిన ఫిర్యాదులలో వేళ్లూనుకున్న రాజకీయాలను చెత్తబుట్టలో పారేసి, ఆకాంక్షాభరితమైన భవిత దిశగా సాగిపోతున్నారు. ఇది, ప్రజలు పాత విధేయతలను బద్ధలుకొట్టి బయ పడుతున్న పరిణామాన్ని వివరిస్తుంది. వృద్ధాప్యంలో పడుతున్న జనాభాగల అభివృద్ధిచెందిన దేశాల సమస్య ఇందుకు విరుద్ధమైనది: గ్లోబలైజేషన్, వృద్ధి వల్ల కోల్పోయినదిగా కనిపిస్తున్న దానికి, తమకు దక్కాల్సిన ఫలాలలో అతి పెద్ద భాగం ‘‘అయోగ్యులు, తప్పుడు’’వారైన ప్రజలకు, ప్రత్యేకించి వలస వచ్చిన విదేశీయులకు పోతుండటానికి సంబంధించినది.

రెండు సందర్భాలలోనూ ప్రతిస్పందన ఒకటే... విప్లవాత్మక మార్పు, పాత అధికార వ్యవస్థ నుంచి దుర్గం«ధాన్ని వెలువరించే ప్రతిదాని పట్లా ధిక్కారం. ఇందువల్లనే మోదీ ఇంతకు ముందెన్నడూ ఎరుగని రీతిలో బీజేపీని శాసిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఓట్లను కేజ్రీవాల్‌ వాక్యూమ్‌ క్లీనర్‌తో తుడిచి పెట్టేస్తున్నారు. అయితే రిపబ్లికన్‌ పార్టీ పాలక వ్యవస్థను డెమోక్రటిక్‌ అభ్యర్థి కంటే కూడా ఎక్కువగా ట్రంప్‌ చిత్తు చేయడాన్ని చూసి బహుశా ఆయన ఓటర్లు మరింత ఎక్కువగా పులకరించిపోయి ఉంటారు.

twitter@shekargupta
 శేఖర్‌ గుప్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement