అన్నీ తెలిసిన అధినాథుడు
అన్నీ తెలిసిన అధినాథుడు
Published Tue, Nov 19 2013 12:24 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM
నిరర్థక యథార్థాలకు ఉండే సమ్మోహనమైన ఆకర్షణశక్తిని వివేచనాపరులు ఎవరైనా ఎలా విస్మరించగలరు? పాశ్చాత్య దేశాల్లో లాంఛనంగా జరిగే విందుల్లో భోజనాల బల్ల వద్ద కుర్చీల ఏర్పాటు ఒక మంచి నియమాన్ని అనుసరించి... ఇద్దరు మగాళ్ల మధ్య ఒక మహిళ ఉండేలా జరుగుతుంది. మగాళ్లు మర్యాదకరంగా ప్రవర్తించడానికి హామీ ఉండాలంటే వాళ్లు ఓ మహిళ సమక్షంలో ఉండటం అవసరమనేదే ఆ నియమం. మత యుద్ధాల కాలంలో దాన్ని కనిపెట్టారు. లాటిన్ కవులలో ఏ ఒక్కరూ రోమ్‌లో పుట్టలేదు. చంకల్లో నిమ్మకాయలను రుద్దుకోవడం హ్యాంగ్ ఓవర్‌కు (తాగిన మత్తు దిగాక ఉండే ఇబ్బందికరమైన స్థితి) పోర్టోరికన్ల చిట్కా వైద్యం. ఇక కాసనోవాకు (18వ శతాబ్దపు ఇటాలియన్ శృంగార పురుషుడు) కూడా నిమ్మకాయలతో అంతే ఉపయోకరమైన అవసరం ఉండేది. అయితే అదేమిటో కుటుంబ వార్తా పత్రికలో రాయలేం. 2005 వింబుల్డన్ పోటీల్లో రష్యన్ టెన్నిస్ క్రీడాకారిణి మారియా షరపోవా కోర్టులో పెద్దగా పెట్టిన కేక 101.2 డెసిబల్స్ శబ్దాన్ని వెలువరించిందని కొలిచారు. మగరాయుళ్ల మోటర్ సైకిల్ చప్పుడు కంటే అది ఎక్కువ.
ప్రయాణంలో కాలాక్షేపంగా ఓ పుస్తకం చదువుతూ క్రమపద్ధతేమీ లేకుండా అక్కడక్కడి నుంచి నేను సేకరించిన ఇలాంటి జ్ఞానం ఎందుకైనా ఉపయోగపడుతుందా? ఈ ప్రశ్నలో కేథలిక్కు విస్తృతిలోని అతి పరిశుద్ధవాదంతో పాటూ రవంత డాబుసరి నిగారింపు కూడా ఉంది. అనవసరమైనది ఏదో తెలియకపోతే, అవసరమైనది ఏదో మనకెలా తెలుస్తుంది?
శాస ్తప్రరిశోధకులంతా, తత్వవేత్తలంతటి ఆసక్తిపరులే. పైన నేను తెలిపిన యథార్థాలు ‘అల్ప’ ఆసక్తికి కొన్ని అద్భుతమైన ఉదాహరణలు. అది కూడా ‘ఉత్తమ’ ఆసక్తి అంతగానూ నిమగ్నమయ్యేట్టు చేసేదే. ఆ మాటకొస్తే దానికి మరింత ఆచణనాత్మక విలువ ఉంటుంది. మీలో నిజంగానే కాసనోవా నిమ్మకాయాలతో ఏమి చేసేవాడనే ఆసక్తి రేకెత్తిందని పందెం కాస్తాను.
నా కొలమానాల దృష్టితో చూస్తే ఆసక్తి ఎన్నడూ ఏ పిల్లినీ చంపి ఎరుగదు. ఒక వేళ పిల్లి చచ్చిందీ అంటే , అది తొందరపడి నిర్ధారణలకు గంతు వేయడం వల్లనే. ఒక పదబంధంగా ‘నిర్ధారణలకు గంతు వేయడం’ అనేది ప్రత్యేకించి మహా ముచ్చటైనది. తెలియని దాన్ని గురించిన విచారణ చేయడమే ఏ సాహస కృత్యానికికైనాగానీ ఆరంభ స్థానం, ఏ సాహసానికీ ఒడిగట్టకపోతే మనం సాధించగలిగేది ఏదీ లేదు. ‘నూతన ప్రపంచాన్ని’ కనుగొన్న ఒక్కొక్క ‘కొలంబస్’కు పదుల కొలదీ సముద్ర గర్భంలో సమాధై పోయారు. అయితే ఏమిటి? వైఫల్యం తర్వాతి తరానికి ప్రోత్సహకం మాత్రమే. అమెరికాను కనుగొన్న పాత క్రిస్టొఫర్ కొలంబస్ ఏమైనా తప్పు చేశాడంటే అది యూరప్ నుంచి మశూచి వంటి ప్రాణహానికరమైన అంటువ్యాధులు నూతన ప్రపంచానికి వ్యాపించే మార్గాన్ని తెరవడమే. అంతకుముందు అక్కడి వారు ఆ వ్యాధులను ఎరుగనే ఎరుగరు. ఎందుకంటే వాళ్లకు ప్రకృతి ప్రసాదించిన సంపదకు మానవ అవసరాలు పరిమితం కావాలనే స్పృహ వారికి ఉండేది.
కొత్తది కనుగొనడం... దురాక్రమణ, దోపిడీలకు ఆజ్యం పోసినప్పుడు శాపం అవుతుంది. అవి మనిషిలోని అంతులేని క్రౌర్యానికి పరిపూర్ణ వ్యక్తీకరణను ఇవ్వగలుగుతాయి. అంగాకరక గ్రహ శోధనకు భారత్‌సహా పలువురు చేపట్టిన అంతరిక్ష యాత్రలు అక్కడ ఏమి కనుగొననున్నాయో ఎవరికీ తెలియదు. అయితే మనం అంగారకుడ్ని మరొక భూమిగా మార్చాలని కోరుకోవడం మాత్రం మహా మూర్ఖత్వం. ఎప్పటికైనా మనం అంగారక వాసులను కనుగొంటే తప్పకుండా వారికి కించపరిచే పేరే పెడతాం. ఆ తర్వాత వారి ఖనిజ సంపదలను దొంగలించడానికి వారిపై మారణహోమం చేపడతాం. అమెరికన్ ప్రైవేటు కంపెనీలు అప్పుడే అంగారకునిపై ఊహాత్మక ప్రాంతాలను మదుపర్లకు అమ్మజూపుతున్నాయి కూడా.
ఆసక్తికి ఉన్న అసలు సిసలు ఆకర్షణ అంతా చిట్కాల్లాగా ఉండే వాస్తవాల్లోనే ఉంది. భారతీయులకన్నా ఎక్కువగా ఆసక్తిని కనబరిచే జాతి మరొకటి లేదు. అందుకే ఉపఖండంలోని రైలు ప్రయాణం లేదా బస్సు ప్రయాణం మౌనంగా ఎప్పుడూ ఉండదు. సంభాషణ జన సామాన్యానికి ప్రేరణగా ఉంటుంది. కొత్త వారితో సంభాషణ ఇక్కడ మంచి నడవడికి గుర్తు. బ్రిటన్ వంటి దేశాల్లో అది ఇతరుల వ్యవహారాల్లో అమర్యాదకరంగా తల దూర్చడం.
భారతదేశం గురించిన నిజాన్ని భారతీయులు మన మీడియా ద్వారా ఎన్నడూ తెలుసుకోలేరు. అయితే మన మీడియా అందుకు విరుద్ధంగా భావిస్తూ ఉండి ఉండవచ్చు. మీడియా ద్వారా అందే వార్త వక్రీకరణకు గురికాలేదనే భరోసా వారికి ఎప్పుడూ ఉండదు. ఏదేమైనా వాస్తవాలను (గణాంక) మించిన నిజం ఏమిటో జనసామాన్యానికి తెలుసు. ఏ రైల్లోనో లేదా బస్సులోనే పక్క సీట్లో కూచున్న వారితో సంభాషణల్లో రాజకీయాల గురించి, అధికారం గురించి వారు ఒకరి నుంచి ఒకరు తెలుసుకుంటారు. అలా తెలుసుకున్న విషయాలను టీ బడ్డీ దగ్గరో లేదా అఫీసులోనో ఒకరి నుంచి మరొకరికి అందించుకుంటారు. మనకు కలిసే గుర్తు తెలియని వ్యక్తికి పక్షపాతంతో కూడిన ప్రయోజనాలు ఏవీ ఉండవు. సాంకేతిక పరిజ్ఞానం మన అరి చేతిలో తళుక్కున మెరవడానికి ముందే మన దేశానికి సోషల్ మీడియా ఉంది. ప్రతి భారతీయుని ఫేసూ ఓ బుక్కే. ప్రతి భారతీయుని వాణి ట్విట్టరే.
కాబట్టి భారతీయులు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసి, అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చే బాపతు కాదు. వాళ్లు ఏ అభిప్రాయాన్నయినా ఒక అభిప్రాయంగా మాత్రమే స్వీకరిస్తారు. సాధికారత సాధనకు దాన్ని ఒక సాధనంగా భావిస్తారు. ఎంతో శక్తివంతులను సైతం వాళ్లు క్షుణ్ణంగా పరిశీలించి జాగ్రత్తగా తగు శ్రద్ధతో నిర్ణయం తీసుకుంటారు. అందుకు వాళ్లు సమయం తీసుకుంటారు. ఎందుకంటే వాళ్లకు బోలెడు సమయం ఉంది. ఒకసారి వాళ్లు ఒక నిర్ణయానికి వచ్చారూ అంటే, అంత తేలిగ్గా మార్చుకోరు లేదా అసలే మార్చుకోరు. తీర్పు చెప్పే రోజు వరకు అంటే పోలింగ్ రోజు వరకు అందుకు సమయం ఉంటుంది.
జనసామాన్యం ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణాన్ని ప్రేమిస్తారు. దానితోపాటే దాన్ని నిలిపి ఉంచే రెండు ఆధారాలను కూడా ప్రేమిస్తారు. ప్రజాస్వామ్య నిర్మాణాన్ని ఒక వైపు నుంచి భావప్రకటనా స్వేచ్ఛ, మరో వైపు నుంచి ఎంచుకునే స్వేచ్ఛ కాస్తుంటాయి. తీర్పు చేప్పే రోజు తమ ప్రాథమిక హక్కని వారికి తెలుసు. దాన్ని వాయిదా వేయడం లేదా అర్ధంతరంగా నిలిపేయడం జరిగేది కాదు. వారికి వారం వారం కాగడాల ప్రదర్శనలు లేదా మైదానాల్లో సభలు అక్కర్లేదు. వారి ఆగ్రహాగ్ని పర్వతం బద్ధలయ్యే ఒక రోజు వస్తుంది, పాత స్థానంలో కొత్త ఆశల మొలకలను నాటుతుంది.
ప్రజాస్వామ్యం కర్మకు సజీవ వ్యక్తీకరణ. భారతీయుడు ఒక రోజుపాటూ సకల లోకాలకు అధినాధుడు అవుతాడు. అంతకంటే అతడికి ఏం కావాలి? ఎన్నికల ఫలితాల కోసం వేచి చూస్తూ రాజకీయ నేతలు నరాలు తెగిపోయేటంత ఉద్విగ్నతకు గురవుతారు. కానీ ఓటరు మాత్రం ఫలితం పట్ల ఎన్నడూ ఆసక్తిని చూపడు. ఆసక్తిని చూపాల్సిన అవసరమూ లేదు. ఎన్నికలకు చాలా ముందుగానే ఫలితం ఏమిటో ఓటరుకు తెలుసు.
బైలైన్
ఎం.జె.అక్బర్
సీనియర్ సంపాదకులు
Advertisement
Advertisement