సీమాంధ్రలో పోలింగ్ ముగిసింది: భన్వర్లాల్ | Voter turn out at 5 pm is 71.9%, polling closed at 6pm, says Banwarlal | Sakshi
Sakshi News home page

సీమాంధ్రలో పోలింగ్ ముగిసింది: భన్వర్లాల్

Published Wed, May 7 2014 6:19 PM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

సీమాంధ్రలో పోలింగ్ ముగిసింది: భన్వర్లాల్ - Sakshi

సీమాంధ్రలో పోలింగ్ ముగిసింది: భన్వర్లాల్

ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసిందని  రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ వెల్లడించారు. పోలింగ్ గడువు సాయంత్రం 6.00 గంటల్లోగా క్యూ లైన్లో ఉన్నవారందరికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు.బుధవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బుధవారం సాయంత్రం 5 గంటల వరకు 71.09 శాతం పోలింగ్ నమోదు అయిందని తెలిపారు.

 

కొద్దిపాటి చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగిందన్నారు. మే 16వ తేదీన ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement