banwarlal
-
నెలాఖరుకు సవరణ పూర్తిచేయండి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నెలాఖరుకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వరంగల్, అదిలాబాద్ జిల్లాల ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలతో ఓటర్ల జాబితా సవరణ తీరును సమీక్షించారు. కేంద్ర ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్ ప్రకారం నగరపాలక, పట్టణ శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి ఓటర్ల ముసాయిదా జాబితాను ఈ నెల 25న ప్రచురించాల్సి ఉన్నందున.. ఈఆర్ఓలు ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయాల్సిన అవసరముందని అన్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఎన్నికల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ తీరును అడిగి తెలుసుకోవాలన్నారు. ఇంటింటికీ వెళ్లే కార్యక్రమం మందకొడిగా నడుస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్ల నమోదులో అవకతవకలు జరగకుండా చూడాలని, ప్రజాప్రతినిధులు అడ్డుకుంటే ఈసీ దృష్టికి తీసుకురావాలన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వారిని ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హత వేటు వేసే అధికారం ఈసీకి ఉందని స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో ఎన్నికల సంఘం అదనపు సీఈఓ చిరంజీవి, పరిశీలకుడు విష్ణు, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జేసీ సుందర్ అబ్నార్, కంటోన్మెంట్ సీఈఓ చంద్రశేఖర్, వివిధ జిల్లాల అధికారులు పాల్గొన్నారు. -
అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట నిఘా
-
పత్రికల వార్తల ఆధారంగా చర్యలు తీసుకోలేం
-
పత్రికల వార్తల ఆధారంగా చర్యలు తీసుకోలేం
♦ నంద్యాలలో వైఎస్ జగన్ వ్యాఖ్యలపై భన్వర్‌లాల్ ♦ మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడితే చర్యలు సాక్షి, హైదరాబాద్/కర్నూలు (అగ్రికల్చర్): నంద్యాలలో ఇటీవల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుమోటోగా పరిగణించి విచారణ జరపాలని కర్నూలు జిల్లా కలెక్టర్‌కు ఆదేశించామని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ పేర్కొన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ ఎన్నికల నిఘా వేదిక అనే స్వచ్ఛంద సంస్థ రూపొందించిన పోస్టర్లను శనివారం భన్వర్‌లాల్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్ మాట్లాడుతూ చంద్రబాబును తుపాకీతో కాల్చిపారెయ్యాలని వ్యాఖ్యానించారన్నట్లుగా పత్రికల్లో వచ్చిన వార్తలను ఆధారంగా పరిగణించి చర్యలు తీసుకోలేమన్నారు. జగన్ వాస్తవంగా ఏం మాట్లాడారన్న దానిని పరిశీలించి నివేదిక సమర్పించాలని అధికారులను కోరామన్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి మంత్రులు నంద్యాలలో పర్యటిస్తున్నారనే అంశాన్ని సైతం సుమోటోగా పరిగణించామని, మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. హిమాన్షు మోటర్స్ వ్యవహారంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై వామపక్షాలు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తున్నామని భన్వర్‌లాల్ తెలిపారు. న్యాయ సలహా తీసుకున్న తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తామని తెలిపారు. వైఎస్ జగన్‌కు నోటీసు నంద్యాలలో జగన్ ప్రసంగంపై టీడీపీ నేతల ఫిర్యాదుపై నివేదిక ఇవ్వాలని భన్వర్‌లాల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యనారాయణ, నంద్యాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేశ్‌ను ఆదేశించారు. ఇందులో భాగంగా శనివారం జిల్లా ఎన్నికల అధికారి జగన్‌కు నోటీసు జారీ చేశారు. నోటీసును రిజిస్టర్ పోస్టు ద్వారా జగన్‌కు, కాపీని నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి పంపించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. -
నంద్యాలలో కొత్త ఓటర్ల నమోదుపై పరిశీలిస్తాం
-
ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
-
సజావుగా ఎమ్మెల్సీ ఎన్నిక
వీడియోకాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కాకినాడ సిటీ : కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జిల్లాలో స్థానిక సంస్థల శాసనమండలి స్థానానికి జరిగే ఎన్నికను సజావుగా నిర్వహించడానికి చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సూచించారు. ఇరురాష్ట్రాలలో జరుగనున్న శాసనమండలి అభ్యర్థుల ఎన్నికలపై గురువారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థుల అఫిడవిట్లను ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితంగా అమలు చేయాలని దీనిపై నివేదికలు ఎప్పటికప్పుడు పంపించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికకు సంబంధించి జిల్లాలో ఏడు పోలింగ్ కేంద్రాలలో రెండు రంపచోడవరం, ఎటపాక ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయని ఆ ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును పరిశీలించేందుకు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని నియమించామని, మండల స్థాయిలో అధికారులను నియమించామన్నారు. ఎన్నికల నిర్వహణకు ఏడు జోన్లకు అధికారులను నియమించడంతో పాటు ఓట్ల లెక్కింపునకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా ఎస్పీ ఎస్.రవిప్రకాష్ బందోబస్తు ఏర్పాట్లను వివరిస్తూ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న రంపచోడవరం, ఎటపాక డివిజన్ కేంద్రాలలో పోలింగ్ నిర్వహణ కోసం రెండు కంపెనీల ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో చెన్నకేశవరావు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రత్యేకాధికారి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం.జ్యోతి పాల్గొన్నారు. -
ఓటర్ల జాబితాను సరిచేయాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ఓటర్ల జాబితాల్లో చోటు చేసుకున్న తప్పులను ఈ నెల 22 లోపు సరిచేయాలని చీఫ్ ఎన్నికల అధికారి బన్వర్‌లాల్ సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా అధికారులతో సమీక్షించారు. ఓటర్ల జాబితాలోని తప్పులు, డబుల్ ఎంట్రీలు, కచ్చితమైన ఫోటోలు, ఓటర్ వివరాలు సరిచేయడంతో పాటు డూప్లికేట్ ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని అన్నారు. మున్సిపాలిటీలలోని పోలింగ్ కేంద్రాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి బౌండరీలను పేపర్‌పై స్కెచ్ వేసుకొని గూగుల్ మ్యాప్‌కు అప్లోడ్ చేయాలని సూచించారు.కచ్చితమైన ఓటర్ వివరాలతో సెప్టెంబర్ 31 వరకు సాంకేతిక ప్రక్రియను పూర్తి చేసి డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలను ప్రకటించాలని అన్నారు. వీసీలో డిఆర్వో భాస్కర్, ఎన్ఐసీ డీఐఓ మూర్తి, ఎన్నికల విభాగం సీనియర్ సహాయకులు హనీఫ్, కృష్ణకుమార్‌లు హాజరయ్యారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది
-
'ఓటర్లను తొలగించకుండా చర్యలు తీసుకోవాలి'
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్ లాల్‌ను కలిశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో లక్షలాది ఓటర్లను అక్రమ ఓటర్ల పేరుతో తొలగిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకొని ఓటర్ల తొలగింపు జరగకుండా చూడాలని కోరారు. ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని కలిసిన వారిలో టీ కాంగ్రెస్ నేతలు కమలాకర్, నిరంజన్లు ఉన్నారు. -
పథకం ప్రకారం ఓట్లు తొలగించారు
హైదరాబాద్ : నోటిసులు ఇవ్వకుండా ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో బతికున్న వాళ్ల పేర్లు కూడా తొలగించారని ఆయన తెలిపారు. చట్టవిరుద్ధంగా ఓట్లు తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన భన్వర్‌లాల్‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్‌ను తెలంగాణలోని ప్రతిపక్ష నేతలు కలిశారు. అనంతరం ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, ఎన్ ఇంద్రసేనారెడ్డి విలేకర్లతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పథకం ప్రకారం ఓట్లు తొలగించారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్ ఇంద్రసేనారెడ్డి చెప్పారు. ఈ అంశంపై అధికారులు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలతో కలిపి నిజనిర్ధారణ చేయించాలని భన్వర్‌లాల్‌కు వారు వినతిపత్రం అందజేశారు. -
'ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయవద్దు'
హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ను శుక్రవారం కలిశారు. తెలంగాణలో వరంగల్, ఖమ్మం, గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయోద్దంటూ భన్వర్‌లాల్‌ను ఆయన కోరారు. ఈ మూడు కార్పొరేషన్లలో మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున ఈ నోటిఫికేషన్ విడుదల ఇప్పుడే వద్దంటూ రాంచంద్రరావు ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేశారు. -
సగంతో సరి!
ఓటర్ల ఆధార్ సీడింగ్ అంతంతే మొత్తం ఓటర్లు 30,91,455 పూర్తయిన అనుసంధానం 19,29,319 ఐదు నియోజకవర్గాల్లో పురోగతి అధ్వాన్నం కర్నూలులో 29.89 శాతం మించని ప్రక్రియ కుప్పలుతెప్పలుగా బోగస్ ఓటర్లు కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 లక్షల నుంచి 4 లక్షల మంది బోగస్ ఓటర్లు ఉన్నట్లు అంచనా. వీరిని ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు చేపట్టిన ఆధార్ అనుసంధాన ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. జిల్లాలో 30,91,455 మంది ఓటర్లు ఉండగా.. దాదాపు 70 శాతం ఓటర్ల నుంచి వివిధ రూపాల్లో ఆధార్ నెంబర్లు సేకరించారు. ఇప్పటి వరకు 19,29,319 మంది ఓటర్లను మాత్రమే బీఎల్ఓలు ఆధార్‌తో అనుసంధానించారు. ఈ లెక్కన ఆధార్ సీడింగ్ 62.41 శాతం మాత్రమే పూర్తయింది. 11,62,136 మంది ఓటర్లను ఆధార్ నంబర్లతో అనుసంధానం చేయాల్సి ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 25 నాటికి అనుసంధానం ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించింది. జిల్లాలో బోగస్ ఓటర్లు లెక్కకు మించి ఉండటం వల్లే ఆధార్ అనుసంధానం అంతంతమాత్రంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటర్లను ఆధార్‌తో అనుసంధానం బీఎల్ఓలు చేస్తుండగా.. వీటిని ఈఆర్ఓలు పరిశీలించి ఆమోదం తెలపాల్సి ఉంది. బీఎల్ఓలు 19,29,319 మంది ఓటర్లను ఆధార్‌తో అనుసంధానం చేస్తే.. ఈఆర్ఓలు కేవలం 2,67,940 పరిశీలించి ఆమోదం తెలిపారు. తక్కినవి పెండింగ్‌లో పెట్టారు. కర్నూలు, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, నియోజకవర్గాల్లో ఆధార్ సీడింగ్ అంతంత మాత్రమే. ఆదోని నియోజకవర్గంలో 2,15,311 మంది ఓటర్లు ఉండగా.. ఆధార్ సీడింగ్ 1,04,342 మాత్రమే(48.46 శాతం) చేశారు. కోడుమూరు నియోజకవర్గంలో 53.83 శాతం, ఎమ్మిగనూరులో 57.21 శాతం, ఆలూరులో 58.78 శాతం మాత్రమే ప్రగతి ఉంది. మిగిలిన నియోజకవర్గాల్లో 63 శాతం పైగా ఆధార్ సీడింగ్ పూర్తయింది. కర్నూలు కార్పొరేషన్లో 29.89 శాతమే కర్నూలు నగరానికి చెందిన 19,700 ఓటర్లకు ఇంటి నంబర్లు లేవు. ఏరియా(లొకేషన్) లేదు. ఓటర్ల జాబితాలో ఓటరు పేరు, తండ్రి పేరు, సీరియల్ నెంబరు తప్ప వారు ఏ ప్రాంతానికి చెందిన వారు, ఇంటి అడ్రస్ వివరాలు లేవు. కానీ ప్రతి ఎన్నికల్లో ఈ ఓట్లన్నీ పోల్ అవుతున్నాయి. ఇవన్నీ బోగస్ ఓటర్లే కావడం గమనార్హం. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు జిల్లా కలెక్టర్ సిహెచ్.విజయమోహన్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. కర్నూలు నగరపాలక సంస్థలో బోగస్ ఓటర్లు ఎక్కువగా ఉండటం వల్లే ఆధార్ అనుసంధానం 29.89 శాతానికే పరిమితమయింది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో 2,46,135 మంది ఓటర్లు ఉండగా.. 73,568 మంది ఓటర్లను మాత్రమే ఆధార్‌తో అనుసంధానించారు. నేడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ సమీక్ష కర్నూలు నగరపాలక సంస్థలోని ఓటర్లపై రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ఓటర్లను ఆధార్‌తో అనుసంధానం చేసే కార్యక్రమంపై శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ సమీక్ష నిర్వహించనున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో, ఈఆర్ఓలు, తహశీల్దార్లతోను సమీక్షిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు సమీక్షలు నిర్వహించనున్నారు. -
ముంపు మండలాల రాజకీయ ప్రాతినిధ్యంపై సీఈసీకి లేఖ: భన్వర్‌లాల్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన ఖమ్మం జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలోని 7 మండలాలకు రాజకీయంగా ఎవరు ప్రాతినిధ్యం వహించాలనే అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) దృష్టికి తీసుకెళ్లి, స్పష్టత తీసుకుంటామని ఉమ్మడిరాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు.ఈ విషయంపై ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని, తదుపరి సమాచారాన్ని తెలియజేస్తామని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్యకు ఆయన చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు (2019) జరిగే వరకు ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, అశ్వారావుపేట, పినపాక ఎస్టీ నియోజకవర్గాల్లోని 7 మండలాలకు తామే ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కల్పించాలని భన్వర్‌లాల్‌కు ముగ్గురు ఎమ్మెల్యేలు చేసిన విజ్ఞప్తికి ఆయనపై విధంగా స్పందించారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో భన్వర్‌లాల్‌కు వారు వినతిపత్రాన్ని సమర్పించారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ మండలాలు ఏపీ పాలనలో ఉండడంతో ఆ ప్రాంత సమస్యలను అధికారుల వద్ద ప్రస్తావించే పరిస్థితి, ప్రభుత్వానికి నివేదించే అవకాశం లేకుండా పోయిందని, ఈ పరిస్థితుల్లో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
భన్వర్‌లాల్‌పై ఫిర్యాదు చేస్తాం
టీడీపీ ఎంపీ సి.ఎం. రమేశ్ వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ సార్వత్రిక ఎన్నికలను నిజారుుతీగా నిర్వహించలేదని టీడీపీ పార్లమెంటు సభ్యుడు సీఎం రమేశ్ ధ్వజమెత్తారు. ఆయనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీలోని తన నివాసంలో రమేశ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రాత్రింబవళ్లు కష్టపడాల్సింది పోయి భన్వర్‌లాల్ మధ్యాహ్నం ఒంటిగంటకు కార్యాలయానికి వచ్చేవారని ఆరోపించారు. మీడియా సమావేశాలు నిర్వహించడం మినహా ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా ఇద్దరు ఐపీఎస్ అధికారులపై కొందరు ఫ్యాక్షన్ నాయకులు దాడులు చేసినా పోలీసులు చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. దీనిపై దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. సీమాంధ్రలో టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
కౌంటింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తి అయినందున కౌటింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారించాలని జిల్లా అధికారులను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కౌంటింగ్ ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించడానికి కృషి చేసిన కలెక్టర్, జాయింట్‌కలెక్టర్, రిటర్నింగ్ అధికారులను అభినందించారు. అదే తరహాలో కౌంటింగ్‌ను పకడ్బందీగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని వివరించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే సమయానికి వచ్చే పోస్టల్ బ్యాలెట్లను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. ఆలోపు వచ్చే పోస్టల్ బ్యాలెట్లను పకడ్బందీగా భద్ర పరచాలని తెలిపారు. కౌంటింగ్ రోజు ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాలని తెలిపారు. పార్లమెంట్ ఓట్ల లెక్కింపు కేంద్రంలోనే ప్రత్యేక టేబుళ్లను తగినన్ని ఏర్పాటు చేసుకొని పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఫొటోలతో కూడిన డాక్యుమెంటేషన్ తయారు చేసి పంపాలని తెలిపారు. పత్రికల్లో వచ్చిన చెల్లింపు వార్తలకు సంబంధించి అభ్యర్థులకు నోటీసులు ఇచ్చి ఫైనలైజ్ చేయాలని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కర్నూలు నుంచి కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. కౌంటింగ్ కేంద్రాలను ఎస్పీతో కలిసి సందర్శిస్తూ ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచి తగిన బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంగా జిల్లాకు మరో ఐదుగురు పరిశీలకులు అవసరమని పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున 28 మంది మైక్రో పరిశీలకులను నియమించుకుంటున్నట్లు తెలిపారు. కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ కన్నబాబు, ఎస్పీ రఘురామిరెడ్డి, ఏజేసీ రామస్వామి, రిటర్నింగ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. -
సీఈఓపై టీడీపీ ఎంపీ దురుసు ప్రవర్తన
భన్వర్‌లాల్‌తో ఫోన్లోనే టీడీపీ ఎంపీ వాదన సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర జిల్లాల పోలింగ్ సరళిని జీర్ణించుకోలేని టీడీపీ ఎంపీ సి.ఎం.రమేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌తో దురుసుగా వ్యవహరించారు. భన్వర్‌లాల్ బుధవారం ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో రమేష్ఆయనకు ఫోన్ చేసి ఫోన్లోనే వాదనకు దిగారు. కడప జిల్లాలో పక్క గ్రామాలకు చెందిన వారిని ఎన్నికల ఏజెం ట్లుగా నియమించటంపై హైకోర్టు స్టే ఇవ్వటాన్ని రమేశ్తప్పుపడుతూ.. ‘మీరేం చేస్తున్నార’ంటూ భన్వర్‌లాల్‌ను ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు తన పరిధిలోకి రాదని చెప్పిన భన్వర్‌లాల్.. ‘మీరు ఇలా మాట్లాడకూడద’ని పలుమార్లు రమేశ్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆయన వినిపించుకోకుండా వాదన కొనసాగించారు. దీనికి భన్వర్‌లాల్ స్పందిస్తూ.. ‘మీరు ప్రజాప్రతినిధిగా ఉంటూ ఈ విధంగా మాట్లాడం సరికాదు.. వ్యవహార శైలిని సరిచేసుకోవాలి’ అని ఆయనకు సూచించారు. అనంతరం భన్వర్‌లాల్ మీడియాతో మాట్లాడుతూ సి.ఎం.రమేశ్తీరుపట్ల ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు సభ్యునిగా ఉండి రమేష్ ఈ విధంగా ప్రవర్తించారని, ఆ పార్టీ నాయకుల తీరు ఈ విధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కడప జిల్లాలో పక్క గ్రామాల్లోని వ్యక్తిని పోలింగ్ ఏజెంటుగా నియమించుకోవడానికి ఈసీ అనుమతించింది. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా ఈసీ ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. అదే అంశంపై రమేశ్ ఫోన్ చేసి భన్వర్‌లాల్‌తో వాదనకు దిగారు. కోర్టు తీర్పుపై తానేం చేయగలనని భన్వర్‌లాల్ నచ్చచెప్పటానికి ప్రయత్నించినా ఆయన దురుసుగా మాట్లాడారు. -
సీమాంధ్రలో 77 శాతం పోలింగ్ నమోదు: ఈసీ
సీమాంధ్రలో సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 77 శాతం పోలింగ్ నమోదు అయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ వెల్లడించారు. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. సాయంత్రం 6 గం. లోపు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద లైన్లో వచ్చిన వారికి ఓటేసే అవకాశం కల్పించటంతో ఆ శాతం 80కు పెరిగే అవకాశం ఉందన్నారు. సీమాంధ్రలోని మొత్తం 13 జిల్లాలో రెండు, మూడు చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగిందని తెలిపారు. బుధవారం భన్వర్‌లాల్ హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా రామిరెడ్డిపల్లిలో ఫైరింగ్ జరిగిందని ఆ ఘటనపై విచారణ జరగుతుందన్నారు. అలాగే ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా రవాణా చేస్తున్న రూ. 152 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే విజయవాడ మెగల్రాజపురంలోని సిద్ధార్థా అకాడమీలో ఇప్పటి వరకు చేపట్టిన తనిఖీలలో రూ. 3 కోట్లకు పైగా నగదు సీజ్ చేసినట్లు చెప్పారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. అయితే సీమాంధ్రలో బుధవారం జరిగిన ఎన్నికలపై న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) స్పందించింది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో కలిపి 73.46 % పోలింగ్ జరిగిందని తెలిపింది. అక్రమ నగదు, మద్యం తరలింపులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిదే అగ్రస్థానం అని వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు 502 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తి అయిందని వివరించింది. దేశవ్యాప్తంగా 66.27 శాతం పోలింగ్ నమోదు అయినట్లు సీఈసీ వివరించింది. -
సీమాంధ్రలో పోలింగ్ ముగిసింది: భన్వర్‌లాల్
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ వెల్లడించారు. పోలింగ్ గడువు సాయంత్రం 6.00 గంటల్లోగా క్యూ లైన్లో ఉన్నవారందరికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు.బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బుధవారం సాయంత్రం 5 గంటల వరకు 71.09 శాతం పోలింగ్ నమోదు అయిందని తెలిపారు. కొద్దిపాటి చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగిందన్నారు. మే 16వ తేదీన ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. -
28 సాయంత్రం 4 గంటల నుంచి ప్రచారం బంద్
పార్టీలతోపాటు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా కూడా: భన్వర్‌లాల్ సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తెలంగాణ జిల్లాల్లో ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనున్నందున 28వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచారాన్ని నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపారు. -
ఎన్నికల నిర్వహణకు ఏడు హెలికాప్టర్లు
సీఈఓ భన్వర్‌లాల్ వెల్లడి ప్రభుత్వ బంగళాల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహించరాదు పొన్నాలపై విచారణ జరిపి చర్యలు గుర్తుతో ఫొటో ఓటర్ స్లిప్‌లు పంపిణీ చేస్తే చర్యలు పోలింగ్ కేంద్రంలో ఇద్దరు పోలీసులు - ఒక హోంగార్డు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు దశల్లో జరిగే పోలింగ్నకు ఏడు హెలికాప్టర్లతో పాటు రెండు ఎయిర్ అంబులెన్స్‌లను వినియోగిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ప్రభుత్వ బంగళాల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహించకూడదని, నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రులను ఆయన హెచ్చరిం చారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వ బంగళాలో పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వడంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. అలాగే పార్టీలు గానీ, అభ్యర్థులు గానీ గుర్తులు లేకుండా తెల్ల పేపర్ స్లిప్‌లను మాత్రమే ఓటర్లకు పంపిణీ చేయాలని, అలా కాకుండా అభ్యర్థుల పేర్లు, గుర్తులతో స్లిప్‌లు పంపిణీ చేస్తే కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల ఏర్పాట్లపై భన్వర్‌లాల్ బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన చెప్పిన వివరాలు.. ఈ ఎన్నికల్లో 90 శాతం పోలింగ్ నమోదు చేయాల్సిందిగా కమిషన్ లక్ష్యంగా పెట్టింది. ఇందుకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు, అధికారులు వీలైనంత ఎక్కువ పోలింగ్ శాతం జరిగేలా ప్రోత్సహించేందుకు ఎవరికి తగిన విధానాలు వారు అవలంబించడం సంతోషమే. ఎంత ఎక్కువ మంది ఓటింగ్‌లో పాల్గొంటే ప్రజాస్వామ్యం అంత పటిష్టంగా ఉంటుందనే ఉద్దేశంతోనే అధికారులు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. రాష్ట్రంలో రెండు దశల్లో పోలింగ్ నిర్వహణకు 400 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలతో పాటు 2.50 లక్షల మంది పోలీసులను వినియోగిస్తున్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఇద్దరు పోలీసులతో పాటు ఒక హోంగార్డు ఉంటారు.తెలంగాణ జిల్లాల్లో 30వ తేదీన పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయాలి. 28వ తేదీ సాయంత్రం 6 గంటల కల్లా ఓటరు కాని వారందరూ ఆయా నియోజకవర్గాలను వీడి వెళ్లిపోవాలి. పోలింగ్ రోజు వంద మీటర్ల లోపల ఓటు ఎవరికి వేయాలనే దానిపై ప్రచారం నిర్వహించరాదు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, కెమెరాలు నిషేధం. రాష్ట్రంలో 71,222 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇందులో 45 వేల పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాట్ల ద్వారా బూత్ లోపలి దృశ్యాలను మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వీక్షించవచ్చు. మిగతా పోలింగ్ కేంద్రాల్లో వీడియో చిత్రీకరిస్తారు.ఓటర్‌స్లిప్‌ల పంపిణీ తెలంగాణలో 26, సీమాంధ్రలో 30వ తేదీకి పూర్తి అవుతుంది. స్లిప్‌లు సక్రమంగా పంపిణీ చేయని వారిపై చర్యలు తీసుకుంటాం. 55 శాతం పంపిణీ పూర్తి అయింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు పెద్దగా రాలేదు. ఆ నియమావళి పాటిం చడం సంతృప్తికరంగా ఉంది. ఇప్పటి వరకు 111 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నాం. 13,973 మందిని అరెస్టు చేశాం, 4.25 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నాం. కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్న కరీంనగర్ పోలీసు అధికారి బి.రాజును సస్పెండ్ చేశారు. ఎన్నికల విధుల్లో అధికారులు, ఉద్యోగులు నిష్పక్షపాతంగా ఉండాలి. ఏదైనా పార్టీ, అభ్యర్థి పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. ఓటర్లందరూ డబ్బు, మద్యం, కులం, మతాలకు అతీతంగా మంచి వ్యక్తికి ఓటు వేయాలి. అందరూ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలి.నక్సలైట్లు ప్రభావిత నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ జరుగుతుందని గతంలో ప్రకటించాం. అయితే కొన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు వరకూ పెంచాలని ఆయా జిల్లాల కలెక్టర్లు కోరారు. ఆ విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతాం. -
కర్నూలు అసెంబ్లీ బరిలో అత్యధిక మంది పోటీ
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన అనంతరం ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.111 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో భన్వర్ లాల్ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్రలో 25 లోక్‌సభ స్థానాలకు 333 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, 175 అసెంబ్లీ స్థానాలకు 2,243 అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో కర్నూలు అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 36 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. మొదటి దశ ఎన్నికల ప్రచారం ఈ నెల 28 సాయంత్రం 6.00 గంటలకు ముగుస్తుందన్నారు. ఆ తర్వాత ఎవరూ ప్రచారం చేయకూడదని ఆయన ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు సూచించారు. అలాగే పార్టీలు, అభ్యర్థులు గుర్తులపై ఓటర్ స్లిప్పులను పంపిణి చేయకూడదని చెప్పారు. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను హెచ్చరించారు. మాజీ మంత్రులు అధికారిక నివాసాల్లో ఉంటూ ఎన్నికలకు సంబంధించిన పనులు చేపడితే చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల కోసం 7 హెలికాప్టర్లు, 2 ఎయిర్ అంబులెన్స్‌లు వినియోగిస్తున్నట్లు చెప్పారు. మొత్తం 71,222 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. -
పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ : భన్వర్‌లాల్
-
టీడీపీతో ఈనాడు కుమ్మక్కై .... జగన్ వ్యతిరేక వార్తలు రాస్తోంది
ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: ఈనాడు దినపత్రిక.. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న కేసుల వివరాలను ప్రచురిస్తూ ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడుతోందని, ఈ అంశంపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ శనివారం ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు అందజేశారు. నెలరోజులుగా వస్తున్న ‘ఈనాడు ఎన్నికల ప్రత్యేకం’ పేజీల్లో న్యాయస్థానాల్లో జగన్, వైఎస్‌పై విచారణలో ఉన్న కేసుల వివరాలను ప్రచురిస్తున్నారని, ఇలాంటివి ఎన్నికల వార్తలకింద ప్రచురించడం ‘సబ్‌జ్యుడిస్’ అవుతుందని వినతిపత్రంలో పేర్కొన్నారు.ఈనాడు, టీడీపీ రెండూ కలిసి ఈ ఎన్నికల్లో జగన్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు విచారణలో ఉన్న కేసుల వివరాలనేగాక.. తప్పుడు వార్తలను కూడా ప్రచురిస్తున్నాయని ఆయన ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అత్యధిక సర్క్యులేషన్ గలదిగా ఆ యాజ మాన్యం చెప్పుకుంటున్న ఈనాడు తన పాఠకులను ప్రభావితం చేయాలన్న దురుద్దేశ ంతోనే ఇలాంటి వార్తలను ప్రచురిస్తోందన్నారు. సరిగ్గా ఎన్నికల ముం దుగా టీడీపీ, ఈనాడు చేతులు కలిపి ఇలా ఒక రాజకీయపార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడం తీవ్ర అభ్యంతరకరమేగాక, ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపారు. ఒక రాజకీయ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు టీడీపీ ఒక దినపత్రికను సాధనంగా ఎన్నికల తరుణంలో వాడుకోవడం, తద్వారా ఓటర్ల సానుభూతి పొందాలని చూడటం తీవ్రంగా ఖండించాల్సిన అంశమని అభిప్రాయపడ్డారు.ఈ విషయంలో ఈనాడు-టీడీ పీల కుమ్మక్కుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు: భన్వర్ లాల్
రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తామని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసామని ఆయన మంగళవారమిక్కడ వెల్లడించారు. ఇప్పటికే 352 కేంద్ర బలగాలు రాష్ట్రానికి వచ్చాయని భన్వర్ లాల్ తెలిపారు. పోలీసులు తనిఖీలలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.56 కోట్లు స్వాధీనం చేసుకున్నారని ఆయన వెల్లడించారు. వరంగల్ కలెక్టరేట్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఈవీఎంలు భద్రపరిచే భవనాన్ని భన్వర్‌లాల్ ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ...ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. -
ఏప్రిల్ 8 వరకు కొత్త ఓటర్ల నమోదు:భన్వర్ లాల్
-
ఓటరు నమోదుకు మరో చాన్స్
తెలంగాణ మార్చి30వరకు.. సీమాంధ్రలో ఏప్రిల్ 9 వరకు: భన్వర్‌లాల్ విశాఖపట్నం, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు లేనివారు దరఖాస్తు చేసుకునేందుకు మరోసారి అవకాశం కల్పిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. శనివారం విశాఖలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ సీమాంధ్రలో ఏప్రిల్ 9వ తేదీ వరకు, తెలంగాణలో మార్చి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఇటీవల నిర్వహించిన ఓటరు నమోదు కార్యక్రమంలో దేశం మొత్తమ్మీద దరఖాస్తులలో 20 శాతం మేర ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చాయని చెప్పారు. పేరు లేనివారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బూత్ లెవెల్ అధికారుల వద్ద ఓటరు జాబితా ఉంటుందని, అలాకాని పక్షంలో నేరుగా మొబైల్ ద్వారా ఒక ఎస్ఎంఎస్ పంపించడం ద్వారా కూడా జాబితాలో పేరుందో లేదో తెలుసుకునే అవకాశముందని తెలిపారు. ఇందుకోసం అభ్యర్థులు మొబైల్లో ‘ఓట్ అని ఇంగ్లిష్‌లో టైప్ చేసి, ఒక స్పేస్ ఇచ్చి, ఓటర్‌కార్డు నంబర్‌ను టైప్ చేసి, 92462800027 నంబర్‌కు ఎస్ఎంఎస్ చేస్తే వెంటనే ఓటు ఉందో లేదో తెలిసిపోతుందని చెప్పారు. ఓటరు కార్డు ఉన్నప్పటికీ ఓటరు జాబితాలో పేరు లేనిపక్షంలో ఓటువేసే అవకాశం ఉండదని తేల్చి చెప్పారు. ఓటరు నమోదు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా, ఇప్పటివరకు జరిపిన తనిఖీల్లో రూ. 25కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికలు నిర్వహణకు సిబ్బంది కొరత లేదన్నారు. -
ఎన్నికలకు పకడ్బందీ ప్రణాళిక
కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. ఎన్నికల దృష్ట్యా జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తి అయిందని వెల్లడించారు. జిల్లాలోని 2,407 పోలింగ్ కేంద్రాలలో విద్యుత్, మంచి నీళ్లు, టాయిలెట్లు, ర్యాంపుల నిర్మాణాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామన్నారు. వివిధ ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాలకు ఈ పనుల బాధ్యతలు అప్పగించినట్లు స్పష్టం చేశారు. అత్యంత సున్నితమైన ఏడు పోలింగ్ కేంద్రాలకు ఒకరు చొప్పున సెక్టోరల్ అధికారిని నియమిస్తున్నామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయడానికి యూనిఫాం అధికారులకు బాధ్యతలు అప్పగిస్తాన్నారు. ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్ లాల్ సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భన్వర్‌లాల్‌తో మాట్లాడుతూ కలెక్టర్ స్మితా సబర్వాల్ పై వ్యాఖ్యాలు చేశారు. అనంతరం ఆమె జిల్లాధికారులతో మాట్లాడుతూ ఎన్నికల పర్యవేక్షకులుగా జిల్లాకు సుమారు 40 మంది సీనియర్ అధికారులను ఎన్నికల సంఘం పంపించనుందని తెలిపారు. ఎన్నికల ప్రకటన వెల్లడైన వెంటనే ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో జేసీ శరత్, ఏజేసీ మూర్తి, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో స్లిప్పులిస్తాం: భన్వర్‌లాల్
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ వాటిద్వారా ఎవరికి ఓటు వేశారో తెలుసుకోవచ్చు ఓటరు చూశాక అవి బాక్స్‌లోకి వెళ్తాయి కొత్త ఓటర్లలో 75 శాతం యువతే ఫిబ్రవరి నెలాఖరు వరకు ఓటర్లుగా నమోదు సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేశామన్న వివరాలు తెలిపే స్లిప్పును ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. అయితే ఇది ప్రయోగాత్మకంగా కొన్ని నియోజకవర్గాలకే పరిమితం చేయనున్నట్లు చెప్పారు. స్లిప్పును ఓటరుకు ఇవ్వబోమనీ, తామెవరికి ఓటు వేశామనేది ఓటరు నిర్ధారించుకున్నాక ఆ స్లిప్పును మరో బాక్స్‌లో వేస్తామని వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెలాఖరులోగా ఎన్నికల నోటిఫికేషన్‌ను ప్రకటిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. గతంలో జరిగిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి మొదట్లో ఈ నోటిఫికేషన్ వస్తుందన్నారు. రాజ్యసభ ఎన్నికలు, సాధారణ ఎన్నికల బందోబస్తు, పోలీసు అధికారుల బదిలీలకు సంబంధించి ఆయన గురువారం సచివాలయంలో డీజీపీ ప్రసాదరావుతో సమావేశమై చర్చించారు. మూడేళ్లుగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న అధికారుల బదిలీ, సమాచార వ్యవస్థ లేనిచోట పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడం, రాష్ట్రంలోని 95 బెటాలియన్ల సీఆర్పీఎఫ్ బలగాలకు రెండు వారాల శిక్షణ, పోలీసు అధికారులెవరూ స్వంత జిల్లాల్లో ఉండకుండా బదిలీ చేయాలని సూచించినట్లు భన్వర్‌లాల్ తెలిపారు. డీఎస్పీ స్థాయి నుంచి బదిలీలు ప్రభుత్వానికి వస్తాయని, సీఐ స్థాయిలోపు స్థానిక అధికారులు బదిలీ చేస్తారని చెప్పారు. కొత్తగా నమోదైన ఓటర్లలో 60 లక్షల ఓటర్లు యువకులేనని తెలిపారు. తాము ఆశించిన దానిలో 75 శాతం ఓటర్లుగా నమోదు అయ్యారని, మరో 25 శాతం ఓటర్లు చదువుల కోసం రాష్ట్ర బయట ఉన్నందున నమోదు చేసుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి గుర్తింపుకార్డులను కలర్లో ఇవ్వనున్నందున, మార్చి ఒకటో తేదీ నుంచి పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. సాధారణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే వరకు ఓటర్లుగా నమోదు కావచ్చని, అందువల్ల ఫిబ్రవరి చివరివరకు ఓటర్లుగా నమోదు చేసుకోని వారికి ఇంకా సమయం ఉందని అన్నారు. -
విచారణ పారదర్శకంగా ఉండాలి
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఓటరు దరఖాస్తు విచారణను పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. దరఖాస్తుల విచారణలో ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా నిర్వహించాలన్నారు. ఈ నెల 13వ తేదీలోపు విచారణ పూర్తిచేసి, 16వ తేదీలోగా తుది జాబితా ప్రకటించాలని సూచించారు. ఇందుకోసం ప్రతి జిల్లాకు 30 నుంచి 40 మంది పరిశీలకులను పంపించనున్నట్లు వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు మార్పులు, చేర్పులకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో 18శాతం మాత్రమే విచారణ చేశారని, మిగిలిన 82 శాతం వేగవంతంగా చేయాలని ఆదేశించారు. ఒక్కో జిల్లాలో దాదాపు 80 నుంచి 90 వేల దరకాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. మైనర్లు, స్థానికంగా నివాసం లేనివారి దరఖాస్తుల విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలన్నారు. జనాభా లెక్కలు, స్త్రీ పురుష నిష్పత్తులను ఆధారం చేసుకొని ఓటర్ల జాబితాలు ఉన్నాయో లోవో పరిశీలించాలన్నారు. విచారణ సమయంలో దరఖాస్తుదారులు ఉన్న పక్షంలో ఆధారాలు, పత్రాలు వంటి వాటి విషయంలో సడలింపు ధోరణిలో వ్యవహరించాలని సూచించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచేందుకు ప్రతి జిల్లాలో చేపట్టిన గోదాముల నిర్మాణాన్ని ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల ఖాళీలు ఉంటే వెంటనే భర్తీ చేయాలని భన్వర్‌లాల్ ఆదేశించారు. అద్దంకి ఘటనను ప్రస్తావించిన భన్వర్‌లాల్ ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘర్షణ సంఘటనను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించిన ఓటర్ల నమోదు ప్రక్రియకు లక్షా 58 వేల 380 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిలో 31శాతం దరఖాస్తులను ఇప్పటివరకు విచారించినట్లు తెలిపారు. మిగిలిన దరఖాస్తుల విచారణను ఈ నెల 10వ తేదీలోపు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఒంగోలులో ఓట్ల నమోదుపై వివిధ రాజకీయ పార్టీలు చేసిన ఫిర్యాదులపై రెండుసార్లు విచారణ నిర్వహించినట్లు తెలిపారు. డబుల్ ఎంట్రీలు, చనిపోయిన వారి ఓట్ల విషయంలో ఫిర్యాదుల్లో పేర్కొన్న సంఖ్యకు, విచారణలో తేలిన సంఖ్యకు పెద్దగా తేడా లేదన్నారు. ఇళ్లు మారిన విషయంలో మాత్రం 1500 తేడా ఉన్నట్లు వివరించారు. కనిగిరి, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కొన్ని ఫిర్యాదులు ఉన్నాయని, వాటిని ఈ నెల 13వ తేదీలోపు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ స్థానాలు ఖాళీగా ఉండటంతో అక్కడ ఇన్చార్జిలను నియమించినట్లు వివరించారు. జిల్లాలో గోదాముల నిర్మాణానికి 1.42 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ప్రతిపాదనలు పంపించగా, 1.22 కోట్ల రూపాయలు విడుదల చేశారని, మొత్తం నగదు డిపాజిట్ చేస్తేనే పనులు ప్రారంభిస్తామని గృహనిర్మాణశాఖ అధికారులు తెలిపారన్నారు. మిగిలిన * 20 లక్షలు మంజూరు చేస్తే పనులు ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్‌గౌడ్, వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ నాగరాజారావు, ఒంగోలు కందుకూరు ఆర్డీఓలు ఎంఎస్ మురళి, టి.బాపిరెడ్డి, హెచ్-సెక్షన్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, అన్ని నియోజకవర్గాల ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు పాల్గొన్నారు. -
16న ఓటరు తుది జాబితా విడుదల
కలెక్టరేట్, న్యూస్‌లైన్:ఓటరు తుది జాబితా ఈ నెల 16న విడుదల చేసేందుకు కలెక్టర్లు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్‌లాల్ ఆదేశిం చారు. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి మాట్లాడారు. మరణించిన, డూప్లికేట్ ఓటర్లను జాబితా నుంచి విధిగా తొలగించాలన్నారు. వ చ్చిన ఆక్షేపణలు, దరఖాస్తులు, మార్గదర్శకాల మేరకు పరిశీలించిన తర్వాత మాత్రమే తిరస్కరించాలని సూచిం చారు. డూప్లికేట్ ఓటర్ల తొలగింపు కార్యక్రమాన్ని ఈ నెల 13లోగా పూర్తిచేయాలన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా కేవలం 18 శాతం దరఖాస్తులు మాత్రమే పరిష్కరిం చారని, 82 శాతం దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి జిల్లాకు దాదాపు 14 మంది ఎన్నికల పరిశీలకులు రాబోతున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు మాట్లాడుతూ జిల్లాలో 1లక్షా 16 వేల దరఖాస్తులు అందగా, ఇప్పటి వరకు 29,700 పరిష్కరించామని తెలి పారు. కొన్ని మండలాలలో విద్యుత్ సమస్య కారణంగా జాప్యం జరుగుతుం దని యూపీఎస్ కొనుగోలు చేసి త్వరితగతిన పరిష్కరిస్తామని వివరించారు. ఈవీఎం లు భద్రపరించేందుకు గోదాం నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరారు. వీడియో కాన్ఫరెన్సులో జేసీ హరిజవహర్‌లాల్, డీఆర్వో అం జ య్య, రెవెన్యూ డివిజనల్ అధికారులు జహీర్, శ్రీనివాసరెడ్డి, రవినాయక్, భాస్కర్‌రావు, స్పెషల్‌డిప్యూటీ కలెక్టర్లు కె.మధుకర్‌రెడ్డి, రాములు, పరిపాలన అధికారి శ్రీరాములు, భాస్కర్, శ్యాం సుందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
ఓటర్ల నమోదు గడువు పొడిగింపు
23 వరకు పొడిగిస్తున్నట్లు సీఈవో భన్వర్‌లాల్ వెల్లడి ఆదివారం కూడా దరఖాస్తులు స్వీకరణ సాక్షి, హైదరాబాద్: ఓటర్ల నమోదు గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారంతో ఓటర్ల నమోదుకు గడువు ముగిసింది. అయితే చాలామంది ఇంకా ఓటర్లగా నమోదు కావాల్సి ఉన్నందున వారికి అవకాశం ఇవ్వడానికి గడువును పొడిగించారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ కల్లా 18 ఏళ్లు నిండిన వాళ్లు ఓటర్‌గా నమోదు చేసుకోవాలని భన్వర్‌లాల్ విజ్ఞప్తి చేశారు. 22వ తేదీ ఆదివారం కూడా రాష్ట్రంలోని 69 వేలకుపైగా పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బూత్‌స్థాయి ఆఫీసర్లు ఓటర్ల జాబితాలతో అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆయా పరిధిలోని పౌరులు ఓటర్‌గా నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 23 వరకు ఓటర్‌గా నమోదుకు స్థానిక మండల, ఆర్డీవో కార్యాలయాల్లోను, మున్సిపల్ కార్పొరేషన్లలో సర్కిల్ల్లోను, జీహెచ్ఎంసీ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిల్లోని డిప్యూటీ మున్సిపల్ కార్యాలయాల్లోను దరఖాస్తు చేసుకోవచ్చునని వివరించారు. ఓటర్ల తుది జాబితాను జనవరి 16న ప్రకటించనున్నట్లు తెలిపారు. -
యువతా.. ఓటే భవిత
సాక్షి, సంగారెడ్డి: యువతా మేలుకో..ఓటే మన భవితకు పునాది. అవినీతి నేతలకు చరమగీతం పాడాలంటే ఓటే ఆయుధం..అందుకని ఇప్పటికీ ఓటులేని వాళ్లు రా నున్న రెండు రోజుల్లో ఓటరుగా నమోదు కావాల్సిందే. ఓటరు జాబితా సవరణ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. గత నెల 18న ముసాయిదా జాబితాను సైతం ప్రచురించారు. తుది జాబితా ప్రచురణకు కసరత్తు జరుగుతోంది. బూత్‌స్థాయి పోలింగ్ కేంద్రాలు, తహశీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పా టు చేసి ఓటరు నమోదు, ఇతర మార్పు చేర్పుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 17వ తేదీలోపు దరఖాస్తు చేసుకుంటేనే ఈ జాబితాలో చోటు లభించనుంది. తుది గడువులోగా వచ్చిన దరఖాస్తులపై ఈ నెల 31లోగా విచారణ పూర్తి చేసేసి, జనవరి 16న తుది జాబితాను ప్రకటించనున్నారు. ఈ ఓటరు జాబితాయే 2014లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలతో పాటు మున్సిపల్, జడ్పీ ఎన్నికలకు కీలకం కానుంది. మహిళలు వెనకడుగు .. ముసాయిదా ఎన్నికల జాబితా, 2011 జనాభా లెక్కలను పోల్చి చూస్తే.. జిల్లాలో పురుష ఓటర్ల సంఖ్య.. వారి జనాభా కంటే 13.44 శాతం ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. బోగస్ ఓట్లు, చనిపోయిన ఓ టర్లను జాబితా నుంచి తొలగించకపోవడంతో భా రీ వ్యత్యాసం వచ్చిందని అధికారులు భావిస్తున్నారు. అ యితే, మహిళా ఓటర్ల పరిస్థితి విరుద్ధంగా తయారైంది. మహిళా ఓటర్ల సంఖ్య.. వారి జనాభాతో పోలిస్తే 9.8 శాతం తక్కువగా ఉంది. ముసాయిదా జాబితా ప్రకారం.. జిల్లాలో మొత్తం 20,78,100 ఓటర్లుండగా.. అందులో 10,49,604 పురుష ఓటర్లు, 10,28,426 మహిళా ఓటర్లు, 70 మంది ఇతర ఓటర్లున్నారు. ముసాయిదా జాబితా ప్రకారం చూసినా, జనాభా లెక్కల ప్రకారం విశ్లేషించినా జిల్లాలో మహిళా ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అవుతోంది. ఈ నేపథ్యంలో రానున్న రెండు రోజుల్లో మహిళా ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. స్వీప్ సక్సెస్ ఓటరు నమోదుపై యువతీ, యువకల్లో చైతన్యం కల్పించడానికి నిర్వహించిన ‘స్వీప్’ కార్యక్రమానికి జిల్లాలో అనూహ్య స్పందన లభించింది. ఇతర జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలోనే సత్ఫలితాలు వచ్చాయి. దాదాపు 37 వేల కొత్త ఓటర్లను ఈ కార్యక్రమం ద్వారా నమోదు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ భన్వర్‌లాల్ సూచన మేరకు జిల్లా యంత్రాంగం స్వీప్‌లో జాతీయస్థాయి పురస్కారం కోసం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలు పంపించింది.