కలెక్టరేట్, న్యూస్‌లైన్:ఓటరు తుది జాబితా ఈ నెల 16న విడుదల చేసేందుకు కలెక్టర్లు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్‌లాల్ ఆదేశిం చారు. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి మాట్లాడారు. మరణించిన, డూప్లికేట్ ఓటర్లను జాబితా నుంచి విధిగా తొలగించాలన్నారు. వ చ్చిన ఆక్షేపణలు, దరఖాస్తులు, మార్గదర్శకాల మేరకు పరిశీలించిన తర్వాత మాత్రమే తిరస్కరించాలని సూచిం చారు. డూప్లికేట్ ఓటర్ల తొలగింపు కార్యక్రమాన్ని ఈ నెల 13లోగా పూర్తిచేయాలన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా కేవలం 18 శాతం దరఖాస్తులు మాత్రమే పరిష్కరిం చారని, 82 శాతం దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి జిల్లాకు దాదాపు 14 మంది ఎన్నికల పరిశీలకులు రాబోతున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు మాట్లాడుతూ జిల్లాలో 1లక్షా 16 వేల దరఖాస్తులు అందగా, ఇప్పటి వరకు 29,700 పరిష్కరించామని తెలి పారు. కొన్ని మండలాలలో విద్యుత్ సమస్య కారణంగా జాప్యం జరుగుతుం దని యూపీఎస్ కొనుగోలు చేసి త్వరితగతిన పరిష్కరిస్తామని వివరించారు. ఈవీఎం లు భద్రపరించేందుకు గోదాం నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరారు. వీడియో కాన్ఫరెన్సులో జేసీ హరిజవహర్‌లాల్, డీఆర్వో అం జ య్య, రెవెన్యూ డివిజనల్ అధికారులు జహీర్, శ్రీనివాసరెడ్డి, రవినాయక్, భాస్కర్‌రావు, స్పెషల్‌డిప్యూటీ కలెక్టర్లు కె.మధుకర్‌రెడ్డి, రాములు, పరిపాలన అధికారి శ్రీరాములు, భాస్కర్, శ్యాం సుందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
16న ఓటరు తుది జాబితా విడుదల
Published Sun, Jan 5 2014 4:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement