తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్ లాల్ను కలిశారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్ లాల్ను కలిశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో లక్షలాది ఓటర్లను అక్రమ ఓటర్ల పేరుతో తొలగిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకొని ఓటర్ల తొలగింపు జరగకుండా చూడాలని కోరారు. ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని కలిసిన వారిలో టీ కాంగ్రెస్ నేతలు కమలాకర్, నిరంజన్లు ఉన్నారు.