టీడీపీతో ఈనాడు కుమ్మక్కై .... జగన్ వ్యతిరేక వార్తలు రాస్తోంది | eenadu news paper write comments against ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

టీడీపీతో ఈనాడు కుమ్మక్కై .... జగన్ వ్యతిరేక వార్తలు రాస్తోంది

Published Sun, Apr 20 2014 12:37 AM | Last Updated on Tue, Oct 8 2024 11:46 AM

eenadu news paper write comments against ys jagan mohan reddy

ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
 
సాక్షి, హైదరాబాద్: ఈనాడు దినపత్రిక.. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న కేసుల వివరాలను ప్రచురిస్తూ ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడుతోందని, ఈ అంశంపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ శనివారం ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు అందజేశారు.
 
నెలరోజులుగా వస్తున్న ‘ఈనాడు ఎన్నికల ప్రత్యేకం’ పేజీల్లో న్యాయస్థానాల్లో జగన్, వైఎస్‌పై విచారణలో ఉన్న కేసుల వివరాలను ప్రచురిస్తున్నారని, ఇలాంటివి ఎన్నికల వార్తలకింద ప్రచురించడం ‘సబ్‌జ్యుడిస్’ అవుతుందని వినతిపత్రంలో పేర్కొన్నారు.ఈనాడు, టీడీపీ రెండూ కలిసి ఈ ఎన్నికల్లో జగన్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు విచారణలో ఉన్న కేసుల వివరాలనేగాక.. తప్పుడు వార్తలను కూడా ప్రచురిస్తున్నాయని ఆయన ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అత్యధిక సర్క్యులేషన్ గలదిగా ఆ యాజ మాన్యం చెప్పుకుంటున్న ఈనాడు తన పాఠకులను ప్రభావితం చేయాలన్న దురుద్దేశ ంతోనే ఇలాంటి వార్తలను ప్రచురిస్తోందన్నారు.
 
సరిగ్గా ఎన్నికల ముం దుగా టీడీపీ, ఈనాడు చేతులు కలిపి ఇలా ఒక రాజకీయపార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడం తీవ్ర  అభ్యంతరకరమేగాక, ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపారు. ఒక రాజకీయ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు టీడీపీ ఒక దినపత్రికను సాధనంగా ఎన్నికల తరుణంలో వాడుకోవడం, తద్వారా ఓటర్ల సానుభూతి పొందాలని చూడటం తీవ్రంగా ఖండించాల్సిన అంశమని అభిప్రాయపడ్డారు.ఈ విషయంలో ఈనాడు-టీడీ పీల కుమ్మక్కుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement