ఒడిశాలో అధికార బీజూ జనతాదళ్ (బీజేడీ)కి ఎదురు దెబ్బ తగిలింది. 24 ఏళ్ల తర్వాత తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. తాజాగా విడుదలైన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతుంది.
మధ్నాహ్యం 4.50 గంటల సమయానికి ఒడిశాలో మొత్తం 147 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 80 స్థానాల్లో, బీజూ జనతదాళ్ 52, కాంగ్రెస్ 15 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతున్నాయి. తాజా అసెంబ్లీ ఫలితాలతో బీజేపీ అధికారం చేపట్టడం అనివార్యమైంది.
లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 400 పై చీలూకు స్థానాల్లో విజయం సాధించాలే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ 137 స్థానాల్లో గెలుపొందగా 158 స్థానాల్లో ఆదిక్యంలో కొనసాగుతుండగా.. ఒడిశా లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఊహించని ఫలితాల్ని రాబట్టింది. 21 లోక్‌సభ స్థానాలకు బీజేపీ 19 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతుండగా.. బీజూ జనతాదళ్, కాంగ్రెస్‌లు చెరోస్థానంలో లీడింగ్‌లో ఉన్నాయి.
ఒడిశా బీజేపీ సీఎం ఎవరంటే?
ఒడిశా బీజేపీ ముఖ్యమంత్రిగా ఎవరిని నియమిస్తుందనే అంశంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమల్.. పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కథనాల ఆధారంగా.. ఒడిశా సీఎం రేసులో నలుగురు అభ్యర్ధులు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో బీజేపీ కేంద్ర మాజీ మంత్రి, సిట్టింగ్ ఎంపీ జువల్ ఓరం, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బైజయంత్ పాండా,బీజేపీ నేత ధర్మేంద్ర ప్రధాన్‌లు ఉన్నారు. అయితే ఈ నలుగురు ఒడిశా లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో లీడింగ్‌లో ఉన్నారు.
పట్నాయక్ ఆశలు అడియాశలు
తాజాగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో 24 ఏళ్లగా ఒడిశా సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ ఆశలు అడియాశలయ‍్యాయి. ఒడిశా సీఎంగా నవీన్ పట్నాయక్ 23 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. అయితే ఐదోసారి అధికార పీఠాన్ని అధిష్టించి.. సిక్కిం మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న (సీఎంగా 24 ఏళ్ల 165 రోజుల) రికార్డును అధిగమించాలన్న నవీన్ పట్నాయక్ ఆకాంక్ష కలగానే మిగిలింది.
Comments
Please login to add a commentAdd a comment