సాక్షి, ముంబై : అధికార బీజేపీ లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించింది. రికార్డ్ స్థాయిలో మొత్తం 195 మందితో తొలి విడుత అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. ఇక ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ సైతం లోక్‌సభ సీట్ల జాబితా విడుదలపై కసరత్తు చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మహారాష్ట్రలో ప్రతిపక్షాల కూటమి మహావికాస్ అఘాడీలో సీట్ల సర్దుబాటుపై చర్చించింది. ఆ అంశం కొలిక్కి వచ్చినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. మొత్తం 48 లోక్‌సభ స్థానాలకు గాను ఉద్ధవ్ ఠాక్రే శివసేన(UBT) 20 స్థానాల్లో పోటీ చేయనుంది. కాంగ్రెస్ 18, శరద్‌పవార్ ఎన్సీపీ 10 చోట్ల అభ్యర్థులను బరిలో దించనుందని సమాచారం.
కొద్దిరోజుల క్రితం వరకు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న మహరాష్ట్ర ప్రాంతీయ పార్టీ వంచిత్ బహుజన్ అఘాడి (VBA) మొత్తం ఐదు సీట్లను డిమాండ్ చేసింది. అయితే, తాజాగా ప్రతిపక్షాల కూటమి మహావికాస్ అఘాడీలో వీబీఏకి రెండు సీట్లు కేటాయించింది.
శివసేన ముంబైలోని ఆరు లోక్‌సభ స్థానాలకు గాను నాలుగింటిలో పోటీ చేస్తుండగా.. రాష్ట్రంలోనే 14 శాతం ఓటు షేర్ ఉన్న వీబీఏ ముంబై నార్త్ ఈస్ట్ సీటు దక్కించుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచన.
పోటాపోటీ
ఇక ముంబై సౌత్ సెంట్రల్, నార్త్ వెస్ట్ 39 అసెంబ్లీ స్థానాలకు సీట్ల కేటాయింపుపై స్పష్టం వచ్చినట్లు సమాచారం. ఈ రెండు ప్రాంతల్లో ఎక్కువ శాతం సీట్ల కోసం ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, శివసేనలు పోటీపడుతున్నాయి.
2019లో ఎవరెన్ని గెలిచారంటే
2019 ఎన్నికలలో శివసేన (అప్పుడు బీజేపీతో పొత్తులో ఉంది) 23 స్థానాల్లో పోటీ చేసింది. ముంబై సౌత్ సెంట్రల్, నార్త్ వెస్ట్ సహా 18 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 25 స్థానాల్లో పోటీ చేసి చంద్రాపూర్‌లో మాత్రమే గెలిచింది, శరద్ పవార్ ఎన్సీపీ 19 స్థానాల నుండి పోటీ చేసి నాలుగు గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment