లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్ర మాజీ ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత డాక్టర్ హర్ష వర్ధన్ కీలక ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి రీటైరవుతున్నట్లు చెప్పారు.
‘ముప్పై సంవత్సరాలకు పైగా అద్భుతమైన రాజకీయ జీవితం. ఐదు అసెంబ్లీ, రెండు పార్లమెంటరీ ఎన్నికలలో గెలిచాను. పార్టీలో,రాష్ట్రంలో,కేంద్రంలో అనేక కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వహించాను. ఇప్పుడు తిరిగి వైద్య వృత్తిలో కొనసాగేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ట్వీట్ చేశారు.
After over thirty years of a glorious electoral career, during which I won all the five assembly and two parliamentary elections that I fought with exemplary margins, and held a multitude of prestigious positions in the party organisation and the governments at the state and…
— Dr Harsh Vardhan (@drharshvardhan) March 3, 2024
మానవాళికి సేవ చేయాలనే నినాదంతో నేను యాభై ఏళ్ల క్రితం కాన్పూర్‌లోని జీఎస్‌వీఎం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌లో చేరాను. కోవిడ్-19 మహమ్మారి వంటి కఠిన సమయాల్లో ప్రాణాలతో పోరాడుతున్న లక్షల మంది ప్రజల‍్ని ఆరోగ్యాన్ని కాపాడే అవకాశం నాకు దక్కింది. ఇప్పుడు రాజకీయాలకు స్వస్తి చెప్పి ఢిల్లీ కృష్ణా నగర్‌లోని నా ఈఎన్‌టీ క్లీనిక్‌లో వైద్య సేవలందిస్తా. నాకోసం క్లీనిక్ ఎదురు చూస్తోంది అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment