వైఎస్‌ను విమర్శిస్తే ప్రజలు పాతరేస్తారు | tellam balaraju takes on nara lokesh | Sakshi
Sakshi News home page

వైఎస్‌ను విమర్శిస్తే ప్రజలు పాతరేస్తారు

Published Tue, Apr 29 2014 12:36 AM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

వైఎస్‌ను విమర్శిస్తే ప్రజలు పాతరేస్తారు - Sakshi

వైఎస్‌ను విమర్శిస్తే ప్రజలు పాతరేస్తారు

కొయ్యలగూడెం, న్యూస్‌లైన్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబంపై విమర్శలు చేస్తే ప్రజలు టీడీపీకి పాతరేస్తారని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం బాలరాజు నారా లోకేష్‌ను హెచ్చరించారు. లోకేష్ వైఎస్ కుటుం బంపై విమర్శలు చేయడాన్ని ఆయన ఖండించారు. సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో బాలరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కుటుంబ సభ్యుల ఆప్యాయతలకు అర్థం తెలియని ద్రోహి చంద్రబాబేనని, ఆయన కడుపున పుట్టిన లోకేష్ కుతంత్రంతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పిల్లనిచ్చిన మామ, తమ్ముడు, తోడల్లుడు, బావమరుదులతో సహా అందరినీ మోసగించి ఛీ కొట్టించుకున్న ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. పట్టుమని పదిమంది  రోడ్‌షోకు జనం రాలేదన్న అక్కసుతో మహానేత కుటుంబంపై అవాకులు, చవాకులు పేల్చి తన లోకేష్ తన ఉక్రోషాన్ని బహిర్గతం చేసుకున్నారన్నారు. భూమి మొత్తం మీద అత్యంత అపనమ్మకమైన వ్యక్తి ఎవరని క్విజ్ నిర్వహిస్తే ఆబాలగోపాలం సైతం టక్కున నారా చంద్రబాబునాయుడు అని సమాధానమిస్తారని బాలరాజు ఎద్దేవా చేశారు.
 
వందలాది మంది ప్రాణత్యాగంతో తన తండ్రి కోసం అసువులు బాసిన వారి కుటుంబాలను ఆదుకోవడం కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తే రాజకీయ మనుగడ కోసం టీడీపీ చేసిన దుష్ర్పచారాన్ని ప్రజలు తిప్పికొట్టిన సంగతి మరిచిపోయావా అని ప్రశ్నించారు. హంగు, ఆర్భాటం, మద్యం, డాంబికాలు టీడీపీది అయితే ఆత్మాభిమానం, అశేష ప్రజాబలం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంతమని బాలరాజు తెలిపారు. అచ్యుతాపురం  లో ఆయన గడప గడపకు వైఎస్సార్ సీపీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గీతకార్మికుడి అభిమానంతో అందించిన కల్లును సేవించారు. అనంతరం శ్రీరంగపట్నంలో యాదవ కుల సంఘం సభ్యులు బహుకరించిన కంబలి, గొర్రెపిల్ల, గొల్లకర్రలను అందజేశారు. త్రినాథపురం, బర్కెట్‌నగర్‌లో బాలరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ యూత్ నాయకులు నిర్వహించిన బైక్ ర్యాలీ ప్రజలను ఆకట్టుకుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, పోతన శేషు,  తాడికొండ మురళి,  మేకల అన్నవరం తదితరులు బాలరాజు వెంట ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement