Tellam Bala Raju
-
ఈనాడు రోత రాతలపై ఎమ్మెల్యే బాలరాజు ఫైర్
-
ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు సీఎం ఫోన్‌కాల్
సాక్షి, పశ్చిమ గోదావరి: పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజును ఆంధ్రపద్రేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. కరోనా బారిన పడి కోలుకుంటున్న బాలరాజుకు సీఎం జగన్ ఆదివారం ఫోన్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కరోనా నుంచి కోలుకొని ప్రజాసేవలోకి రావాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఎమ్మెల్యే బాలరాజుకు కరోనా పాజిటివ్ రావడంతో ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారు. -
గొడ్డు కారంతో ఎమ్మెల్యే భోజనం
పశ్చిమగోదావరి, బుట్టాయగూడెం: కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ అడవిబిడ్డల ఆకలితీర్చేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. అధికారులు, స్వచ్ఛంద సంస్థలను సమాయత్తం చేసి కొండలు, వాగులు, వంకలు దాటుతూ మారుమూల గిరిజన గ్రామాలకు చేరుకుని నిత్యావసర సరుకులు, కూరగాయలు అందిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 56 గిరిజన గ్రామాల్లో పర్యటించి సుమారు రూ.75 లక్షల విలువైన నిత్యావసరాలు అందించారు. తాజాగా బుధవారం మరో సాహసోపేతమైన పర్యటన చేశారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న బుట్టాయగూడెం మండలంలోని మారుమూల అటవీ ప్రాంతమైన మోతుగూడెం గ్రామాన్ని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్వీ సూర్యనారాయణతో కలిసి సందర్శించారు. యాక్షన్ స్వచ్ఛంద సంస్థ సమకూర్చిన నిత్యావసర సరుకులు, కూరగాయలను 150 గిరిజన కుటుంబాలకు అందించారు. ద్విచక్రవాహనంపై వాగు దాటుతున్న ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, అధికారులు ఐదు కిలోమీటర్ల మేర కాలినడకన.. మోతుగూడెం పర్యటన సాహసంతో కూడుకున్నది. ఎత్తయిన కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. సరైన రహదారి లేని ఈ గ్రామానికి వెళ్లాలంటే సుమారు ఐదు కిలోమీటర్లు నడవాల్సిందే. దశాబ్దాలుగా ఈ గ్రామ గిరిజనులకు కాలిబాటే ఆధారం. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో కొంతమేర రహదారుల నిర్మాణం జరిగినా మరి కొంతమేర రోడ్డు అధ్వానంగా ఉంది. ఈ రోడ్డుపై ఎమ్మెల్యే బాలరాజు, పీఓ ఆర్వీ సూర్యనారాయణ కొంత మేర ద్విచక్ర వాహనంపై, మరి కొంతమేర కాలినడకన నిత్యావసర వస్తువులు మోసుకుంటూ వెళ్లి మోతుగూడెం గిరిజనులకు అందించారు. మోతుగూడెంలో ప్రభుత్వ పథకాల అమలుపై కొండరెడ్డి గిరిజనులను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే బాలరాజు గొడ్డు కారంతో భోజనం భోజన సమయం దాటే సరికి మోతుగూడెం చేరుకున్న ఎమ్మెల్యే బాలరాజు, పీఓ సూర్యనారాయణ గ్రామానికి చెందిన గోగుల కమలమ్మ అనే కొండరెడ్డి గిరిజన మహిళ ఇంట్లో గొడ్డు కారంతో భోజనం చేశారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వం అందించిన సాయం మర్చిపోలేమని కమలమ్మ ఆనందం వ్యక్తం చేసింది. విపత్తు సమయంలోనూ పథకాలు ఇంటి వద్దకే రావడం చాలా బాగుందని ఆమె చెప్పారు. పార్టీ నాయకులు ఆరేటి సత్యనారాయణ, కరాటం కృష్ణస్వరూప్, అల్లూరి రత్నాజీరావు, గగ్గులోతు మోహన్‌రావు, కారం వాసు, యాక్షన్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ గురుదత్త ప్రసాద్,కో–ఆర్డినేటర్లు టి.జ్యోతిబాబు, ఎం.సాల్మన్ రాజు, జి.మోహన్, కిరణ్ పాల్గొన్నారు. -
బైక్‌పై వెళ్లి గిరిజనులను ఓదార్చిన ఎమ్మెల్యే
సాక్షి, బుట్టాయగూడెం: లాక్డౌన్ నేపథ్యంలో మారుమూల కొండ ప్రాంతాల్లో గిరిజనుల యోగ క్షేమాలు తెలుసుకునేందుకు, వారికి స్వయంగా సహాయం అందించేందుకు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 15 రోజులుగా కొండ కోనల్లో బైకుపై ఆయన ప్రయాణిస్తున్నారు. శనివారం దొరమామిడి, అచ్చియ్యపాలెంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు. -
‘వైఎస్ జగన్‌ను అంబేద్కర్‌లా చూస్తున్నారు’
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కాంట్రాక్టు పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని వెనుకబడిన వర్గాల ప్రజలంతా అంబేద్కర్, పూలే, కొమరం భీంతో కీర్తిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తెల్లం బాలారాజు అన్నారు. చారిత్రాత్మక చట్టాన్ని రూపొందించిందుకు ఆయన కృతజ్ఞత తెలిపారు. మంగళవారం ఆయన శాసనసభ సమావేశాల్లో మాట్లాడుతూ.. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇప్పటికీ చాలా వెనుకబడి ఉన్నారని అన్నారు. మన రాష్ట్రంలో ఆ విధంగా ఉన్నవారిని అభివృద్ధి చేసేందుకు వైఎస్ జగన్ గొప్ప ఆలోచన చేశారని అభినందించారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారి ఆశయం కోసం సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకుని, అనేక పాదయాత్రల ద్వారా పేద ప్రజలను కష్టాలను దగ్గర నుంచి చూసిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి సీఎం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని బాలారాజు అన్నారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం దేశ చరిత్రంలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని చెప్పుకొచ్చారు. ఇలాంటి గొప్ప ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేస్తోందుకు ఎంతో గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. సభలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంపై విమర్శలు తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో కేవలం పచ్చచొక్కాల నేతలకు మాత్రమే పనులు జరిగేవని ఆరోపించారు. కేవలం ఒక్కసామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కేవని, దోచుకున్నవాడికి దోచుకున్నంతగా ఉండేదని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులన్నింటిపైనా విచారణకు ప్రభుత్వం ఆదేశించాలని ఆయన కోరారు. అలాగే దానిపై శ్వేతపత్రం కూడా విడుదల చేయాలన్నారు. గత ప్రభుత్వంలా కాకుండా ప్రస్తుతం సీఎం అందరకీ సమాన అవకాశాలు కల్పించాలని కీలక చట్టాన్ని తీసుకువచ్చినట్లు వివరించారు. -
‘ఆయన్ని ఎదురించే సత్తా బాబుకు లేదు’
సాక్షి, పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, ఎవరితో కలిసి వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదురించే సత్తా లేదని వైఎస్సార్ సీపీ నేతలు తెల్లం బాలరాజు, పుప్పాల వాసుబాబులు అన్నారు. శనివారం ద్వారకా తిరుమల మండలం సీహెచ్ పోతేపల్లిలో ఉన్న పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ వద్ద రైతు దీక్ష చేస్తున్న తలారికి సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చంద్రబాబును పచ్చి రాజకీయ అవకాశవాదిగా అభివర్ణించారు. చంద్రబాబు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఒక సిద్ధాంతం గాని, ఒక విధానం కానీ లేనే లేవని విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల ఆశీస్సులతో, ఆదరణతో అధికారంలోకి రాలేదన్నారు. పార్టీ స్థాపించిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడన్నారు. ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడని వ్యాఖ్యానించారు. 2014లో బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడే తప్ప తన మీద తనకు నమ్మకం లేదన్నారు. 2019 సంవత్సరం ఎన్నికల్లో టీడీపీ గల్లంతు అవుతుందని తెలిసి పార్టీని తీసుకువెళ్లి సోనియాగాంధీ కాళ్ళ ముందు తాకట్టు పెట్టాడని మండిపడ్డారు. వారు తమ ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే సత్తా లేక మొన్న ఎయిర్ పోర్టులో పందెంకోడి కత్తితో ఆయనపై దాడి దాడి చేయించిన నైజం చంద్రబాబుది. వైఎస్ జగన్‌పై జరిగిన దాడి త్రుటిలో తప్పడం వలన తన గుట్టు రట్టవుతుందనే భయంతో హుటా హుటిన ఢిల్లీ పారిపోయి తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ కాళ్ల దగ్గర పెట్టిన ఘనుడు చంద్రబాబు. చంద్రబాబు నాయుడు కుట్రలు, కుతంత్రాలు రాష్ట్ర ప్రజలకే కాక దేశ ప్రజలందరికీ తెలుస’’ని అన్నారు. -
ఆళ్ల నాని నియామకంపై బాలరాజు హర్షం
జంగారెడ్డిగూడెం : వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్‌గా ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని)ని నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం శుభదాయకమని ఆ పార్టీ మాజీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు అన్నారు. శుక్రవారం జంగారెడ్డిగూడెంలో ఆయన నివాసం వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆళ్ల నాని నాయకత్వం జిల్లాకు అవసరమని చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ తానే జిల్లా కన్వీనర్ పదవికి రాజీనా మా చేశానని బాలరాజు చెప్పారు. పార్టీ బలోపేతానికి నానితో పాటు కృషి చేస్తానని ఆయన తెలిపారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి మాట్లాడుతూ ఆళ్ల నాని సమర్థ్ధత కలిగి న నాయకుడన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ పార్టీ కన్వీనర్ చనమాల శ్రీనివా స్, జీలుగుమిల్లి మండల కన్వీనర్ బోధా శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించి అధికార పగ్గాలు చేపట్టిన చంద్రబాబునాయుడు మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారని బాలరాజు చెప్పారు. రుణమాఫీ, డ్వాక్రా సంఘాల రుణాల రద్దు చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు బండారం మూడు నెలలకే తెలిసిపోయిందని విమర్శించారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రుణమాఫీ ఊసే ఎత్తకపోవడం దారుణమన్నారు. -
హామీలను నెరవేర్చే వరకు పోరాడుతాం
* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు * టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శ బుట్టాయగూడెం, న్యూస్‌లైన్ : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. ప్రజల సమస్యల తరఫున పోరాడుతూ వారికి అండగా నిలుస్తామని చెప్పారు. సోమవారం దుద్దుకూరులోని ఆయన స్వగృహంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ అభ్యర్థులను బెదిరిస్తూ టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందని బాలరాజు ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని, చేనేత రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుందని పాతవి మాఫీ చే స్తే రైతులు కొత్త రుణాలు తీసుకోవటానికి ఎదురు చూస్తున్నారన్నారు. కోటేశ్వరరావు, కుశంపూడి శేషు, సాకా కిషంజర్, మాడిశెట్టి నరశింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్‌ను విమర్శిస్తే ప్రజలు పాతరేస్తారు
కొయ్యలగూడెం, న్యూస్‌లైన్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబంపై విమర్శలు చేస్తే ప్రజలు టీడీపీకి పాతరేస్తారని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం బాలరాజు నారా లోకేష్‌ను హెచ్చరించారు. లోకేష్ వైఎస్ కుటుం బంపై విమర్శలు చేయడాన్ని ఆయన ఖండించారు. సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో బాలరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కుటుంబ సభ్యుల ఆప్యాయతలకు అర్థం తెలియని ద్రోహి చంద్రబాబేనని, ఆయన కడుపున పుట్టిన లోకేష్ కుతంత్రంతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పిల్లనిచ్చిన మామ, తమ్ముడు, తోడల్లుడు, బావమరుదులతో సహా అందరినీ మోసగించి ఛీ కొట్టించుకున్న ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. పట్టుమని పదిమంది రోడ్‌షోకు జనం రాలేదన్న అక్కసుతో మహానేత కుటుంబంపై అవాకులు, చవాకులు పేల్చి తన లోకేష్ తన ఉక్రోషాన్ని బహిర్గతం చేసుకున్నారన్నారు. భూమి మొత్తం మీద అత్యంత అపనమ్మకమైన వ్యక్తి ఎవరని క్విజ్ నిర్వహిస్తే ఆబాలగోపాలం సైతం టక్కున నారా చంద్రబాబునాయుడు అని సమాధానమిస్తారని బాలరాజు ఎద్దేవా చేశారు. వందలాది మంది ప్రాణత్యాగంతో తన తండ్రి కోసం అసువులు బాసిన వారి కుటుంబాలను ఆదుకోవడం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తే రాజకీయ మనుగడ కోసం టీడీపీ చేసిన దుష్ర్పచారాన్ని ప్రజలు తిప్పికొట్టిన సంగతి మరిచిపోయావా అని ప్రశ్నించారు. హంగు, ఆర్భాటం, మద్యం, డాంబికాలు టీడీపీది అయితే ఆత్మాభిమానం, అశేష ప్రజాబలం వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంతమని బాలరాజు తెలిపారు. అచ్యుతాపురం లో ఆయన గడప గడపకు వైఎస్సార్ సీపీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గీతకార్మికుడి అభిమానంతో అందించిన కల్లును సేవించారు. అనంతరం శ్రీరంగపట్నంలో యాదవ కుల సంఘం సభ్యులు బహుకరించిన కంబలి, గొర్రెపిల్ల, గొల్లకర్రలను అందజేశారు. త్రినాథపురం, బర్కెట్నగర్లో బాలరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ యూత్ నాయకులు నిర్వహించిన బైక్ ర్యాలీ ప్రజలను ఆకట్టుకుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, పోతన శేషు, తాడికొండ మురళి, మేకల అన్నవరం తదితరులు బాలరాజు వెంట ఉన్నారు. -
కుమ్మక్కు రాజకీయాలను ఓటుతో తిప్పికొట్టండి
పోలవరం, న్యూస్‌లైన్ : ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలను ఓటు హక్కుతో తిప్పి కొట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపునిచ్చారు. మండలంలోని రేపల్లెవాడలో దాపర్తి మోహన్‌రావు ఇంటి వద్ద మంగళవారం ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. రాజన్నరాజ్యం జగన్మోహన్రెడ్డి వల్లే సాధ్యం అన్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అమ్మ ఒడి, డ్వాక్రా రుణాల రద్దు, రైతులకు గిట్టుబాటు ధర వంటి పథకాలను అమలు చేస్తారన్నారు. అనంతరం ఎంపీటీసీ అభ్యర్థుల ఖరారుపై కార్యకర్తలతో చర్చించారు. ప్రగడవల్లి ఎంపీటీసీ స్థానానికి దాపర్తి మోహన్‌రావును, ఎల్ఎన్డీ పేటకు కె.సత్యవతి, పట్టిసీమకు సబ్బవరపు విజయలక్ష్మిని ఎంపిక చేసినట్లు బాలరాజు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే పూనెం సింగన్న దొర, పార్టీ మండల కన్వీనర్ సుంకర వెంకటరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు మైగాపుల దుర్గాప్రసాద్, స్వచ్ఛంద సంస్థ డెరైక్టర్ అనిల్‌కుమార్, మిడియం విజయలక్ష్మి, తెలగంశెట్టి మంగన్నదొర పాల్గొన్నారు. -
ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబు
రెడ్డిగణపవరం (బుట్టాయగూడెం), న్యూస్‌లైన్ : అధికారం కోసం ఆచరణ సాధ్యం కాని హామీలిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజలను మోసగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు విమర్శించారు. బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరంలో విశ్వేశ్వర అన్నపూర్ణ, కనకదుర్గమ్మను ఆదివారం బాలరాజు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాలరాజు విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ఇస్తున్న హామీలను రాష్ట్ర ప్రజలు నమ్మేస్థితిలో లేరని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతగా ఉండగా విభజనకు లేఖ ఇచ్చి రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చారని, అధికారం ఇస్తే మరింత అధ్వానంగా తయారు చేస్తారని ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం, రుణాల మాఫీ అంటూ చంద్రబాబు ఇస్తున్న హామీలు నెరవేర్చడం ఎవరివల్లా కాదని, ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త పార్టీలు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని వాటివల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు. ఆ పార్టీలకు కనీసం డిపాజిట్లు కూడా రావన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే విభజనను అడ్డుకోలేకపోయారని ఇప్పుడు జై సమైకాంధ్ర పేరుతో కొత్త పార్టీని స్థాపిస్తే ప్రజలు నమ్మేస్థితిలో లేరని విమర్శించారు. ఒక్కటిగా కలిసి ఉన్న తెలుగుజాతిని విడగొట్టడంలో ప్రధానపాత్ర పోషించిన బీజేపీని సీమాంధ్రలో ప్రజలు తరిమికొట్టాలని పిలుపు నిచ్చారు. వైసీపీతోనే సీమాంధ్ర అభివృద్ధి సాధ్యమని బాలరాజు చెప్పారు. తమ పార్టీ ప్రకటించిన అమ్మఒడి, పింఛన్లు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, రైతుకు మద్దతుధర అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తాయన్నారు. వీటితో పాటు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని చెప్పారు. మాటతప్పని మడమ తిప్పని నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. ఆయన వెంట పార్టీ నేతలు గద్దే వీరకృష్ణ, సర్పంచ్ కోర్స బాలకృష్ణ, అల్లూరి రంగారావు, యాదాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
టీబిల్లుకు బీజేపీ మద్దతు సిగ్గుచేటు
బుట్టాయగూడెం న్యూస్‌లైన్ : రాష్ట్ర పునర్విభజన బిల్లుకు బీజేపీ మద్దతు ఇవ్వటం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. బుట్టాయగూడెంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సోనియాగాంధీని ఈదేశం నుంచి తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రాలను అడ్డగోలుగా విభజించి ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. సోనియా కనుసన్నల్లోనే కిరణ్ పనిచేస్తూ రాష్ట్ర విభజనకు సహకరించారని దుయ్యబట్టారు. తెలుగుజాతి సమైక్యంగా ఉంచేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిందేమీ లేదన్నారు. ఓ పక్క రాష్ట్ర విభజన ప్రక్రియ జరుగుతున్నా ఎంపీలు కుంభకర్ణుడిలా నిద్రపోయారని ఎద్దేవా చేశారు. రెండు, మూడు రోజుల్లో పదవీకాలం ముగిసిపోతుండడంతో రాజీనామాలు చేస్తున్నట్టు నటించి ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏపార్టీ నుంచి పోటీ చేయాలో అని ఆలోచనలో పడ్డారన్నారు. ఎంపీ లగడపాటి తన దగ్గర బ్రహ్మస్త్రం ఉందని మాయమాటలు చేప్పి ప్రజలను నమ్మించి మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు అధికారం కోసం బీజేపీతో కుమ్మకైందని విమర్శించారు. బీజేపీ, టీడీపీ రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంబిస్తున్నాయని అన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎంత దిగజారుడు రాజకీయలకైనా సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. ఆయన వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరేటి సత్యనారాయణ, రేపాకుల చంద్రం, కరాటం కృష్ణ స్వరూప్, గట్టుముక్కల మల్లికార్జునరావు, దాకే శ్రీదేవి, కొదం కడియ, కోరం దుర్గారావు, కుక్కల లక్ష్మణరావు, గాడి వెంకటరెడ్డి, వెట్టి మాధవ ఉన్నారు. -
'కృష్ణంరాజు టీడీపీ, కాంగ్రెస్ కోవర్ట్'
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. మాట తప్పని మడమ తిప్పని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రజాదరణ చూసి కాంగ్రెస్, టీడీపీ కుట్రపన్నుతోందని ఆయన ఆరోపించారు. రఘురామకృష్ణంరాజు తన స్థాయి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. వైఎస్ జగన్‌ను విమర్శించే స్థాయి ఆయనకు లేదన్నారు. రఘురామ కృష్ణంరాజు టీడీపీ, కాంగ్రెస్ కోవర్ట్ అంటూ ధ్వజమెత్తారు. రఘురామరాజు పార్టీలో ఉన్నది 90రోజులేనని బాలరాజు చెప్పారు. స్వార్థ ప్రయోజనాలకోసం ఆయన పార్టీలో చేరారని ఆరోపించారు. ప్రయోజనాలు నెరవేరవనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేశారని బాలరాజు విమర్శించారు. -
కృష్ణంరాజు అవకాశవాది: వైఎస్సార్ సీపీ
-
కృష్ణంరాజు అవకాశవాది: వైఎస్సార్ సీపీ
హైదరాబాద్: స్వార్థ ప్రయోజనాల కోసమే కనుమూరి రఘురామ కృష్ణంరాజు పార్టీని వీడారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు విమర్శించారు. రఘురామ కృష్ణంరాజు కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ అని ఆరోపించారు. డబ్బు మదంతో వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ను విమర్శించే స్థాయి ఆయనకు లేదని అన్నారు. రఘురామ కృష్ణంరాజు అవకాశవాది అని నరసాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు. రాజకీయ అవకాశవాదంతో జగన్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల పార్టీ అని చెప్పారు. తనను నమ్ముకున్న వారికి జగన్ అన్యాయం చేయరని అన్నారు. నరసాపురంలో ఎవరి సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. రఘురామ కృష్ణంరాజు లాంటి నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. తాను సూచించిన వారికే టిక్కెట్లు ఇవ్వాలని జగన్ పై ఆయన ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. పార్టీని నమ్ముకున్న వారిని కాదని టిక్కెట్లు ఇచ్చేది లేదని కృష్ణంరాజుకు జగన్ స్పష్టం చేశారని చెప్పారు. నిన్నటివరకు సమైక్య రాష్ట్రం కోసం పోరాడిన ఏకైక నేత జగన్ అంటూ ప్రశంసించిన ఆయన ఇప్పడు అవకాశవాదంతో తమ నాయకుడిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాగా, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ బాధ్యతల నుంచి రఘురామ కృష్ణంరాజును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలగించింది. నియోజవర్గంలో అసెంబ్లీ సమన్వయకర్తల ఫిర్యాదుల మేరకు ఈ చర్య తీసుకున్నట్టు వైఎస్సార్ సీపీ తెలిపింది. -
'పదవి కోసం వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవద్దు'
చింతలపూడి(పశ్చిమగోదావరి జిల్లా): కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు సమైక్యవాదం వినిపించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. కావూరి పర్యటిస్తున్న ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను ముందస్తుగా అరెస్టు చేయడం సరికాదన్నారు. పరుష వ్యాఖ్యలు చేసిన కావూరి సమైక్యవాదులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 3 నెలల మంత్రి పదవి కోసం వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవద్దని కావూరికి బాలరాజు హితవు పలికారు. తాను సమైక్యవాదినని ఊరూవాడా ప్రచారం చేసుకున్న కావూరి సాంబశివరావు కేంద్ర మంత్రి అయ్యూక సమైక్యవాదులపైనే విరుచుకుపడుతున్నారు. మంత్రి పదవి పొందాక సమైక్య వాదానికి గుడ్‌బై చెప్పిన ఆయన జిల్లాకు వచ్చినప్పుడు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇదేమని ప్రశ్నించిన వారిని దూషించడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. -
విభజనను అడ్డుకుందాం
జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనను అడ్డుకోవడమే ఏకైక లక్ష్యంగా వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ పోరుబాట సాగిస్తోందని పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు చెప్పా రు. సోమవారం ఇక్కడ నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. రాష్ట్ర విభజన నిర్ణయూనికి నిరసనగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈనెల 6, 7 తేదీల్లో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే రహదారుల దిగ్భంధం కార్యక్రమాన్ని విజయవంతం చేయూలని పార్టీ శ్రేణులకు, సమైక్యవాదులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనను నిలుపుదల చేయాలని కోరుతూ సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమాలు ఎగసిపడుతున్నప్పటికీ ప్రజల మ నోభావాలను అర్థం చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం విభజన ప్రక్రియను వేగవంతం చేయడం దుర్మార్గమన్నారు. ఇందుకు నిరసనగా 48 గంటలపాటు రహదారుల దిగ్బం ధం చేయడానికి వైసీపీ పూనుకుం దన్నారు. అన్నివర్గాల ప్రజలు, సమైక్యవాదులు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, ఉపాధ్యాయులు, ఎన్జీవోలు, ఇతర జేఏసీ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.