టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు.
* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు
* టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శ
బుట్టాయగూడెం, న్యూస్‌లైన్ : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. ప్రజల సమస్యల తరఫున పోరాడుతూ వారికి అండగా నిలుస్తామని చెప్పారు. సోమవారం దుద్దుకూరులోని ఆయన స్వగృహంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
తమ పార్టీ అభ్యర్థులను బెదిరిస్తూ టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందని బాలరాజు ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని, చేనేత రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుందని పాతవి మాఫీ చే స్తే రైతులు కొత్త రుణాలు తీసుకోవటానికి ఎదురు చూస్తున్నారన్నారు. కోటేశ్వరరావు, కుశంపూడి శేషు, సాకా కిషంజర్, మాడిశెట్టి నరశింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.