
'పదవి కోసం వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవద్దు'
చింతలపూడి(పశ్చిమగోదావరి జిల్లా): కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు సమైక్యవాదం వినిపించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. కావూరి పర్యటిస్తున్న ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను ముందస్తుగా అరెస్టు చేయడం సరికాదన్నారు. పరుష వ్యాఖ్యలు చేసిన కావూరి సమైక్యవాదులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 3 నెలల మంత్రి పదవి కోసం వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవద్దని కావూరికి బాలరాజు హితవు పలికారు.
తాను సమైక్యవాదినని ఊరూవాడా ప్రచారం చేసుకున్న కావూరి సాంబశివరావు కేంద్ర మంత్రి అయ్యూక సమైక్యవాదులపైనే విరుచుకుపడుతున్నారు. మంత్రి పదవి పొందాక సమైక్య వాదానికి గుడ్‌బై చెప్పిన ఆయన జిల్లాకు వచ్చినప్పుడు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇదేమని ప్రశ్నించిన వారిని దూషించడం ఆయనకు అలవాటుగా మారిపోయింది.