
కుమ్మక్కు రాజకీయాలను ఓటుతో తిప్పికొట్టండి
పోలవరం, న్యూస్‌లైన్ : ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలను ఓటు హక్కుతో తిప్పి కొట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపునిచ్చారు. మండలంలోని రేపల్లెవాడలో దాపర్తి మోహన్‌రావు ఇంటి వద్ద మంగళవారం ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. రాజన్నరాజ్యం జగన్‌మోహన్‌రెడ్డి వల్లే సాధ్యం అన్నారు.
జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అమ్మ ఒడి, డ్వాక్రా రుణాల రద్దు, రైతులకు గిట్టుబాటు ధర వంటి పథకాలను అమలు చేస్తారన్నారు. అనంతరం ఎంపీటీసీ అభ్యర్థుల ఖరారుపై కార్యకర్తలతో చర్చించారు. ప్రగడవల్లి ఎంపీటీసీ స్థానానికి దాపర్తి మోహన్‌రావును, ఎల్‌ఎన్‌డీ పేటకు కె.సత్యవతి, పట్టిసీమకు సబ్బవరపు విజయలక్ష్మిని ఎంపిక చేసినట్లు బాలరాజు ప్రకటించారు.
మాజీ ఎమ్మెల్యే పూనెం సింగన్న దొర, పార్టీ మండల కన్వీనర్ సుంకర వెంకటరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు మైగాపుల దుర్గాప్రసాద్, స్వచ్ఛంద సంస్థ డెరైక్టర్ అనిల్‌కుమార్, మిడియం విజయలక్ష్మి, తెలగంశెట్టి మంగన్నదొర పాల్గొన్నారు.