బుట్టాయగూడెం న్యూస్‌లైన్ :
రాష్ట్ర పునర్విభజన బిల్లుకు బీజేపీ మద్దతు ఇవ్వటం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. బుట్టాయగూడెంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సోనియాగాంధీని ఈదేశం నుంచి తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రాలను అడ్డగోలుగా విభజించి ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. సోనియా కనుసన్నల్లోనే కిరణ్ పనిచేస్తూ రాష్ట్ర విభజనకు సహకరించారని దుయ్యబట్టారు. తెలుగుజాతి సమైక్యంగా ఉంచేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిందేమీ లేదన్నారు. ఓ పక్క రాష్ట్ర విభజన ప్రక్రియ జరుగుతున్నా ఎంపీలు కుంభకర్ణుడిలా నిద్రపోయారని ఎద్దేవా చేశారు. రెండు, మూడు రోజుల్లో పదవీకాలం ముగిసిపోతుండడంతో రాజీనామాలు చేస్తున్నట్టు నటించి ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏపార్టీ నుంచి పోటీ చేయాలో అని ఆలోచనలో పడ్డారన్నారు.
ఎంపీ లగడపాటి తన దగ్గర బ్రహ్మస్త్రం ఉందని మాయమాటలు చేప్పి ప్రజలను నమ్మించి మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు అధికారం కోసం బీజేపీతో కుమ్మకైందని విమర్శించారు. బీజేపీ, టీడీపీ రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంబిస్తున్నాయని అన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎంత దిగజారుడు రాజకీయలకైనా సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. ఆయన వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరేటి సత్యనారాయణ, రేపాకుల చంద్రం, కరాటం కృష్ణ స్వరూప్, గట్టుముక్కల మల్లికార్జునరావు, దాకే శ్రీదేవి, కొదం కడియ, కోరం దుర్గారావు, కుక్కల లక్ష్మణరావు, గాడి వెంకటరెడ్డి, వెట్టి మాధవ ఉన్నారు.
టీబిల్లుకు బీజేపీ మద్దతు సిగ్గుచేటు
Published Fri, Feb 21 2014 1:46 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement