అభివృద్ధిపై రాజకీయం చేయ్యోద్దు: వెంకయ్య
చెన్నై: రాజధానిలోనే అన్ని ప్రధాన కేంద్రాల నిర్మాణం సరియైన నిర్ణయం కాదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. విభజన బిల్లు ప్రకారమే రెండు రాష్ట్రాలకు కేంద్రం సహకరిస్తుందని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
ఇరు రాష్ట్రాల సీఎంలు కేంద్రాన్ని సంప్రదిస్తే నిబంధనల ప్రకారం నిధుల కేటాయింపు జరుగుతుందని ఆయన అన్నారు. అభివృద్ధిపై రాజకీయం చేయ్యోద్దని వెంకయ్యనాయుడు అన్నారు. గత అనుభావాలరీత్యా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే మంచిదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.