
సాక్షి, పశ్చిమ గోదావరి: పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజును ఆంధ్రపద్రేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. కరోనా బారిన పడి కోలుకుంటున్న బాలరాజుకు సీఎం జగన్ ఆదివారం ఫోన్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కరోనా నుంచి కోలుకొని ప్రజాసేవలోకి రావాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఎమ్మెల్యే బాలరాజుకు కరోనా పాజిటివ్ రావడంతో ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారు.