
సాక్షి, పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, ఎవరితో కలిసి వచ్చినా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఎదురించే సత్తా లేదని వైఎస్సార్ సీపీ నేతలు తెల్లం బాలరాజు, పుప్పాల వాసుబాబులు అన్నారు. శనివారం ద్వారకా తిరుమల మండలం సీహెచ్ పోతేపల్లిలో ఉన్న పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ వద్ద రైతు దీక్ష చేస్తున్న తలారికి సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చంద్రబాబును పచ్చి రాజకీయ అవకాశవాదిగా అభివర్ణించారు.
చంద్రబాబు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఒక సిద్ధాంతం గాని, ఒక విధానం కానీ లేనే లేవని విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల ఆశీస్సులతో, ఆదరణతో అధికారంలోకి రాలేదన్నారు. పార్టీ స్థాపించిన ఎన్‌టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడన్నారు. ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడని వ్యాఖ్యానించారు. 2014లో బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడే తప్ప తన మీద తనకు నమ్మకం లేదన్నారు.
2019 సంవత్సరం ఎన్నికల్లో టీడీపీ గల్లంతు అవుతుందని తెలిసి పార్టీని తీసుకువెళ్లి సోనియాగాంధీ కాళ్ళ ముందు తాకట్టు పెట్టాడని మండిపడ్డారు. వారు తమ ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఎదుర్కొనే సత్తా లేక మొన్న ఎయిర్ పోర్టులో పందెంకోడి కత్తితో ఆయనపై దాడి దాడి చేయించిన నైజం చంద్రబాబుది. వైఎస్ జగన్‌పై జరిగిన దాడి త్రుటిలో తప్పడం వలన తన గుట్టు రట్టవుతుందనే భయంతో హుటా హుటిన ఢిల్లీ పారిపోయి తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ కాళ్ల దగ్గర పెట్టిన ఘనుడు చంద్రబాబు. చంద్రబాబు నాయుడు కుట్రలు, కుతంత్రాలు రాష్ట్ర ప్రజలకే కాక దేశ ప్రజలందరికీ తెలుస’’ని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment