k.sivakumar
-
‘లీకేజీ పెద్దలను కఠినంగా శిక్షించాలి’
ఎంసెట్ - 2 లీకేజీ వ్యవహారంలో సూత్రధారులతో పాటు, వారికి సహకరించిన అధికారులను, పరోక్షంగా ప్రోత్సాహం అందించిన రాష్ట్ర మంత్రులను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంసెట్ -2 విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏదైతే కోరుకొంటున్నారో దానికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పారు. ఎంసెట్ పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించలేదని, దీనిపై ఉన్న శ్రద్ధ, పరీక్షను కట్టుదిట్టంగా నిర్వహించాలన్న విషయంపై ఎందుకు లేదన్నారు. సీఎం కేసీఆర్ ఫౌంహౌస్‌లో ఉండి ఏ పంటలు వెస్తే బాగుంటుందని అక్కడివారితో ఆలోచిస్తున్నారని తెలిపారు. అదే సమయంలో సెక్రటరియేట్ ఎందుట తమ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆందోళన చేస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఎందుకు లేదని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ కాస్తా లికేజీల తెలంగాణగా మారిందని ఎద్దేవా చేశారు. -
సోనియా ఎందుకు స్పందించలేదు? : శివకుమార్
హైదరాబాద్: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణ వార్త విని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల వారిని ఆదుకుంటామని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పిన విషయాన్ని వైఎస్ఆర్ సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ గుర్తు చేశారు. ఇప్పటివరకు ఆమె ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాదయాత్ర వల్ల ఒరిగింది ఏమీలేదని ఆయన అన్నారు. ఆయన రైతు భరోసా యాత్ర కాంగ్రెస్ నేతల కోసమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు 108 ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు. 108 వాహనం అందుబాటులో లేక ఎవరైనా మరణిస్తే కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని శివకుమార్ అన్నారు. -
టీడీపీతో ఈనాడు కుమ్మక్కై .... జగన్ వ్యతిరేక వార్తలు రాస్తోంది
ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: ఈనాడు దినపత్రిక.. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న కేసుల వివరాలను ప్రచురిస్తూ ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడుతోందని, ఈ అంశంపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ శనివారం ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు అందజేశారు. నెలరోజులుగా వస్తున్న ‘ఈనాడు ఎన్నికల ప్రత్యేకం’ పేజీల్లో న్యాయస్థానాల్లో జగన్, వైఎస్‌పై విచారణలో ఉన్న కేసుల వివరాలను ప్రచురిస్తున్నారని, ఇలాంటివి ఎన్నికల వార్తలకింద ప్రచురించడం ‘సబ్‌జ్యుడిస్’ అవుతుందని వినతిపత్రంలో పేర్కొన్నారు.ఈనాడు, టీడీపీ రెండూ కలిసి ఈ ఎన్నికల్లో జగన్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు విచారణలో ఉన్న కేసుల వివరాలనేగాక.. తప్పుడు వార్తలను కూడా ప్రచురిస్తున్నాయని ఆయన ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అత్యధిక సర్క్యులేషన్ గలదిగా ఆ యాజ మాన్యం చెప్పుకుంటున్న ఈనాడు తన పాఠకులను ప్రభావితం చేయాలన్న దురుద్దేశ ంతోనే ఇలాంటి వార్తలను ప్రచురిస్తోందన్నారు. సరిగ్గా ఎన్నికల ముం దుగా టీడీపీ, ఈనాడు చేతులు కలిపి ఇలా ఒక రాజకీయపార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడం తీవ్ర అభ్యంతరకరమేగాక, ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపారు. ఒక రాజకీయ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు టీడీపీ ఒక దినపత్రికను సాధనంగా ఎన్నికల తరుణంలో వాడుకోవడం, తద్వారా ఓటర్ల సానుభూతి పొందాలని చూడటం తీవ్రంగా ఖండించాల్సిన అంశమని అభిప్రాయపడ్డారు.ఈ విషయంలో ఈనాడు-టీడీ పీల కుమ్మక్కుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.