ఎంసెట్ - 2 లీకేజీ వ్యవహారంలో సూత్రధారులతో పాటు, వారికి సహకరించిన అధికారులను, పరోక్షంగా ప్రోత్సాహం అందించిన రాష్ట్ర మంత్రులను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంసెట్ -2 విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏదైతే కోరుకొంటున్నారో దానికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పారు. ఎంసెట్ పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించలేదని, దీనిపై ఉన్న శ్రద్ధ, పరీక్షను కట్టుదిట్టంగా నిర్వహించాలన్న విషయంపై ఎందుకు లేదన్నారు.
సీఎం కేసీఆర్ ఫౌంహౌస్‌లో ఉండి ఏ పంటలు వెస్తే బాగుంటుందని అక్కడివారితో ఆలోచిస్తున్నారని తెలిపారు. అదే సమయంలో సెక్రటరియేట్ ఎందుట తమ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆందోళన చేస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఎందుకు లేదని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ కాస్తా లికేజీల తెలంగాణగా మారిందని ఎద్దేవా చేశారు.