కె.శివకుమార్
హైదరాబాద్: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణ వార్త విని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల వారిని ఆదుకుంటామని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పిన విషయాన్ని వైఎస్ఆర్ సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ గుర్తు చేశారు. ఇప్పటివరకు ఆమె ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాదయాత్ర వల్ల ఒరిగింది ఏమీలేదని ఆయన అన్నారు. ఆయన రైతు భరోసా యాత్ర కాంగ్రెస్ నేతల కోసమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు 108 ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు. 108 వాహనం అందుబాటులో లేక ఎవరైనా మరణిస్తే కేసీఆర్పై కేసు నమోదు చేయాలని శివకుమార్ అన్నారు.