ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్‌ను కలిసిన ఉత్తమ్ దంపతులు
సాక్షి, న్యూఢిల్లీ: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మభ్య పెట్టి, వాస్తవాలను దాచి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కు మార్‌రెడ్డి విమర్శించారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.67 వేల కోట్లుగా ఉన్న అప్పులను తొమ్మిదిన్నరేళ్లలో ఏకంగా రూ.4.50 లక్షల కోట్లకు పెంచేశారని ధ్వజమెత్తారు.
బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ కొను గోళ్లకు సంబంధించి రూ.81 వేల కోట్లు, పౌర సర ఫరాల శాఖకు సంబంధించి రూ.56 వేల కోట్లు అప్పులున్నాయని తేలిందని, ఇరిగేషన్‌కు సంబంధించి రూ.10 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని ఉత్తమ్ తెలిపారు.
ఇరిగేషన్, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, మేడిగడ్డ కుంగిన ఘటనలపై విచారణ జరుగుతుందని, విచారణను జాతీయ సంస్థలతో చేయించాలా లేక రాష్ట్ర సంస్థలతోనా? అన్నది ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయిస్తామని మంత్రి చెప్పారు. మేడిగడ్డ డిజైన్, నిర్వహణ లోపాలకు ఎవరు బాధ్యులన్నది తేలుస్తామన్నారు.
సోనియా, రాహుల్‌తో భేటీ
హుజూర్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన నేపథ్యంలో ఉత్తమ్ బుధవారం తన ఎంపీ పదవికి రాజీ నామా చేశారు. స్పీకర్ ఓంబిర్లాను కలిసి రాజీ నామా పత్రం అందజేశారు. అనంతరం తన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతితో కలిసి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో భేటీ అయ్యారు. తనకు మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment