పథకం ప్రకారం ఓట్లు తొలగించారు | Telangana opposition party leaders met Banwarlal | Sakshi
Sakshi News home page

పథకం ప్రకారం ఓట్లు తొలగించారు

Published Tue, Oct 6 2015 5:25 PM | Last Updated on Sun, Sep 3 2017 10:32 AM

పథకం ప్రకారం ఓట్లు తొలగించారు

పథకం ప్రకారం ఓట్లు తొలగించారు

హైదరాబాద్ : నోటిసులు ఇవ్వకుండా ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్రెడ్డి ఆరోపించారు. సనత్నగర్ నియోజకవర్గంలో బతికున్న వాళ్ల పేర్లు కూడా తొలగించారని ఆయన తెలిపారు. చట్టవిరుద్ధంగా ఓట్లు తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన భన్వర్లాల్కు విజ్ఞప్తి చేశారు.

మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్లాల్ను తెలంగాణలోని ప్రతిపక్ష నేతలు కలిశారు.  అనంతరం ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు మర్రి శశిధర్రెడ్డి, ఎన్ ఇంద్రసేనారెడ్డి విలేకర్లతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పథకం ప్రకారం ఓట్లు తొలగించారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్ ఇంద్రసేనారెడ్డి చెప్పారు. ఈ అంశంపై అధికారులు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలతో కలిపి నిజనిర్ధారణ చేయించాలని భన్వర్లాల్కు వారు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement