
'ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయవద్దు'
హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ను శుక్రవారం కలిశారు. తెలంగాణలో వరంగల్, ఖమ్మం, గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయోద్దంటూ భన్వర్లాల్ను ఆయన కోరారు. ఈ మూడు కార్పొరేషన్లలో మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున ఈ నోటిఫికేషన్ విడుదల ఇప్పుడే వద్దంటూ రాంచంద్రరావు ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేశారు.