ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నోటీసులు జారీ
Published Sun, Oct 2 2016 12:37 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
– నవంబర్ 5 వరకు దరఖాస్తులకు అవకాశం
కర్నూలు(అగ్రికల్చర్): ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదుకు శనివారం శ్రీకారం చుట్టారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదయ్యేందుకు నోటీసు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లావ్యాప్తంగా తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాయాలు, గ్రామ పంచాయతీలు, పోలీసుస్టేషన్ నోటీసు బోర్డుల్లో పెట్టారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా నోడల్ అధికారి ఈశ్వర్ మాట్లాడుతూ.... పట్టభద్రులు, ఉపాధ్యాయుల్లో అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకు అనుగుణ ంగా ప్రచారం, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నవంబరు 5వరకు ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గత ఎన్నికల్లో పట్టభద్రుల ఓటర్లు జిల్లాలో 71,103 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 4,101 మంది ఉన్నారన్నారు. ప్రస్తుత ఎన్నికలకు ఆ జాబితా చెల్లదని, తాజాగా దరఖాస్తులు స్వీకరించి ఓటరు జాబితాను తయారు చేయాల్సి ఉందని వివరించారు.
Advertisement
Advertisement