ఏప్రిల్‌లో ఓటింగ్‌ | Manchu Vishnu Voter Movie Release Date Announced | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌లో ఓటింగ్‌

Published Tue, Mar 5 2019 1:14 AM | Last Updated on Tue, Mar 5 2019 1:14 AM

Manchu Vishnu Voter Movie Release Date Announced - Sakshi

మంచు విష్ణు

రాజకీయ నాయకులు పదవిలోకి రావాలన్నా, పోవాలన్నా ఓటే ముఖ్యం. అది వేసే ఓటర్‌ మరింత ముఖ్యం. ప్రస్తుతం ఓటును, ఓటర్‌ బాధ్యతను గుర్తు చేస్తూ మంచు విష్ణు ఓ చిత్రంలో నటించారు. ‘ఓటర్‌’ అనే టైటిల్‌తో రూపొందిన ఈ పొలిటికల్‌ డ్రామాకు జి.ఎస్‌.కార్తిక్‌ దర్శకత్వం వహించారు. సురభి కథానాయిక. జాన్‌సుధీర్‌ పూదోట నిర్మాత.

ఈ సినిమా ఏప్రిల్‌లో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత జాన్‌ సుధీర్‌ మాట్లాడుతూ –  ‘‘మంచు విష్ణు తొలిసారి నటించిన పొలిటికల్‌ డ్రామా ఇది. ఓటు విలువను తెలియజేసే చిత్రం. షూటింగ్‌ మొత్తం పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్, కెమెరా: రాజేష్‌ యాదవ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిరణ్‌ తనమల.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement