సందేశం + వినోదం | Manchu Vishnu's Voter to release in June | Sakshi
Sakshi News home page

సందేశం + వినోదం

Published Mon, May 27 2019 2:38 AM | Last Updated on Mon, May 27 2019 2:38 AM

Manchu Vishnu's Voter to release in June - Sakshi

విష్ణు మంచు, సురభి

విష్ణు మంచు ఓటర్‌గా మారారు. ఓటర్‌గా ఓటు ప్రాముఖ్యతను చెప్పదలిచారు. ఇదంతా ‘ఓటర్‌’ సినిమా కోసమే. విష్ణు మంచు, సురభి జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఓటర్‌’. జి.ఎస్‌ కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధీర్‌ పూదోట నిర్మించారు. ఇటీవలే సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం యూ/ఎ సర్టిఫికెట్‌ పొందింది. ఈ సినిమాను జూన్‌లో రిలీజ్‌ చేయనున్నాం అని నిర్మాత తెలిపారు. ఈ సందర్బంగా నిర్మాత సుధీర్‌ మాట్లాడుతూ –‘‘ఓటు విలువ, ఓటర్‌ గురించి చెప్పే చిత్రమిది. చక్కని సందేశంతో పాటు వినోదం పంచే చిత్రం. దర్శకుడు కార్తీక్‌ చక్కగా తెరకెక్కించారు’’ అన్నారు. సంపత్, నాజర్, ప్రగతి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి తమన్‌ సంగీత దర్శకుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement