మారాలి.. మార్చాలి | Manchu Vishnu Voter Movie Teaser Release | Sakshi
Sakshi News home page

మారాలి.. మార్చాలి

Published Fri, Mar 15 2019 12:19 AM | Last Updated on Fri, Mar 15 2019 12:19 AM

Manchu Vishnu Voter Movie Teaser Release - Sakshi

మంచు విష్ణు

‘ఓటర్‌’... ఈ టాపిక్‌తోనే ప్రస్తుతం దేశ రాజకీయాలు హాట్‌ హాట్‌గా ఉన్నాయి. అతి త్వరలో ఎన్నికలు రానున్న తరుణంలో ‘ఓటర్‌’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మంచు విష్ణు. రమా రీల్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని జాన్ సుధీర్‌ పూదోట నిర్మిస్తున్నారు. జి.ఎస్‌ కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను గురువారం విడుదల చేసింది చిత్రబృందం. ‘అహింసా మార్గం ద్వారా ఒక్క బులెట్‌ కూడా కాల్చకుండా స్వాతంత్య్రం తెచ్చుకున్న దేశం మనది.. మనం పేదరికం పైన పోరాటం చేశాం కానీ పేదలపైన పోరాటం చేయలేదు... మార్పు మనలో రావాలి.. మారాలి.. మార్చాలి.. మొదటగా మనం మార్చాల్సింది దేశంలో ఉన్న రాజకీయాల నాయకులని..’ అంటూ ఆవేశంతో విష్ణు ఈ టీజర్‌లో డైలాగ్స్‌ చెప్పారు.

టీజర్‌లో హీరోతో విలన్‌ ‘నన్ను ట్రాక్‌లో పెట్టటానికి ఎవడ్రా నువ్వు’ అంటే... ఓటు వేసిన వేలును చూపిస్తూ ‘చుక్క కనపడట్లేదా... ‘ఓటర్‌’ అంటాడు హీరో. విలన్‌ ‘ఆఫ్ట్రాల్‌ ఓటర్‌’ అంటే ‘ఆఫ్ట్రాల్‌ ఓటర్‌ కాదు, ఓనర్‌’ అంటుంది విష్ణు పాత్ర. మంచు  విష్ణు సరసన సురభి జంటగా రూపొందుతున్న ఈ చిత్రానికి యస్‌.యస్‌. తమన్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిరణ్‌ తనమల.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement