john sudheer
-
మారాలి.. మార్చాలి
‘ఓటర్’... ఈ టాపిక్‌తోనే ప్రస్తుతం దేశ రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి. అతి త్వరలో ఎన్నికలు రానున్న తరుణంలో ‘ఓటర్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మంచు విష్ణు. రమా రీల్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని జాన్ సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. జి.ఎస్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను గురువారం విడుదల చేసింది చిత్రబృందం. ‘అహింసా మార్గం ద్వారా ఒక్క బులెట్ కూడా కాల్చకుండా స్వాతంత్య్రం తెచ్చుకున్న దేశం మనది.. మనం పేదరికం పైన పోరాటం చేశాం కానీ పేదలపైన పోరాటం చేయలేదు... మార్పు మనలో రావాలి.. మారాలి.. మార్చాలి.. మొదటగా మనం మార్చాల్సింది దేశంలో ఉన్న రాజకీయాల నాయకులని..’ అంటూ ఆవేశంతో విష్ణు ఈ టీజర్లో డైలాగ్స్ చెప్పారు. టీజర్లో హీరోతో విలన్ ‘నన్ను ట్రాక్‌లో పెట్టటానికి ఎవడ్రా నువ్వు’ అంటే... ఓటు వేసిన వేలును చూపిస్తూ ‘చుక్క కనపడట్లేదా... ‘ఓటర్’ అంటాడు హీరో. విలన్ ‘ఆఫ్ట్రాల్ ఓటర్’ అంటే ‘ఆఫ్ట్రాల్ ఓటర్ కాదు, ఓనర్’ అంటుంది విష్ణు పాత్ర. మంచు విష్ణు సరసన సురభి జంటగా రూపొందుతున్న ఈ చిత్రానికి యస్.యస్. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ తనమల. -
వేరుశనగలో సూక్ష్మపోషకాల లోపం
అనంతపురం అగ్రికల్చర్ : రబీ పంటగా నీటి వసతి కింద జిల్లా వ్యాప్తంగా 18 నుంచి 20 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగయ్యే వేరుశనగలో సూక్ష్మపోషకాల (మైక్రోన్యూట్రియంట్స్) లోపం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చని కళ్యాణదుర్గం కృషి విజ్ఞానకేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్ తెలిపారు. ఈనెల 15వ తేదీ వరకు విత్తుకునేందుకు మంచి సమయమన్నారు. నీటిలో నాణ్యతా ప్రమాణాలు లోపించడం, నీటి తడులు సక్రమంగా పాటించకపోవడం వల్ల సాధారణంగా సూక్ష్మధాతులోపాలు ఏర్పడుతాయని తెలిపారు. సూక్ష్మధాతులోపం–నివారణ : + కాల్షియం లోపం ఏర్పడితే కాయలపై ఉన్న పొట్టు సరిగా అభివృద్ధి కాదు. కాయలు లొత్తగా మారుతాయి. గంధకం లోపం ఏర్పడితే ఆకులు లేత పసుపుపచ్చగా తయారై ఈనెలు కూడా పసుపురంగులోకి మారుతాయి. నూనె శాతం తగ్గిపోతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఎకరాకు 200 కిలోల జిప్సం ఎరువును తొలిపూత సమయంలో వేయాలి. కలుపుతీసిన తరువాత మొక్కల మొదళ్ల దగ్గర సాళ్లలో వేసి తరువాత మట్టి ఎగదోయాలి. + ఇనుప ధాతులోపం ఏర్పడితే లేత ఆకులు పసుపుపచ్చగా తయారై తరువాత తెలుపురంగులోకి మారుతాయి. నివారణకు ఎకరాకు ఒక కిలో అన్నభేది + 200 గ్రాములు సిట్రిక్ ఆమ్లాన్ని 200 లీటర్ల నీటికి కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. + బోరాన్ లోపం ఏర్పడితే గింజ లోపలి భాగం నల్లగా మారుతుంది. నివారణకు 1 గ్రాము బోరిక్ ఆమ్లం లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. + జింక్‌ధాతు లోపం కనిపించిన ప్రాంతాల్లో పైరు ఆకులు చిన్నవిగా మారి గుబురుగా కనిపిస్తాయి. మొక్కల గిడసబారతాయి. ఆకు ఈనెల మధ్యభాగం పసుపురంగులోకి మారవచ్చు. నివారణకు ఎకరాకు 400 గ్రాముల చొప్పున జింక్‌సల్ఫేట్ 200 లీటర్ల నీటికి కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. -
కూరగాయల పంటల్లో సస్యరక్షణ
అనంతపురం అగ్రికల్చర్ : నవంబర్ మాసంలో కూరగాయల పంటలకు ఆశించే పురుగులు, తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్, శాస్త్రవేత్త ఆదినారాయణ తెలిపారు. ► మిరపలో ఎదబెట్టిన పొలాల్లో మూడవ దఫా కింద హెక్టారుకు 130 కిలోలు యూరియా, 40 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (ఎంవోపీ) ఎరువులు వేయాలి. నాటిన పొలాల్లో రెండో దఫా కింద కూడా పైన తెలిపిన విధంగా ఎరువులు వేసుకోవాలి. తెల్లనల్లి నివారణకు 3 గ్రాములు నీటిలో కరిగే గంధకం లేదా 5 మి.లీ డైకోఫాల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పేనుబంక నివారణకు 1.5 గ్రాములు అసిఫేట్ లేదా 2 మి.లీ మిథైల్డెమటాస్ లేదా 0.3 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. పూత పురుగు ఉన్నట్లు గమనిస్తే మొదట 1.25 మి.లీ ట్రైజోఫాస్, వారం రోజుల తర్వాత 2.5 మి.లీ క్లోరోఫైరిపాస్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పొలంగట్ల మీద కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. ఇటీవలి కాలంలో మిరపను ఎక్కువగా నష్టపరిచే జెమినీవైరస్, కుకుంబర్ మొజాయిక్ వైరస్, పీనట్ బ్లడ్ నెక్రోసిస్ వైరస్ల వ్యాప్తికి దోహదపడే రసంపీల్చు పురుగులైన తెల్లదోమ, పేనుబంక, తామరపురుగులను నివారించుకోవాలి. పొలంలో అక్కడక్కడా ఆముదం లేదా గ్రీసు పూసిన పసుపురంగు అట్టలు ఉంచితే తెల్లదోమ ఉనికి, ఉధృతి తెలుస్తుంది. అలాగే లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వైరస్ తెగులు సోకిన మొక్కలు పీకి నాశనం చేయాలి. అవసరాన్ని బట్టి నల్లరేగడి నేలలో 20 నుంచి 25 రోజులకోసారి, ఎర్రనేలల్లో 10 నుంచి 15 రోజులకోసారి నీటి తడులు ఇవ్వాలి. ► రబీ పంటగా ఉల్లిని ఇపుడు నారు పోసుకోవచ్చు. ఖరీఫ్‌లో సాగు చేసిన ఉల్లిని తొలగించవచ్చు. కోతలకు 15 రోజుల ముందుగా నీరు పెట్టడం ఆపివేయాలి. ఉల్లి నాటుకున్న 100 నుంచి 110 రోజుల సమయంలో 1 గ్రాము కార్బండిజమ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే గడ్డకుళ్లు చాలా వరు తగ్గుతుంది. గడ్డలు ఊరి 50 శాతం మొక్కల మొదళ్లు నేలకు వాలిపోగానే పీకి నీడలో ఒక వారం ఆరబెట్టి తర్వాత గ్రేడింగ్ చేసి నిల్వ చేసుకోవాలి. ► చామంతిలో పూర్తీగా విచ్చుకున్న పూలను తెంపి మార్కెట్‌కు తరలించాలి. రసం పీల్చు పురుగుల నివారణకు 1 గ్రాము అసిఫేట్Š‡ లేదా 2 మి.లీ డైమిథోయేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ► బంతిలో ప్రధాన కొమ్మల చివర్లను తుంచి పైపాటుగా సిఫారసు చేసిన ఎరువులు వేసుకోవాలి. ► నేలసంపంగికి రెండో దఫా ఎరువులు వేసుకోవాలి. మల్లెలో కొమ్మలు కత్తిరించాలి. -
కూరగాయల సాగులో సస్యరక్షణ శ్రీరామరక్ష
కూరగాయల సాగులో సస్యరక్షణ చర్యలు కీలకమని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎం.జా¯ŒSసుధీర్, ఉద్యాన శాస్త్రవేత్త ఆదినారాయణ తెలిపారు. ప్రస్తుతం సాగులో ఉన్న వివిధ రకాల కూరగాయల పంటల్లో పురుగులు, తెగుâýæ్ల నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల ఆవశ్యకతను వారు ‘సాక్షి’కి మంగళవారం తెలిపారు. ఆ వివరాలు వారి మాటల్లోనే... టమాటాకు ఆశించే కాయతొలచు పురుగు, లద్దె పురుగు ఉనికిని గుర్తించేందుకు ఎకరాకు నాలుగు చొప్పున లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయాలి. తొలిదశలో గుడ్ల సముదాయాన్ని నాశనం చేయాలి. ఎకరాకు 10 చొప్పున పక్షి స్థావరాలు ఏర్పాటు చేయాలి. ఎకరాకు 50 వేలు చొప్పున ట్రైకోగామా బదనికలు వదలాలి. ఎకరాకు 200 లీటర్లు ఎస్పీవీ ద్రావణం లేదా 400 గ్రాములు బీటీ సంబంధిత మందులు పిచికారీ చేయాలి. రెక్కల పురుగులు గుడ్లు పెట్టకుండా 5 శాతం వేపగింజల కషాయం లేదా వేప సంబంధిత మందులు పిచికారీ చేయాలి. లద్దె పురుగులు పెద్ద దశకు చేరుకున్నపుడు విషపు ఎరలు పెట్టాలి. ఈ పంటలో పోలద్దె పురుగులు తీవ్ర దశకు చేరుకున్నాక తవుడు, కిలో బెల్లం, 500 మి.లీ క్లోరోఫైరిపాస్లో తగినంత నీటిని కలిపి చిన్న ఉండలుగా తయారు చేసుకుని సాయంత్రం పొలంలో వెదజల్లాలి. కాయతొలచు పురుగు నివారణకు.. ఎకరా విస్తీర్ణంలో 200 గ్రాములు థయోడికార్బ్ లేదా 75 మి.లీ స్పైనోసాడ్ లేదా 300 గ్రాములు అసిఫేట్ లేదా 400 మి.లీ క్వినాల్పాస్ లేదా 500 మి.లీ క్లోరోఫైరిపాస్ మందులు పిచికారీ చేయాలి. ∙వంకాయల్లో కాయతొలచు పురుగు నివారణకు 2 గ్రాములు కార్బరిల్ లేదా ఒక మి.లీ మలాథియా¯ŒS లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. బ్యాక్టీరియా ఎండు తెగులు ఉన్న తోటల్లో ఎకరాకు 6 కిలోలు బ్లీచింగ్ పౌడర్‌ను నాటే ముందు వేయాలి. రసం పీల్చు పురుగుల నివారణకు 2 మి.లీ ఫాసలో¯ŒS లేదా పిప్రోనిల్ లేదా డైమిథోయేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ∙మిరపలో పైముడుత కింద ముడుత ఒకేసారి గమనించినపుడు ఎకరాకు 400 మి.లీ జోలో¯ŒS లేదా 300 గ్రాములు పెగాస¯ŒS లేదా 400 మి.లీ ఇంట్రీపీడ్ మందులను పిచికారీ చేయాలి. ∙పందిరి కూరగాయల పంటల్లో పెంకు పురుగుల నివారణకు 3 గ్రాములు కార్బరిల్ లేదా 2 మి.లీ క్లోరోఫైరిపాస్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. బూడిద తెగులు నివారణకు 1 మి.లీ డైనోక్యాప్ లేదా కార్బండిజమ్ లేదా హెక్సాకొనజోల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
కందికి ప్రమాదం
– సస్యరక్షణ చర్యలతో నివారణ – కళ్యాణదుర్గం కేవీకే కో ఆర్డినేటర్ జాన్‌సుధీర్ సూచన అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా 68 వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న కంది పంటకు శనగపచ్చపురుగుతో పాటు మారుకామచ్చల పురుగు (కాయతొలిచే పురుగు) ఆశించినందున సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కళ్యాణదుర్గం కషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్ తెలిపారు. మారుకామచ్చల పురుగు ఈ పురుగును వాడుకలో పూత లేదా గూడ పురుగు లేదా బూజు పురుగుగా పిలుస్తుంటారు. సరైన సమయంలో నివారించకపోతే కంది పంటకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పిల్ల పురుగులు పువ్వుమొగ్గలోని లేత భాగాలను తింటాయి. తర్వాత ఆకులు, పూత, పిందెలు, కాయలను కలిపి గూడుగా చేసుకుని లోపలే ఉండి తినడం వల్ల పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసుకుని గింజలను తింటాయి. కాయలోపల ఉండటం వల్ల నిర్మూలన మందుల ప్రభావం నుంచి తప్పించుకునే అవకాశాలు ఎక్కువ. ఈ పురుగు కందితో పాటు పెసర, మినుము, చిక్కుడు, వేరుశనగ, జనుము, జీలుగ వంటి పైర్లను కూడా ఆశించిస్తుంది. జీవితచక్రం మారుకా తల్లి రెక్కల పురుగు చిన్నదిగా ముందు రెక్కలు ముదురు గోధుమ రంగులోనూ, వెనుక రెక్కలు తెల్లగా ఉంటాయి. ముందు రెక్కలపై తెల్లటి గద ఆకారపు మచ్చలు ఉంటాయి. పగటి వేళ పంటలో మొక్కలను కదిలిస్తే రెక్కల పురుగులు ఎగరడం గమనించవచ్చు. విశ్రాంతి సమయంలో ఆకుల అడుగు భాగాన ఏటవాలుగా వేళాడుతూ కనబడుతాయి. రెక్కల పురుగులు పూమొగ్గలు, లేత ఆకులు, పిందెలపై ఒక్కొక్కటి 2 నుంచి 16 గుడ్లను పెడుతుంది. ఐదు నుంచి ఆరు రోజుల్లో 150 నుంచి 200 గ్రుడ్లను పెడుతుంది. తెల్లగా, చిన్నగా ఉండటం వల్ల గుడ్లను గుర్తించడం కష్టం. గుడ్ల నుంచి నాలుగైదు రోజుల్లో తెల్ల రంగులో పిల్లలు బయటకు వచ్చి నాలుగైదు రోజుల్లోనే శరీరంపై నల్లటి మచ్చలు కనిపిస్తాయి. సస్యరక్షణ పొలంచుట్టూ కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. పైరు పూత దశకు రాకమునుపే 5 శాతం వేపగింజల కషాయం లేదా 5 మి.లీ వేపనూనె లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. వేప సంబంధిత మందులు వికర్షకాలుగా పనిచేయడం వల్ల రెక్కల పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. పూత దశలో అక్కడక్కడ కొన్ని పూమొగ్గలను సేకరించి వాటిని తెరచి పిల్ల పురుగులు ఉనికిని గమనించాలి. ఉన్నట్లు కనిపిస్తే 2.5 మిల్లీలీటర్ల క్లోరోఫైరిపాస్ లేదా 1 గ్రాము ధయోడికార్బ్ లేదా 1.5 గ్రాములు అసిఫేట్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. గూళ్లు కట్టినట్లు గమనిస్తే 1.5 గ్రాములు అసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరోఫైరిపాస్ లేదా 1 మిల్లీలీటర్ల నొవాల్యురాన్, 1 మి.లీ ల్యాంబ్డాసైహలోత్రిన్ లేదా 0.3 మి.లీ ఫ్లూబెండమైడ్ వీటిలో ఏదో ఒక మందుకు ఊదర స్వభావం కలిగిన 1 మి.లీ డైక్లోరోవాస్ మందును ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. అవసరమైతే మందులను మార్చి రెండు మూడు సార్లు పూత, కాయ దశలో పిచికారి చేసుకుంటే ఫలితం ఉంటుంది. -
పండ్ల తోటల్లో ‘అక్టోబర్’ యాజమాన్యం
అనంతపురం అగ్రికల్చర్ : ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఈ నెలలో పండ్లతోటలకు ఆశించే చీడపీడలు, తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కళ్యాణదుర్గం కషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్, ఉద్యాన శాస్త్రవేత్త ఆదినారాయణ తెలిపారు. ఏ తోటలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇలా వివరించారు. మామిడి తోటల్లో... – మామిడిని ఆశించే ఆకుమచ్చ, కొమ్మ ఎండు తెగులు నివారణకు ఒక లీటరు నీటిలో ఒక గ్రాము కార్బండిజమ్ కలిపి పిచికారీ చేయాలి. – బెరడు లేదా కాండం తొలిచే పురుగులను నివారించాలంటే రంధ్రాల్లో ఉన్న పురుగులను ఇనుప చువ్వలతో తీసివేయాలి. తర్వాత ఆ రంధ్రాల్లో డైక్లోరోవాస్ మందు ద్రావణం లేదా పెట్రోల్‌లో ముంచిన దూదిపెట్టి బంకమట్టితో మూసివేయాలి. చెట్లకు నీరు పెట్టడం ఆపేయాలి. – పిండి పురుగులు గమనిస్తే 2 శాతం మిథైల్ పెరాథియాన్ పొడిమందు చల్లిన మట్టితో చెట్టు చుట్టూ కప్పేయాలి. వీటి పిల్లపురుగులు చెట్ల కాండం మీదకు పాకకుండా శీతాకాలంలో చెట్టు మొదళ్లకు భూమి నుంచి ఒక అడుగు ఎత్తులో ఒక అడుగు నిడివి కలిగిన పాలిథీన్ షీట్ కాండం చుట్టూ చుట్టి దానిపైన గ్రీసు పూయాలి. పైకిపోలేని పిల్ల పురుగులు గుంపులుగా గుమికూడతాయి. పదునైన చాకుతో వీటిని గీకివేసి నాశనం చేయవచ్చు. లేదంటే ఒక లీటరు నీటిలో 2 మిల్లీలీటర్ల పాస్ఫామిడాన్ కానీ, లేదా ఒక మిల్లీలీటరు డైక్లోరోవాస్ కానీ లేదా 0.3 మిల్లీలీటరు ఇమిడాక్లోప్రిడ్ కానీ కలిపి పిచికారీ చేసుకోవాలి. సీతాఫలం తోటల్లో... – ఫక్వానికి వచ్చిన సీతాఫలం కాయలను కోసేయాలి. కాయతొలిచే ఈగ ఆశించిన కాయలను, రాలిన కాయలను ఏరివేసి కాల్చిపారేయాలి. ఈగ ఆశించిన తోటల్లో మిథైల్ యూజినాల్ ఎరలు ఎకరాకు నాలుగైదు చొప్పున చెట్ల కొమ్మలకు వేలాడదీయాలి. అరటి తోటల్లో... అరటి తోటల్లో కలుపు లేకుండా శుభ్రం చేసుకోవాలి. అవసరాన్ని బట్టి నీరు పెడుతుండాలి. చెట్టు చుట్టూ వచ్చే పిలకలను ఎప్పటికప్పుడు తీసేయాలి. తెల్ల చక్కెరకేళి రకానికి మూడవ దఫా కింద 110 గ్రాముల యూరియా, 80 గ్రాముల ఎంవోపీ ఎరువు వేసుకోవాలి. దానిమ్మ తోటల్లో... దానిమ్మ తోటల్లో కత్తిరింపులు చేసిన తర్వాత సిఫారసు చేసిన మోతాదుల్లో ఎరువులు వేయాలి. కాపునకు వచ్చిన తోటల్లో ప్రతి మొక్కకూ సాలీనా 30 నుంచి 40 కిలోల పశువుల ఎరువు, 625 గ్రాముల నత్రజని, 250 గ్రాముల భాస్వరం, 250 గ్రాముల పొటాష్ ఎరువులు రెండు దఫాలుగా వేయాలి. మొదటి తడికి ముందు ఒకసారి, కాయ ఎదిగే దశలో మరోసారి వేసుకోవాలి. కొత్తగా వచ్చిన చిగుర్లపైన బ్యాక్టీరియా మచ్చతెగులు లక్షణాలు, శిలీంధ్ర మచ్చ తెగులు లక్షణాలు కనిపిస్తే పది లీటర్ల నీటికి 2.5 గ్రాముల స్ట్రెప్టోసైక్లీన్, 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి పిచికారీ చేయాలి. -
పత్తిలో గుడ్డిపూలు నివారించుకోండి
అనంతపురం అగ్రికల్చర్ : పత్తిలో గుడ్డిపూలు గుర్తించి నివారించుకుంటే మంచిదని, ఈ ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా రెండు మూడు దశల్లో 28,885 హెక్టార్ల విస్తీర్ణంలో పత్తిపంట సాగు చేశారని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్ తెలిపారు. పంట ప్రస్తుతం 30 నుంచి 60 రోజుల వయస్సులో ఉందని, ఈ దశలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ప్రమాదకరమైన గులాబీ రంగు పురుగుతోపాటు మిగతా చీడపీడలు, తెగుళ్లు వ్యాపించకుండా నివారించుకోవచ్చన్నారు. గుడ్డిపూలు గుర్తించడం ఇలా: గతేడాది పత్తిపంటకు నవంబర్‌లో గులాబీరంగు పురుగు గుర్తించడంతో అప్పటికే పంట బాగా దెబ్బతినడంతో రైతులకు ఎక్కువగా నష్టం జరిగింది. దీంతో ఈ ఏడాది శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ ముందస్తు చర్యలు చేపట్టి రైతులను అప్రమత్తం చేశారు. ఇటీవల శాస్త్రవేత్తల క్షేత్రస్థాయి పంట పొలాల పరిశీలనలో గుత్తి, తాడిపత్రి, ఉరవకొండ, రాయదుర్గం డివిజన్ల పరిధిలో గులాబీరంగు పురుగు ఉనికికి గుర్తించారన్నారు. పంట పొలాల్లో గుడ్డి పూలు ఉన్నట్లు కనిపించాయి. గుడ్డి పూలను రైతులు గుర్తించేలా అవగాహన ఉంటే తొలిదశలోనే పంట దెబ్బతినకుండా నివారించుకోవచ్చు. గొంగలి పురుగు గుడ్డు నుంచి బయటకు వచ్చి పూత, కాయ లోపలి భాగాల్లోకి చొచ్చుకెళ్లి నష్టాన్ని కలిగిస్తుంది. నివారణ చర్యలు: ఎకరా పొలంలో నాలుగు నుంచి ఎనిమిది చొప్పున లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. వరుసగా మూడు రోజుల పాటు ఒక్కో బుట్టలో ఎనిమిది పురుగులు కనిపించినా, పది పువ్వులో ఒక గుడ్డిపువ్వు ఉన్నట్లు గుర్తించినా, ఇరవై కాయలను కోస్తే అందులో రెండు గొంగలి పురుగులు కనిపించినా గులాబీరంగు పురుగు ఆశించినట్లు తెలుసుకోవాలి. అలాగే కాయ పైభాగంలో పురుగు బయటకు వచ్చే గుండ్రటి చిన్న రంధ్రం కనిపించినా, కాయ తొనల మధ్య గోడలపై గుండ్రంటి రంఘం ఉన్నా, గుత్తి పత్తి, రంగు మారిన పత్తి కనిపించినా పురుగు ఉధృతి ఉన్నట్లే లెక్క. గుడ్డిపూలు, రంగుమారినవి, రంధ్రాలున్న కాయలను ఏరివేసి నాశనం చేయాలి. పూత సమయంలో ఎకరానికి 60 వేల చొప్పున ట్రైకోగామా పరాన్నజీవులను వదలడం వల్ల పురుగు గ్రుడ్లను సమూలంగా నివారించుకోవచ్చు. ఉధృతిని బట్టి శాస్త్రవేత్తలు, అధికారుల సిఫారసు మేరకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.