కూరగాయల సాగులో సస్యరక్షణ శ్రీరామరక్ష | agriculture story | Sakshi
Sakshi News home page

కూరగాయల సాగులో సస్యరక్షణ శ్రీరామరక్ష

Nov 1 2016 11:38 PM | Updated on Jun 4 2019 5:04 PM

కూరగాయల సాగులో సస్యరక్షణ శ్రీరామరక్ష - Sakshi

కూరగాయల సాగులో సస్యరక్షణ శ్రీరామరక్ష

కూరగాయల సాగులో సస్యరక్షణ చర్యలు కీలకమని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.జా¯ŒSసుధీర్, ఉద్యాన శాస్త్రవేత్త ఆదినారాయణ తెలిపారు.

కూరగాయల సాగులో సస్యరక్షణ చర్యలు కీలకమని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.జా¯ŒSసుధీర్, ఉద్యాన శాస్త్రవేత్త ఆదినారాయణ తెలిపారు. ప్రస్తుతం సాగులో ఉన్న వివిధ రకాల కూరగాయల పంటల్లో పురుగులు, తెగుâýæ్ల నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల ఆవశ్యకతను వారు ‘సాక్షి’కి మంగళవారం తెలిపారు. ఆ వివరాలు వారి మాటల్లోనే...

టమాటాకు ఆశించే కాయతొలచు పురుగు, లద్దె పురుగు ఉనికిని గుర్తించేందుకు ఎకరాకు నాలుగు చొప్పున లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయాలి. తొలిదశలో గుడ్ల సముదాయాన్ని నాశనం చేయాలి. ఎకరాకు 10 చొప్పున పక్షి స్థావరాలు ఏర్పాటు చేయాలి. ఎకరాకు 50 వేలు చొప్పున ట్రైకోగామా బదనికలు వదలాలి. ఎకరాకు 200 లీటర్లు ఎస్‌పీవీ ద్రావణం లేదా 400 గ్రాములు బీటీ సంబంధిత మందులు పిచికారీ చేయాలి. రెక్కల పురుగులు గుడ్లు పెట్టకుండా 5 శాతం వేపగింజల కషాయం లేదా వేప సంబంధిత మందులు పిచికారీ చేయాలి. లద్దె పురుగులు పెద్ద దశకు చేరుకున్నపుడు విషపు ఎరలు పెట్టాలి. ఈ పంటలో పోలద్దె పురుగులు తీవ్ర దశకు చేరుకున్నాక తవుడు, కిలో బెల్లం, 500 మి.లీ క్లోరోఫైరిపాస్‌లో తగినంత నీటిని కలిపి చిన్న ఉండలుగా తయారు చేసుకుని సాయంత్రం పొలంలో వెదజల్లాలి.  

కాయతొలచు పురుగు నివారణకు..
ఎకరా విస్తీర్ణంలో 200 గ్రాములు థయోడికార్బ్‌ లేదా 75 మి.లీ స్‌పైనోసాడ్‌ లేదా 300 గ్రాములు అసిఫేట్‌ లేదా 400 మి.లీ క్వినాల్‌పాస్‌ లేదా 500 మి.లీ క్లోరోఫైరిపాస్‌ మందులు పిచికారీ చేయాలి.

∙వంకాయల్లో కాయతొలచు పురుగు నివారణకు 2 గ్రాములు కార్బరిల్‌ లేదా ఒక మి.లీ మలాథియా¯ŒS లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి. బ్యాక్టీరియా ఎండు తెగులు ఉన్న తోటల్లో ఎకరాకు 6 కిలోలు బ్లీచింగ్‌ పౌడర్‌ను నాటే ముందు వేయాలి. రసం పీల్చు పురుగుల నివారణకు 2 మి.లీ ఫాసలో¯ŒS లేదా పిప్రోనిల్‌ లేదా డైమిథోయేట్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి.   

∙మిరపలో పైముడుత కింద ముడుత ఒకేసారి గమనించినపుడు ఎకరాకు 400 మి.లీ జోలో¯ŒS లేదా 300 గ్రాములు పెగాస¯ŒS లేదా 400 మి.లీ ఇంట్రీపీడ్‌ మందులను పిచికారీ చేయాలి.   

∙పందిరి కూరగాయల పంటల్లో పెంకు పురుగుల నివారణకు 3 గ్రాములు కార్బరిల్‌ లేదా 2 మి.లీ క్లోరోఫైరిపాస్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. బూడిద తెగులు నివారణకు 1 మి.లీ డైనోక్యాప్‌ లేదా కార్బండిజమ్‌ లేదా హెక్సాకొనజోల్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement