భారీగా పెరిగిన బీజేపీ ఓటు బ్యాంక్
అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 14%.. ఇప్పుడు 35%
ఆరు నెలల్లోనే 37.35% నుంచి 16.68 శాతానికి తగ్గిన బీఆర్‌ఎస్ షేర్
కాంగ్రెస్‌కు అత్యధిక ఓట్లు వచ్చినా స్వల్ప ఆధిక్యతే
అప్పుడు 39.40% ఓట్లు.. ఇప్పుడు 40.10%
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర, జాతీయ రాజకీయ మార్పులకు అనుగుణంగా తెలంగాణ ఓటరు నాడి కనిపిస్తోంది. ఆరు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇచి్చన తీర్పుకు భిన్నంగా తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీలను గెలిపించి రాష్ట్ర ఓటర్లు తమ విలక్షణమైన తీరును మరోసారి చాటుకున్నారు. 2023 నవంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మొత్తం పోలయిన ఓట్లలో కాంగ్రెస్‌కు 39.40 శాతం వాటా ఇచ్చి 64 సీట్లు కట్టబెట్టి అధికారాన్ని అప్పగించిన ఓటర్లు..ఈసారి దానికి అదనంగా స్వల్ప ఆధిక్యతను కట్టబెట్టారు.
మొత్తం పోలయిన ఓట్లలో అత్యధికంగా 87,41,263 ఓట్లను సాధించిన కాంగ్రెస్ పార్టీ .. 40.10 శాతం ఓట్లతో రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లకు గాను 8 చోట్ల విజయం సాధించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 18 శాతం ఓట్లు మాత్రమే దక్కించుకొని మూడు సీట్లకు పరిమితమైన కాంగ్రెస్.. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా దాదాపు 40 శాతం ఓట్లు సాధించింది.
గణనీయంగా పెరిగిన బీజేపీ ఓటు షేర్
కాంగ్రెస్‌తో సమానంగా రాష్ట్రంలో 8 లోక్‌సభ సీట్లు గెలుచుకున్నప్పటికీ బీజేపీకి కాంగ్రెస్ కన్నా సుమారు 11 లక్షల ఓట్లు తక్కువ పోలయ్యాయి. అయితే కాంగ్రెస్ తర్వాత మొత్తం 76,47,424 ఓట్లను పొందడం ద్వారా 35.08 శాతం వాటాను కైవసం చేసుకుంది. బీజేపీకి గత నవంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేవలం 14 శాతం ఓట్లు మాత్రమే రాగా, ఆరు నెలల్లో అది 35 శాతానికి పెరగడం గమనార్హం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 22 శాతం ఓట్లు సాధించింది.
ఆరునెలల్లో అనూహ్యంగా..
ఈ పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో బాగా దెబ్బతిన్న పారీ్టగా బీఆర్‌ఎస్ నిలిచింది. ఆరునెలల క్రితం జరిగిన ఎన్నికల్లో 37.35 శాతం ఓట్లతో 39 సీట్లు సాధించి కాంగ్రెస్ తరువాత రెండో స్థానంలో నిలిచిన బీఆర్‌ఎస్.. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో బాగా వెనుకబడిపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 52 శాతం ఓట్లు సాధించి 9 సీట్లను గెలుచుకున్న ఈ పార్టీ ఈసారి ఒక్క సీటును కూడా సాధించలేదు. 16.68 శాతం ఓట్లతో (36,37,086) బీఆర్‌ఎస్ మూడో స్థానంలో నిలిచింది.
అయితే గత లోక్‌సభ ఎన్నికలతో పోల్చుకుంటే ఏకంగా 36 శాతం ఓట్లు ఆ పార్టీ కోల్పోయింది. జాతీయ స్థాయిలో ప్రధానిని నిర్ణయించే లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి జాతీయ పారీ్టలైన బీజేపీ, కాంగ్రెస్‌ల వైపు తెలంగాణ ఓటర్లు మొగ్గు చూపినట్లు అర్థమవుతోంది. ఇక హైదరాబాద్‌లో గెలిచిన ఎంఐఎం ఎప్పటిలాగే 3 శాతం ఓట్లను సాధించింది. నోటాకు గణనీయంగా 8,50,177 (3.9 శాతం) ఓట్లు పోలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment