యువతే కీలకం
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఓటరు నమోదుపై ఈసారి యువత అమితాసక్తిని ప్రదర్శించింది. అది భవిష్యత్తు రాజకీయాలను శాసించే స్థాయికి చేరింది. జిల్లాలో ఐదేళ్ల నాటి పరిస్థితులతో పోలిస్తే యువత ఓట్లు గణనీయంగా పెరిగాయి. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలన్న కృత నిశ్చయంతో యువత ఓటు హక్కుతో ముందుకు దూసుకెళ్తోంది. గతానికి భిన్నంగా ఎన్నికల సంఘం చేసిన ప్రయత్నాలు నూరు శాతం ఫలించాయి. విశ్వ విద్యాలయాలు, కళాశాలలలో ప్రత్యేకంగా ఓటరు నమోదుకు భారీ స్పందన లభించింది. దీంతో జిల్లాలో ఈ ఏడాది జనవరినాటికి 29,530 ఓట్లు పెరిగాయి. ఓటర్ల జాబితాలో 30 శాతం యువకులే. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు వారి అనుగ్రహానికి పావులు కదుపుతున్నాయి.
ఇదీ పరిస్థితి
యువ ఓటర్లు గత ఎన్నికల నుంచి ఇప్పటికీ, అనూహ్యంగా నాలుగు రెట్లు అధికంగా పెరిగా యి. 2009లో 18-19 ఏళ్ల వయసు కలిగిన నూతన ఓటర్లు 13,878 మాత్రమే నమోదు కాగా, ఈ సారి ఇప్పటికే 19,530 మంది ఓట ర్లుగా చేరారు. జిల్లా జనాభాకు అనుగుణంగా ఓటర్లు పెరిగినా, మొత్తం ఓటర్లలో యువకులు 30 శాతం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. మొత్తం 18,04,765 ఓట్లలో యువకులు సుమారుగా 5,41,218 వరకు ఉంటారని అధికారుల నివేదికలు చెప్తున్నాయి.
నిజామాబాద్ అర్బన్, ఆర్మూరు, బోధన్, బాన్సువాడలలో కొత్త ఓటర్ల లో అధిక శాతం యువ ఓటర్లు నమోదయ్యా రు. జిల్లా మొత్తంగా ఐదు నియోజకవర్గాల్లో యువ ఓటర్లు అత్యంత కీలకంగా మారనుం డగా, మున్సిపల్, ఎంపీటీసీ, జడ్‌పీటీసీ, అసెం బ్లీ ఎన్నికల్లో వారి అనుగ్రహం పొందేందుకు రాజకీయపార్టీలు ప్రయత్నాలు ప్రారంభిం చా యి. ఏదేమైనా ఇక భవిష్యత్ యువతదేన్న సం కేతాలు రాజకీయ పార్టీల్లో కదలిక తెస్తున్నాయి.
ఏమంటున్నారు చాలా మంది యువతీయువకులు ఈసారి ఓటు హక్కును వజ్రాయుధంగా మార్చుకుం టామని చెబుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరుణంలో తెలంగాణ వికాసంలో పాలు పంచుకుంటామన్నారు. ఉపాధి, విద్య, వైద్య అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇక పాత తరం రాజకీయానికి చెల్లుచీటీ ఇచ్చి కొత్త బంగారులోకంలోకి దారులు తీస్తామని చెబుతున్నారు. యువతను ఆదరించే, వారికి చక్కని భవితను కల్పించే నాయకత్వాన్ని తాము కోరుకుంటామని అంటున్నారు. జిల్లా, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి పాటు పడే యువ నాయకత్వానికి స్వాగతం పలుకు దామం టున్నారు.