
రాయిపూర్ : ఛత్తీస్‌గఢ్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 19 జిల్లాల్లో విస్తరించిన మొత్తం 72 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటల సమయానికి 71.93 శాతం పోలీంగ్ నమోదైంది. తొలి విడత పోలింగ్‌తో కలుపుకుంటే ఈసారి అసెంబ్లీ ఎన్నికల మొత్తం పోలింగ్ శాతం 74.17గా ఉందని డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేష్ సిన్హా తెలిపారు. పోలింగ్ సమయం ముగిసినప్పటికీ కొన్ని కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఉండడంతో వారిని పోలింగ్‌కు అనుమతిచ్చారు. కొన్ని చోట్ల పోలింగ్ కొనసాగుతోంది. క్యూలో ఉన్న ఓటర్లు ఓటు హక్కు వినియోగించిన అనంతరమే పోలింగ్ కేంద్రాలను మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ దృష్ట్యా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు.
మొత్తం 90 సీట్లలో 18 స్థానాలకు తొలి దశ పోలింగ్‌లో ఈ నెల 12న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 8 నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో తొలి దశలోనే పోలింగ్ పూర్తయింది. మిగిలిన మావో ప్రభావిత జిల్లాలైన గరియాబంద్, ధంతరి, మహాసముంద్, కబీర్దమ్, జష్‌పూర్, బల్‌రామ్‌పూర్ జిల్లాల్లో మంగళవారం పోలింగ్ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment