విష్ణు సినిమా పోస్టర్‌లో ఆ ఫొటోలెందుకు? | Vishnu Voter First Look Talk | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 25 2017 7:57 PM | Last Updated on Sat, Nov 25 2017 8:36 PM

Vishnu Voter First Look Talk - Sakshi - Sakshi

ఓటర్‌ సినిమా తెలుగు పోస్టర్‌

సాక్షి, తమిళసినిమా: ‘కురల్‌ 388’  (తెలుగు ఓటర్‌) చిత్రం కోలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ ద ఇండస్ట్రీగా మారింది. అందుకు కారణం ఆ చిత్ర పోస్టరే. టాలీవుడ్‌ యువ నటుడు మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో సురభి నాయకిగా నటిస్తోంది. సతీష్‌కుమార్‌ పూతోట తమిళం, తెలుగు భాషలలో భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు జీఎస్ .కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాజేశ్‌ యాదవ్‌ ఛాయాగ్రహణం, ఎస్‌ఎస్‌.థమన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న విడుదల చేశారు. 

విష్ణుతోపాటు ఆ పోస్టర్‌లో ప్రధాని నరేంద్రమోదీ, ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి, స్టాలిన్, విజయకాంత్‌.. (తెలుగు మూవీ పోస్టర్‌లో తెలుగు ప్రముఖ నేతల ఫొటోలను పొందుపరచ్చారు).. ఇలా జాతీయ, ప్రాంతీయ రాజకీయ నాయకుల ఫొటోలను పొందుపరచడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ పోస్టర్‌లో వారి ఫొటోలను పొందుపరచడంలో ఆంతర్యం ఏమిటన్న చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో గెలవడమే ప్రధానంగా ఇష్టం వచ్చినట్లు వాగ్దానాలు చేసి.. ఆ తరువాత వాటిని మరచిపోయే స్వార్థ రాజకీయనాయకుల ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కిందని చిత్ర వర్గాలు చెప్తున్నాయి. తిరువళ్లువర్‌ రాసిన ‘కురల్‌ -388’ రచన ఆధారంగా ఈ చిత్రంగా ఉంటుందని తెలిపాయి. చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుందనీ, డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement