ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూల్‌ విడుదల | voter list 2017 shedule | Sakshi
Sakshi News home page

ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూల్‌ విడుదల

Published Tue, Nov 1 2016 11:40 PM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM

voter list 2017 shedule

15న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన
డిసెంబర్‌ 14 వరకు కొత్తవి నమోదు
కాకినాడ సిటీ : ఓటర్ల జాబితా 2017 సవరణ ప్రక్రియకు ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈమేరకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. షెడ్యూల్‌ ప్రకారం జిల్లాలోని 19 నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాను ఈనెల 15న జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం ప్రకటించనుంది. ఓటర్ల జాబితా ప్రకటన సమయం నుంచి డిసెంబర్‌ 14 వరకు జిల్లా వ్యాప్తంగా కొత్త ఓటర్ల నమోదు జరుగుతుంది. ఈ జనవరిలో ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం ప్రస్తుతం జిల్లాలో 19 నియోజకవర్గాల్లోని 4,266 పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో 38,05,354 మంది ఓటర్లు ఉన్నారు. జాబితాలో డూప్లికేషన్లు, చనిపోయిన, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడంతో పాటు ఇప్పటి వరకు నమోదైన క్లెయిమ్‌లను పరిశీలించి మార్పులు, చేర్పులతో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. సవరణ ప్రక్రియలో 2017 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువత ఓటు హక్కు నమోదుతో పాటు ఓటు హక్కులేనివారు కూడా నమోదు చేసుకునేందుకు ఎన్నికల కమిష¯ŒS అవకాశం కల్పించింది. ఈనెల 15వ తేదీ నుంచి డిసెంబర్‌ 14వ తేదీ వరకు ఓటర్ల నమోదు ప్రక్రియను జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో చేపట్టనున్నారు. నవంబర్‌ 23, డిసెంబర్‌ 7వ తేదీల్లో ఓటర్ల జాబితా పరిశీలన నిమిత్తం గ్రామసభలు నిర్వహించి బూత్‌లెవెల్‌ అధికారులు ప్రదర్శిస్తారు. అదేవిధంగా నవంబర్‌ 20, డిసెంబర్‌ 11వ తేదీల్లో ప్రత్యేక క్యాంపుల ద్వారా బూత్‌లెవెల్‌ ఏజంట్స్, రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. డిసెంబర్‌ 28వ తేదీలోపు ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న దరఖాస్తుల పరిశీలన  ప్రక్రియను పూర్తి చేస్తారు. అలాగే జనవరి 5వ తేదీలోపు పరిశీలించిన దరఖాస్తులను ఆ¯ŒSలై¯ŒSలో డేటా ఎంట్రీ పూర్తిచేసి సప్లమెంటరీ జాబితాలను సిద్ధం చేస్తారు. అనంతరం 2017 జనవరి 16వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement