2019లో విడుదల కానున్న భారీ చిత్రాల్లో భారత్ ఒకటి. అలీ అబ్బాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, టబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పట్ల ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. టీజర్ రిలీజ్‌కు కొన్ని రోజుల ముందర సల్మాన్ తన అభిమానులకు ఓ ట్రీట్ ఇచ్చాడు. భారత్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు. ‘నా జుట్టు, గడ్డం నెరిసిపోవచ్చు.. కానీ నా జీవితం మాత్రం చాలా రంగులమయం’ అంటూ సల్మాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ అభిమానులను ఒకింత షాక్‌కు గురిచేసింది. కారణం ఈ పోస్టర్‌లో సల్మాన్ 70 ఏళ్ల వృద్ధిడిలా కనిపిస్తున్నారు.
సినిమాలో సల్మాన్ 20 ఏళ్ల యువకుడి నుంచి 70 ఏళ్ల వృద్ధుడి వరకు వివిధ రకాల లుక్స్‌లో కనిపిస్తారంటూ చిత్రబృందం మొదటి నుంచి చెబుతూనే ఉంది. దానిలో భాగంగానే సల్మాన్ ఇలా వృద్ధిడిగా ఉన్న గెటప్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఓ మనిషి, దేశం కలిసి చేసిన ప్రయాణం అంటూ పోస్టర్ మీద ఉన్న వ్యాఖ్యలు సినిమా పట్ల మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. పోస్టర్‌లో జాకీష్రాఫ్ కూడా ఉన్నారు. ఈ చిత్రంలో ఆయన సల్మాన్ తండ్రిగా కనింపిచనున్నారని సమాచారం. ఈ నెల 24న చిత్ర ట్రైలర్ విడుదల కానుంది. 2014లో వచ్చిన కొరియన్ హిట్ మూవీ ‘యాన్ ఓడ్ టు మై ఫాదర్’కి ‘భారత్’ హిందీ రీమేక్. ఈ ఏడాది ఈద్ స్పెషల్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment